Home /News /astrology /

DO THESE THING ON RAM NAVAMI 2022 TO GET GOOD LUCK RNK

Ram Navami 2022: శ్రీరామ నవమిరోజు ఈ ఒక్క పని చేయండి.. కోటిజన్మల పుణ్యం లభిస్తుంది..

శ్రీరామ నవమి 2022

శ్రీరామ నవమి 2022

Ram Navami 2022: ఈ సంవత్సరం నవమి తిథి ఏప్రిల్ 09 అర్థరాత్రి 01:23 నుండి ప్రారంభమవుతుంది. ఇది ఏప్రిల్ 11 తెల్లవారుజామున 03:15 వరకు ఉంటుంది.. రామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో శ్రీరాముడిని పూజించి, రామజన్మోత్సవాన్ని జరుపుకుంటారు.

ఇంకా చదవండి ...
Ram Navami 2022: ఈ సంవత్సరం రామ నవమి (Rama Navami) ఏప్రిల్ 10, ఆదివారం. చైత్ర శుక్ల నవమి రోజున అయోధ్య (Ayodhya) లో రాముడు జన్మించాడు. లంకాపతి రావణుడి దురాగతాల నుండి మూడు లోకాలను విముక్తి చేయడానికి విష్ణువు రామావతారం ఎత్తాడు. ఈ సంవత్సరం నవమి తిథి ఏప్రిల్ 09 అర్థరాత్రి 01:23 నుండి ప్రారంభమవుతుంది. ఇది ఏప్రిల్ 11 తెల్లవారుజామున 03:15 వరకు ఉంటుంది.. రామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో శ్రీరాముడిని పూజించి, రామజన్మోత్సవాన్ని జరుపుకుంటారు. రామ నవమి సందర్భంగా, మీరు కొన్ని సులువైన చర్యలతో మీ జీవితాన్ని ఆనందంగా ,సంతోషంగా మార్చుకోవచ్చు. రామ నవమికి ​​సంబంధించిన ఈ ఉపాయాల గురించి తెలుసుకుందాం.

ఆదర్శపురుషుడు ఏకపత్నివ్రతుడు  శ్రీరాముడు. అందుకే శ్రీరామనవమి రోజు సరైన మార్గంలో పూజ చేసుకుంటే ఏడాది మొత్తం బాగా కలిసివస్తుంది. ఈరోజు సీతారామ కల్యాణం జరిపిస్తారు. రామాయణంలోని కొన్ని శ్లోకాలను చదవాలి. పుత్రకామెష్టి యాగం సంతానం లేనివారికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కనీసం ఆ ఘట్టం చదివించుకోవచ్చు. స్వామివారి కల్యాణాన్ని తిలకించాలి. అక్షితాలు శిరస్సు మీద వెసుకున్నా అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

ఇది కూడా చదవండి: Ram Navami 2022: రామ నవమి రోజున ఈ 5 సులభమైన ఉపాయాలు చేస్తే.. మీ తలరాతే మారిపోతుందట..



అలాగే రాములవారి చిత్ర పటానికి గంధం, బొట్టుకాటుక పెట్టి పూలు సమర్పించాలి. రామరక్షస్తోత్రం చదవాలి. రామనవమి రోజు కల్యాణ మంత్రాలు తప్పక వినాలి. ఈరోజు పానకాన్ని శ్రీరాముడికి నివేదన చేసి, దాన్ని ఇంట్లో అందరూ పుచ్చుకోవాలి.కల్యాణం సమయంలోని తలంబ్రాలు పోయడం వీక్షించినవారికి ఆహారానికి లోటు ఉండదని అంటారు. ఈరోజు  రామనామం జపించాలి. రాములవారిని తులసిదళంతో, సీతమ్మతల్లిని మారేడు, హనుముంతుడిని తమలపాకులతో ఈరోజు పూజించాలి.ఆశేష లాభాలు కలుగుతాయి.

ఇది కూడా చదవండి: Sri rama navami 2022: శ్రీరామనవమిరోజు ఈ ఒక్క పనిచేస్తే.. ఏడాది మొత్తం అద్భుతాలే..



ముఖ్యంగా శ్రీరామనవమిరోజు వడపప్పు తయారు చేసి స్వామివారికి నివేదించాలి. రామాయణగాథ ఏదైనా చదువుకోవాలి. సీతారాములు ఆదర్శదంపతులు అందుకే ఈ ఒక్కరోజైనా భార్యభర్తలు పోట్లాడుకోకుండా ఉండాలి. కల్యాణ తలంబ్రాలు భద్రంగా దాచుకుంటారు. ఎవరైనా పెళ్లి సమయంలో తలంబ్రాల్లో సీతారాముల తలంబ్రాలు కొన్ని కలిపినా వారి దాంపత్యంలో ఏ లోటు ఉండదు. రాముడి ఆశీస్సులు ఉంటాయి.

(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)
Published by:Renuka Godugu
First published:

Tags: Sri rama navami 2020, Sri Rama navami 2021

తదుపరి వార్తలు