Home /News /astrology /

DO THESE THING ON EVERY MONTH LAST SUNDAY TO GET BLESSINGS OF LORD SURYA DEVA RNK

Sunday: నెలలో చివరి ఆదివారం ఈ ఒక్క పని చేస్తే.. మీ ప్రతి పనిలో విజయం పొందుతారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Sunday remedies: ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించే వ్యక్తికి ఎప్పుడూ ఏమీ లోటు ఉండదని నమ్ముతారు. కానీ నేటి బిజీ జీవితంలో ఇది సాధ్యం కాదు. మీరు ప్రతిరోజూ సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించడం సాధ్యం కాకపోతే, మీరు ప్రతి ఆదివారం ,ముఖ్యంగా నెల చివరి ఆదివారం సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించాలి. ఆదివారాన్ని లక్ష్మీదేవితో పాటు సూర్యదేవుని రోజుగా కూడా పరిగణిస్తారు.

ఇంకా చదవండి ...
ప్రతిరోజూ సూర్య భగవానుడికి (Surya deva) అర్ఘ్యం సమర్పించాలి. ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చే వ్యక్తికి ఏ లోటు ఉండదని ఒక నమ్మకం, కానీ నేటి బిజీ లైఫ్‌లో ఇది సాధ్యం కాదు. కాబట్టి మీరు ప్రతిరోజూ సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించడం సాధ్యం కాకపోతే, మీరు ప్రతి ఆదివారం (Sunday)  ,ముఖ్యంగా నెల చివరి ఆదివారం నాడు సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించాలి. ఆదివారాన్ని లక్ష్మీదేవితో పాటు సూర్యదేవుని రోజుగా కూడా పరిగణిస్తారు.

  • ఈ రోజున రాగి పాత్రలో బియ్యం పోసి ఎర్రటి పూలను సూర్య భగవానునికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సూర్య నారాయణుడు సంతోషిస్తాడు మీ ప్రతి కోరికను తీరుస్తాడు. ఈ రోజు అలాంటి కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. వీటిని చేయడం ద్వారా మీ పనుల్లో విజయం సాధించడం ప్రారంభమవుతుంది.

  • ఆదివారం నాడు ఇంటి సభ్యులందరూ కలసి పూజలు చేసి నుదుటిపై చందన తిలకం పెట్టుకోవాలి. ఆదివారం సూర్య నారాయణుడితో పాటు లక్ష్మీ దేవి రోజు కూడా ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, జీవితంలో మీకు ధన, ధాన్యాల కొరత ఉండదు.

  • ఆదివారం సాయంత్రం, శివుడు ,మాత గౌరీని ఏదైనా శివాలయంలో పూజించాలని ,అదే సమయంలో వారికి రుద్రాక్షను సమర్పించాలని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది.


ఇది కూడా చదవండి: Spider: మీ శరీరంపై సాలీడు పారిందా? అది దేనికి సంకేతమో ఎప్పుడైనా తెలుసుకున్నారా?



  • ఆదివారం నాడు సూర్య నారాయణుడు ,తల్లి లక్ష్మి అనుగ్రహం పొందడానికి, 'ఆదిత్య హృదయ స్తోత్' పఠించాలి, ఆదివారం ఈ పారాయణం చేయడం వల్ల ఇల్లు ఎల్లప్పుడూ ధన్యంతో నిండిపోతుందని నమ్ముతారు.

  • ఆదివారం నాడు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, సాయంత్రం ఆవు నెయ్యితో ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ధన, ధాన్యాలకు ఎప్పటికి లోటు ఉండదు.

  • ఆదివారం సాయంత్రం రావిఆకుపై మీ కోరికను రాసి, ప్రవహించే నీటిలో పడవేయాలి. తద్వారా మీ కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు.


ఇది కూడా చదవండి: గురుగ్రహం వల్ల నేటి నుంచి ఈ 5 రాశుల పంటపండనుంది.. మీ రాశి కూడా ఉందా?



  • ఆదివారం రోజున పిండి ముద్దలు చేసి చేపలకు ఆహారం ఇవ్వడం చాలా శ్రేయస్కరం. దీనితో పాటు పంచదార పిండిని కూడా ఆదివారం చీమలకు తినిపించాలి. ఇలా చేయడం ద్వారా, నిద్రపోతున్న అదృష్టం మేల్కొంటుంది. వ్యక్తికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు.


(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)
Published by:Renuka Godugu
First published:

Tags: Sun

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు