Vastu: ఈ మొక్కలను ఇంట్లో పెంచుతున్నారా? అయితే, వెరీ బ్యాడ్‌లక్‌!

వాస్తు ప్రకారం మనం ఎనిమిది దిక్కులకు ఏ విధంగా ప్రాధాన్యతను ఇస్తామో.. అదేవిధంగా మొక్కలకు కూడా వర్తిస్తుంది. ఇంటి ఆవరణలో ఏవేవో మొక్కలు పెట్టుకుంటే వాస్తుదోషం తప్పదు.

వాస్తు ప్రకారం మనం ఎనిమిది దిక్కులకు ఏ విధంగా ప్రాధాన్యతను ఇస్తామో.. అదేవిధంగా మొక్కలకు కూడా వర్తిస్తుంది. ఇంటి ఆవరణలో ఏవేవో మొక్కలు పెట్టుకుంటే వాస్తుదోషం తప్పదు.

  • Share this:
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో తులసీ, మనీప్లాంట్‌ వంటి మొక్కలు పెట్టుకుంటే మంచిదని భావిస్తారు. కానీ, వేదలతోపాటు, చైనా ఫెంగ్‌ షూయ్‌ Feng shui ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెట్టుకోకూడదని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

  • కొన్ని రకాల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచితే వాటివల్ల ఆ ఇంటికి నెగిటివ్‌ ఎనర్జీ వస్తుందట.
    గులాబీ మొక్క తప్ప ముల్ల జాతికి చెందినటువంటి బ్రహ్మజెముడు, నాగజెముడు వంటివి ఇంటి ఆవరణలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోడదు.

  • ఇక ఈమధ్య బాగా క్రేజ్‌ ఉన్న బొన్సాయి మొక్కలను ఇంట్లో పెట్టుకోకూడదని అంటున్నారు. ఎరుపు రంగు పూల మొక్కలు ఇంట్లో కాకుండా.. పెరట్లో పెట్టుకోవచ్చు.

  • అంతేకాదు, గోరింటాకు, చింతచెట్టు మొక్కలకు ఆత్మలకు నివాసం అని నమ్ముతారు. అందుకే ఆ ప్లాంట్లను పెట్టుకోకూడదు. ఇలాంటి చెట్టను సాధ్యమైనంత వరకు ఇంటికి దూరంగా పెంచాలి.

  • ముఖ్యంగా చెట్లను పెంచితే.. వాటి పాలన తప్పకుండా చూసుకోవాలి. ఎండిపోయిన మొక్కలు లేదా జీవం కోల్పోయిన వాటిని వెంటనే తీసేయాలి. అలాగే ఉంచినా.. వాడిపోయిన పూలను పెట్టుకున్నా దురదృష్టం వెంటాడుతుంది.

  • ఇక తుమ్మ చెట్టు కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు. దీని వల్ల ఇంట్లో ఉన్న వారితో గొడవలకు దారితీస్తుంది.


 మీకు తెలుసా.. భోజనం ఇలా చేస్తే దరిద్రమేనట!




  • పత్తి లేదా తాటి చెట్టు కూడా ఇంటి ఆవరణలో ఉంటే అశుభమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

  • కుండీల్లో పెంచుతున్న మొక్కలను ఇంటికి ఉత్తర, తూర్పు దిశలోనే గోడలపై ఉంచరాదు.

  • తూర్పు, ఈశాన్య దిశల్లో పొడవైన మొక్కలు ఉంటే ఆ ఇంటికి నెగిటీవ్‌ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుందట.

  • మొక్కలకు ఇంటి ఆవరణలో పెట్టుకుంటే దక్షిణ దిశలో పెట్టుకోవాలి. పెద్ద సైజు కుండీలు ఈ దిక్కున పెట్టుకోవచ్చు. అది అనుకూలమైన ప్రదేశం.

  • పాలుగారే మొక్కలు కూడా ఇంట్లో, ఆవరణలో అస్సలు పెట్టుకోకూడదు.

  • ఇంట్లో కలబంద పెంచితే చాలా మంచిది. ఈ మొక్కకు ఆధ్యాత్మిక శక్తితోపాటు సౌందర్య, ఆరోగ్య పరంగా కూడా ఉపయోగిస్తాం. దీన్ని ముఖ్యంగా తూర్పు దిక్కున ఏర్పాటు చేసుకుంటే మంచిది.

  • సాధ్యమైనంత వరకు తులసీ మొక్కను కూడా ఇంటికి దక్షిణ దిశలో పెట్టుకోవాలి. అసలు తులసి మొక్కను ఏ దిశలో పెట్టుకున్నా అనుకూల పరిస్థితులు ఉంటాయి. అందుకే తులసి మొక్కను ఎక్కువగా పెంచితే ఆ ఇంటి ప్రదేశం మంచి గాలితోపాటు పాజిటివ్‌ ఎనర్జీ కూడా ఆ ఇంటికి పెరుగుతుంది.

Published by:Renuka Godugu
First published: