ఆధ్యాత్మికంగా మనం ఎన్నో ఆచరణలు పాటిస్తాం. అలాగే ఏవి ఎక్కడ పెట్టాలో.. అక్కడ పెట్టాలి. అందుకే కొన్ని వాస్తు నియమాలు అనుసరించి పాటిస్తాం. అయితే, కొన్ని వస్తువలును బీరువా (Cupboard )లో అస్సలు పెట్టుకోకూడదు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఒకవేళ ఉన్నా.. వాటిని వెంటనే తీసేయండి. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.
సాధారణంగా మనం బీరువాలో పట్టు బట్టలు, ముఖ్యమైన డాక్యుమెంట్స్, బంగారం (Gold) వంటివి పెట్టుకుంటాం. అయితే.. బీరువాలోని లాకర్‌లో ఇనుముకు సంబంధించిన వస్తువులు పెట్టుకోకూడదు అంటారు. ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అల్మారాలో ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. మన వాహనాలకు సంబంధించిన స్పేర్ కీస్ కూడా బీరువాలో పెట్టుకూడదు. వాటిని భద్రపరచాలంటే బట్టలు పెట్టుకునే ఇతర ప్రాంతాల్లో పెట్టుకోవచ్చు. పాత సూట్ కేస్‌లో పెట్టుకోకూడదు.
ఇది కూడా చదవండి: ఈ 6 వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. అదృష్టం ఈవిధంగా వస్తుందట!
ముఖ్యంగా అప్పు ఇచ్చినా.. పుచ్చుకున్నా.. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, పొలానికి సంబంధించిన దస్తావేజులు, బ్యాంక్ పాస్‌బుక్ పెట్టుకోవచ్చు. అంటే డబ్బు వచ్చేవి లేదా వెళ్లే వాటికి సంబంధించిన పేపర్లు పెట్టుకోవాలి. బీరువా అంటే లక్ష్మి స్థానం. ఏదైనా ఇష్టదైవం ఫోటోను పెట్టుకోవచ్చు. అదేవిధంగా బీరువా మీద ఎటువంటి బరువు వస్తువులు పెట్టకూడదు. ముఖ్యంగా ఐరన్ వస్తువులు పెట్టుకోకూడదు. ఖరీదైన బట్టలు, వెండి, బంగారం సామాన్లు పెట్టుకోవచ్చు.
ఇది కూడా చదవండి: అమావాస్యలోపు ఈ ఒక్క పనిచేయకపోతే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే!
లాకర్ (Locker) పైన ఎటువంటి పాత దుస్తులు పెట్టవద్దు. బీరువాకు నలుమూలలా ఏ దుమ్మూధూళి లేకుండా చూసుకోవాలి. నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మన ఆదాయంతో ముడిపడి ఉంటుంది. ఇంట్లో పాత గిఫ్ట్‌లు కూడా ఉండకూడదు. అంటే గడియారం వంటివి పెట్టకూడదు. బీరువా పైభాగంలో కూడా దుమ్ము లేకుండా ఎప్పటì కప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి. వీలైతే దానిపై ఓం లేదా స్వస్తిక్ గీసుకోవాలి. పసుపు, కుంకుమతో అలకరించుకోవాలి. అల్మారాకు ముందు వైపున ఎదురుగా కూడా ఇలాగే గీసుకోవాలి. లాకర్‌లో వీలైతే పరిమళభరితమైన వస్తువులు పెట్టుకోవాలి. చెడు వాసన రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీ కటాక్షం పొందడానికి ఇవన్ని కచ్ఛితంగా ఆచరించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Vastu