Home /News /astrology /

DID YOU KNOW THAT ACCORDING TO VASTU DEBTS ARE HIGHER IF SOME ITEMS IN THE HOUSE ARE IN A DIFFERENT DIRECTION THAN THE NORTH PRV

Astrology: ఆదాయం తగ్గిందా? అప్పులు ఎక్కువగా ఉన్నాయా? అయితే ఉత్తర దిశలో ఈ వస్తువులు పెట్టండి​.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అందరు తమ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటారు. ఈ క్రమంలో ఇంట్లో ఉంచే వస్తువులను కూడా వాస్తు ప్రకారం ఏర్పాటు చేస్తారు. అయితే కొన్ని వస్తువులు ఉత్తరాన కాకుండా మరోచోట ఉంటే అప్పులు మీద పడతాయట.

    కొందరు లక్షలు సంపాదించినా చేతిలో డబ్బు నిలవదు. అప్పుల  (Debts are higher) బారిన పడతారు. మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నా ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా జీవిస్తుంటారు. ఇదంతా వారి ఆర్థిక ప్రాధాన్యతలను బట్టి ఉంటుంది. అయితే, మన ఇంటి వాస్తు కూడా డబ్బు, ఆరోగ్యం, ఆనందంపై ప్రభావం చూపిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో  వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద, ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవిస్తారని నిపుణులు సూచిస్తున్నారు.  ఐశ్వర్యం రాక అవకాశాలు పెరగాలంటే, దారిద్య్రం (Poverty) దూరం కావాలంటే, ఇంటి బాధలు తొలగాలంటే, మానసిక ప్రశాంతత (Peace)  కోసం వాస్తు దోషం తొలగిపోవడం చాలా ముఖ్యం. అందరు తమ ఇంటిని వాస్తు (Vastu) ప్రకారం నిర్మించుకుంటారు. ఈ క్రమంలో ఇంట్లో ఉంచే వస్తువులను కూడా వాస్తు ప్రకారం ఏర్పాటు చేస్తారు. తద్వారా ఇంట్లో శాంతి, సంతోషాల వాతావరణం నెలకొంటుంది.

    మనం ఇళ్లు కట్టుకున్నప్పుడే దిశల (directions) ను అనుసరించి నిర్మాణం చేపడతాం. అయితే, ఇంట్లోని వస్తువులు (some items in the house) కూడా వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా కుబేర స్థానంలో ఏ దోషం లేకుంటే .. డబ్బులకు ఆటంకం ఏర్పడదు. అందుకే ఇళ్లు కట్టుకునే సమయాల్లోనే కుబేరుడి స్థానానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

    ఉత్తర మధ్య భాగంలో తప్పనిసరిగా..

    ప్రధానంగా డబ్బు రావాల్సిన ప్రాంతం ఉత్తరం. ఈ స్థానానికి ప్రాధాన్యం ఇవ్వరు. ఏ దిక్కున ఇళ్లు కట్టుకున్నా.. ఆర్థిక ఇబ్బందులు కలుగకూడదు అంటే.. ఉత్తర మధ్య ద్వారంలో మెయిన్‌ డోర్‌ పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు రావు. ఏ దిక్కు ఇళ్లు అయినా.. ఉత్తర మధ్య భాగంలో తప్పనిసరిగా గుమ్మం ఏర్పటు చేసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో వాయువ్యం వైపునకు జరగకుండా చూసుకోవాలి. ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది. లేదంటే ఎంత డబ్బు సంపాదించినా కరిగిపోతుంది. ఉత్తర వాయువ్యంలో సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్మించినా.. పూర్తి అప్పుల్లో కూరుకుపోతారు.

    ఇలా చేస్తే మీ బ్యాంక్‌ బ్యాలన్స్‌ పెరుగుతుందట..

    ఈ ఉత్తర (north direction) దిశ బాగుంటే.. అంతా బాగుంటుంది. అక్కడ డబ్బులు పెట్టుకుంటే.. నిధి పెరుగుతుంది. నగలు పెట్టుకోవచ్చు, వీలువైన డాక్యుమెంట్లు కూడా పెట్టుకోవచ్చు. ఉత్తరం వైపున బాత్‌రూంలు కట్టకూడదు అని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.  నిజానికి ఉత్తరం జలస్థానం అంటారు. ఇలా జల తత్వం దగ్గర అగ్నితత్వం పెట్టినా.. అది కూడా తప్పు అవుతుందట. డబ్బులు ఎప్పుడైనా ఉత్తర స్థానంలోనే పెట్టుకోవాలట. దీంతో మీ బ్యాంక్‌ బ్యాలన్స్‌ పెరుగుతుందట. అందుకే నెలవారీ సరుకులు తెచ్చుకున్నా వాయువ్య దిశలో పెట్టుకుంటే మంచి జరుగుతుందట. ఈ వాయువ్య చక్కగా పెట్టుకుంటే చక్కటి ఫలితాలు లభిస్తాయట. అందుకే ఈ దిశలో వాటర్‌కు సంబంధిచిన వస్తువులు కూడా పెట్టుకోకూడదట. ఇక కుబేరుడి స్థానంగా పేరుగాంచిన ఈ ప్రదేశంలో సరుకులు, డబ్బులు పెట్టుకోవాలి.

    పూర్వం వాయువ్య దిశలో కూడా బంఢాగారం ఏర్పాటు చేసుకునేవారు. అందుకే ఈ దిశలో బియ్యం డబ్బాను వాయువ్యంలో పెట్టుకోవాలి. వాస్తు కలర్‌రూపంలో కూడా ప్రభావితం చెందుతుందట. అందుకే ఈ దిశగా ఎరుపు రంగు వేసుకోకూడదు. దక్షిణ నైరుతిలో తెలియకుండా.. ఏవైనా డబ్బులు పెడితే.. ఖర్చులు పెరుగుతాయట.

    (Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Astrology, Decreased income, Horoscope, Money

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు