హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Dhanteras: ఈ ఏడాది ధన త్రయోదశి తేదీ ఏది..? దీని ప్రాధాన్యం, శుభ ముహూర్తం, ఇతర ప్రత్యేకతలివే..

Dhanteras: ఈ ఏడాది ధన త్రయోదశి తేదీ ఏది..? దీని ప్రాధాన్యం, శుభ ముహూర్తం, ఇతర ప్రత్యేకతలివే..

Dhanteras: ఈ ఏడాది ధన త్రయోదశి తేదీ ఏది..? దీని ప్రాధాన్యం, శుభ ముహూర్తం, ఇతర ప్రత్యేకతలివే..

Dhanteras: ఈ ఏడాది ధన త్రయోదశి తేదీ ఏది..? దీని ప్రాధాన్యం, శుభ ముహూర్తం, ఇతర ప్రత్యేకతలివే..

Dhanteras: దీపావళి పండుగ ధన త్రయోదశి (ధన్‌తేరాస్- Dhanteras) పర్వదినంతోనే ప్రారంభమవుతుంది. ఈ రోజు ఆయుర్వేద దేవుడైన ధన్వంతరిని పూజిస్తారు. ఈ ఏడాది ధన్‌తేరాస్ తేది ఎప్పుడు, దాని ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజు ఏయే నగరాల్లో ఎన్ని గంటలకు శుభ ముహూర్తం ఉంది? అనే విషయాలు తెలుసుకుందాం. 

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారతదేశంలో దీపావళి (Diwali) పండుగ సందడి ప్రారంభమైంది. ఇప్పుడు చాలామంది పండుగ ఏర్పాట్లలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇల్లు శుభ్రం చేసుకోవడంతో పాటు క్రాకర్స్, కొత్త బట్టలు కొనుగోలు చేయడం, ఇతర పనుల్లో నిమగ్నమవుతున్నారు. అయితే ఈ దీపాల పండుగ ధన త్రయోదశి (ధన్‌తేరాస్- Dhanteras) పర్వదినంతోనే ప్రారంభమవుతుంది. ఈ రోజు ఆయుర్వేద దేవుడైన ధన్వంతరిని పూజిస్తారు. ఈ ఏడాది ధన్‌తేరాస్ తేది ఎప్పుడు, దాని ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజు ఏయే నగరాల్లో ఎన్ని గంటలకు శుభ ముహూర్తం ఉంది? అనే విషయాలు తెలుసుకుందాం.

* ‘ధన్‌తేరాస్’ అర్థమిదే

ధన త్రయోదశి నాడు భక్తులు దీపాలు వెలిగించడం ద్వారా హిందువుల అతిపెద్ద పండుగైన దీపావళి సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. హిందూ క్యాలెండర్‌లోని ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. ఈ రోజున హిందువులు అత్యంత శ్రద్ధగా భక్తితో ధన్వంతరి(Dhanvantari)కి పూజలు చేస్తారు. ధన్‌తేరాస్ అన్న పదంతో ‘ధన్’ అంటే సంపద కాగా, తేరాస్ అంటే 13వరోజు అని అర్థం.

* తేదీ, పూజ శుభ ముహుర్తాలు

దృక్పంచాంగం (Drikpanchang) ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 22వ తేదీ శనివారం రోజున ధన త్రయోదశి వచ్చింది. ఈ రోజున సాయంత్రం 7 గంటల 1 నిమిషాల నుంచి 8 గంటల 17 నిమిషాల వరకు శుభప్రదమైన ముహూర్తం ఉంది. ఆ దివ్యమైన సమయంలో పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలూ సిద్ధిస్థాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వేర్వేరు శుభ ముహూర్తాలు ఉన్నాయి. న్యూఢిల్లీలో రాత్రి 7:01కి మొదలై 8:17కి ముగుస్తుంది. చెన్నైలో రాత్రి 7:13కి మొదలై 8:13కి ముగుస్తుంది. కోల్‌కతాలో సాయంత్రం 5:05 నుంచి 6:03 వరకు; బెంగళూరులో రాత్రి 7:24 నుంచి 8:24 వరకు ఉంటుంది. అహ్మదాబాద్‌లో రాత్రి 7:29 నుంచి 8:39 వరకు; ముంబైలో రాత్రి 7:34 నుంచి 8:40 వరకు; ఛండీగర్‌లో సాయంత్రం 6:59 నుంచి రాత్రి 8:18 వరకు; గుర్గావ్‌లో రాత్రి 7:02 నుంచి 8:18 వరకు; హైదరాబాద్‌లో రాత్రి 7:14 నుంచి 8:18 వరకు; పుణేలో రాత్రి 7:31 నుంచి 8:36 వరకు ఉంటుంది.

* ధన త్రయోదశి ప్రాముఖ్యత

హిందూ సంప్రదాయం ప్రకారం ధన్‌తేరాస్ నాడు పూజ చేస్తే.. వారి కుటుంబం, ఆత్మీయులు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఈ రోజు ధన్వంతరి పూజను భక్తిగా చేస్తే ఆ కుటుంబంలోని ప్రతీ ఒక్కరి వ్యాధులన్నీ నయమవుతాయని భావిస్తారు. ముఖ్యంగా ఈ పర్వదినాన వస్తువులు కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇది అత్యంత శుభసూచిక సమయం కాబట్టి, వస్తువుల కొనుగోళ్లకు సరైన సమయమని ప్రజలు భావిస్తారు.

ఇది కూడా చదవండి : ధనత్రయోదశికి ఈ సరికొత్త డిజైనర్ రంగోలిని వేయండి.. సంపదల దేవుడు కూడా సంతోషిస్తాడు..

ధన త్రయోదశికి చాలామంది బంగారం లేదా వెండి వస్తువులను కొనుక్కుంటారు. వాటికి పసుపు, కుంకుమ రాసి అమ్మవారి ప్రతిమ పాదాల చెంత ఉంచి సమర్పణ చేస్తారు. అనంతరం పూలతో లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఆ తర్వాత వాటిని భద్రపరచుకుంటారు. ఇలా చేస్తే అదృష్టం వరిస్తుందని, అంతా శుభమే జరుగుతుందని భక్తుల నమ్మకం. ధన్‌తేరాస్ రోజున భక్తులు ధన్వంతరి స్వామితో పాటు సాయంత్ర వేళ లక్ష్మీదేవికి పూజ చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈరోజు మట్టి దీపాలు వెలిగించి పూజలు చేస్తారు.

First published:

Tags: Dhanteras, Dhanteras 2022, Dhanteras gold

ఉత్తమ కథలు