కాలజ్ఞానం

  • Associate Partner
  • diwali-2020
  • diwali-2020
  • diwali-2020

Dhanteras 2020: ధనత్రయోదశి నాడు ఏ రాశి వారు ఏం కొనాలంటే.. జోతిష్యులు చెప్పిన కీలక విషయాలివే..

ధంతేరాస్(dhanteras) లేదా ధనత్రయోదశి రోజు కొత్త వస్తువు లేదా బంగారం, వెండి వస్తువులు కొంటే ఆ ఏడాదంతా బాగా కలిసి వస్తుందనే సంప్రదాయం మనకు తెలిసిందే. కానీ ఇలా కొనడంలో లోతుపాతులు తెలుసుకుని కొంటే మీకు అన్ని విధాలా కలిసి వస్తుందని జ్యోతిష్యులు (astrologers)చెబుతున్నారు.

news18-telugu
Updated: November 9, 2020, 5:12 PM IST
Dhanteras 2020: ధనత్రయోదశి నాడు ఏ రాశి వారు ఏం కొనాలంటే.. జోతిష్యులు చెప్పిన కీలక విషయాలివే..
ప్రతీకాత్మిక చిత్రం
  • Share this:
ధంతేరాస్(dhanteras) లేదా ధనత్రయోదశి రోజు కొత్త వస్తువు లేదా బంగారం, వెండి వస్తువులు కొంటే ఆ ఏడాదంతా బాగా కలిసి వస్తుందనే సంప్రదాయం మనకు తెలిసిందే. కానీ ఇలా కొనడంలో లోతుపాతులు తెలుసుకుని కొంటే మీకు అన్ని విధాలా కలిసి వస్తుందని జ్యోతిష్యులు (astrologers)చెబుతున్నారు. జ్యోతిష్యం ప్రకారం ఒక్కో రాశి(zodiac sign) వారికి ఒక్కో పెట్టుబడి లేదా కొనుగోలు మంచి చేస్తుంది. ఇక ఏడాది గ్రహ సంచారం ప్రకారం మీ రాశికి ఏది కొంటే మంచిదో తెలుసుకోవటం ఎలాగో మీరే చదవండి.

లక్ష్మీ పూజ..

ధన త్రయోదశి రోజు లక్ష్మీ పూజ (Lakshmi puja) చేయడం మాత్రం మరవద్దు. కొత్తగా కొన్న వస్తువులు ఏవైనా సంప్రదాయ బద్ధంగా ముందు పూజలు చేసి ఆ తరువాత వాటిని ఉపయోగించండి. ధనత్రయోదశి రోజు కూడా బాణాసంచా కాలుస్తారు. కాబట్టి సాయంత్రం పెద్దగా శబ్ధాలు రాని, కాలుష్యం వెదజల్లని బాణాసంచాను మీరు కూడా కాల్చండి.

పూర్వకాలంలో..
గతంలో మన పెద్దలంతా ధనత్రయోదశి రోజు పల్లెల్లో ఘనంగా పండుగ జరుపుకునేవారు. సంప్రదాయ క్రీడలు వంటివి నిర్వహించి గ్రామస్థులంతా సరదాగా గడిపేవారు. కానీ కాలక్రమంలో ఇవన్నీ చాలావరకు కనుమరుగయ్యాయి. కానీ బంగారు వ్యాపారస్థుల పుణ్యమా అని మళ్లీ ధనత్రయోదశి కి పూర్వ వైభవం దక్కింది. కనీసం గురివింజ అంత ఎత్తైనా బంగారు లేదా వెండి కొనాలనే సంప్రదాయాన్ని తెచ్చిన బంగారు వ్యాపారులు తమ వ్యాపారాలు లాభసాటిగా మార్చుకుంటున్నారు.

ఆరోగ్యం కూడా..
దీన్నే ధన్వంతరి జయంతి (Dhanvantari Jayanthi) అని కూడా అంటారు. అమృత కలశంతో ధన్వంతరి దర్శనమిచ్చిన రోజు ఇదే. ఈరోజు ధన్వంతరిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని ప్రతీతి. అందుకే ధనత్రయోదశి రోజు ధన్వంతరిని మనస్ఫూర్తిగా తలచుకోండి.

ఇలా చేస్తే మీకు సకల శుభాలు..
జ్యోతిష్కులు చెప్పినట్లు చేస్తే లక్ష్మీ దేవి కటాక్షం సిద్ధిస్తుంది. కార్తీక కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి తిథినాడు జరుపుకునే ధనత్రయోదశి అంటే పవిత్రమైన రోజు. ధనత్రయోదశి రోజు షాపింగ్(shopping) చేయడం ఇటీవలి కాలంలో మనదేశంలోని అన్ని ప్రాంతాలవారి ఆచారంగా మారింది.
మేషం: మేష రాశి వారు ధనత్రయోదశి రోజు బంగారం, వెండి వస్తువులు, ఆస్థి కొనుగోలు మంచిది.
వృషభం: వెండి, వజ్రాల నగలు, భూములు, వాహనాలు కొనుగోలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి.
మిధునం: ఈరాశి వారు ఆస్తి, ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం, వెండి వస్తువులు కొనడం శుభకరం.
కర్కాటకం : బంగారం, వెండి వస్తువులు, పెట్టుబడులు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, ఆస్తి కొనుగోలు వంటివి లాభం చేకూర్చుతాయి.
సింహం: బంగారంలో పెట్టుబడులు, రాగి, ఫర్నీచర్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కలిసి వస్తాయి.
కన్య: బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ వస్తువులు, భూమి కొనుగోలు లాభదాయం.

తుల: బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఏరకమైన పెట్టుబడులైనా ఈ రాశి వారికి కలిసి వస్తాయి.
వృశ్చికం: బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, భూమి కొనుగోలు అద్భుతంగా కలిసి వస్తాయి.
ధనస్సు : బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, భూమిపై పెట్టుబడులు ధనూ రాశి వారికి శుభకరం.
మకరం: వెండి, భూమి, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తే మకర రాశి వారికి మంచిది.
కుంభం: బంగారం, వెండి వస్తువులు, ఫిక్స్ డ్ డిపాజిట్లు కలిసివస్తాయి కనుక కుంభ రాశి వారికిది శ్రేష్టం.
మీనం: ఏ పెట్టుబడులైనా కలిసివస్తాయి, షాపింగ్ కూడా శుభం కలుగచేస్తుంది. కనుక మీన రాశి వారు ఏ పెట్టుబడులైనా ధనత్రయోదశి రోజు సంతోషంగా పెట్టవచ్చు.
Published by: Nikhil Kumar S
First published: November 9, 2020, 5:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading