Numerology : పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురు రాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ(Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. పుట్టిన తేదీనే కాకుండా వినియోగిస్తున్న మొబైల్ నంబర్(Mobile Number) ప్రభావం కూడా మనుషులపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సరైన మొబైల్ నంబర్ని ఎంచుకుంటే సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని తెలిపారు. జీవితంలో చెడు ప్రభావాలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. ఇప్పుడు మొబైల్ నంబర్లో 7 ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.
7 కంప్లీట్ నంబర్
నంబర్ 7 ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తుంది. 7 అనేది కంప్లీట్ నంబర్. వారానికి 7 రోజులు, ఇంద్రధనస్సులో 7 రంగులు, సప్తఋషి రాశిలో 7 నక్షత్రాలు ఉంటాయి. 7 ప్రభావం ఉన్న వ్యక్తులు వారి సొంత గుర్తింపును కలిగి ఉంటారు, అది వారిని రిలీజియస్గా చేస్తుంది, వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారి చుట్టూ ఉన్నవారిపై ఎల్లప్పుడూ ప్రభావం చూపుతారు. సహాయకారిగా, చాలా ఓపికతో, త్యాగం చేసే గుణం ఉన్నవారిగా పేరు తెచ్చుకుంటారు.
మొబైల్ నంబర్లో ఒక 7 ఉంటే
ఫోన్ నంబర్లో ఒక్క 7 కనిపిస్తే.. సంబంధిత వ్యక్తులు జీవితంలో నష్టపోయిన వాటి వల్ల చాలా నేర్చుకుంటారు. అయినప్పటికీ వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. జీవితంలో మెచ్యూరిటీతో నడుచుకుంటారు.
నంబర్లో రెండు సార్లు 7 కనిపిస్తే
మొబైల్ నంబర్ సిరీస్లో రెండు సార్లు 7 రిపీట్ అయితే.. ప్రేమ, ఆరోగ్యం, డబ్బును కోల్పోయిన తర్వాత జ్ఞానం, తెలివితేటలు పెంచుకుంటారు. వారు ఆధ్యాత్మికంగా, దేవునికి భయపడేవారిగా మారుతారు. ఇతరుల నుంచి చాలా మోసాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు చాలా విశ్లేషణాత్మకంగా ఉంటారు, సమస్యలను పరిష్కరిస్తారు.
Rasi Phalalu : కుటుంబంతో విందులు వినోదాలు,స్నేహితురాలితో పెళ్లి ప్రస్తావన తెస్తారు!
7 మూడు సార్లు రిపీట్ అయితే
ఫోన్ నంబర్లో మూడు సార్లు 7వ అంకె ఉంటే.. వారు ప్రతి రంగంలో కష్టాలను ఎదుర్కొంటారు. ఎక్కువగా సొంత వ్యక్తులే వారికి ద్రోహం చేస్తారు. వారు డబ్బు, ఆరోగ్యం కారణంగా ఆందోళన చెందుతారు. లెక్కలేనన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్న తర్వాత వారు ఒక రకమైన బలాన్ని పెంచుకుంటారు. వారు నొప్పి, బాధతో జీవిస్తారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు పెరుగుతాయి.
నాలుగు, అంతకంటే ఎక్కువసార్లు ఉంటే
నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మొబైల్ నంబర్లో 7వ అంకె ఉంటే.. వారి పరిస్థితి చాలా క్లిష్టంగా మారుతుంది, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఇది వ్యక్తి, వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సంక్షోభాన్ని ఎదుర్కొని అనేక త్యాగాలు చేసిన తర్వాత సమతుల్యతను కాపాడుకోవడం దాదాపు అసాధ్యం. వారు చాలా జ్ఞానం, అనుభవాన్ని పొందుతారు. మంచి వక్తలుగా మారతారు. వారికి ఆధ్యాత్మిక శాస్త్రంలో ఆసక్తి ఉంటుంది.
ఫోన్ నంబర్లో 7 లేకపోతే
మొబైల్ నంబర్లో అసలు 7 లేకపోతే.. వారికి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఒక రకమైన మానసిక ఒత్తిడి, టెన్షన్ అనుభవిస్తారు. అతను దేవునికి దగ్గరగా ఉండడు, నాస్తికుడు కావచ్చు. 7 లేకపోవడం ఆరోగ్య సమస్యకు సంబంధించినది ప్రత్యేకంగా మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మధుమేహం, మూత్ర సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే ఈ నంబర్ మిస్ అయినప్పుడు జీవితం నెమ్మదిగా కదులుతుంది. ఈ వ్యక్తులు తమ సమస్యలను ఇతరులతో పంచుకోరు.
నంబర్ల మొత్తం 7
ఫోన్ నంబర్లోని అన్ని అంకెల మొత్తం 7 అయితే.. వారు జాగ్రత్తగా ఉండాలి. తమ ఆరోగ్యం సరిగా చూసుకోవాలి. ఇది వారిని నేర్చుకునేలా, ఇతరులకు నేర్పించేలా ప్రోత్సహిస్తుంది. ఇది వారిని ఆధ్యాత్మికత వైపు కదిలిస్తుంది. దేవునిపై విశ్వాసాన్ని పెంచుతుంది. ఇది కొత్త సాంకేతికత వైపు ఆసక్తిని కలిగిస్తుంది. ఏదైనా విదేశీ సంబంధిత పనిలో విజయాన్ని అందిస్తుంది. స్థలం, ప్రయాణ మార్పులను ప్రోత్సహిస్తుంది. రోజువారీ జీవితంలో అనిశ్చితికి కారణమవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Numerology