హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology: డిసెంబర్‌ 1వ తేదీ న్యూమరాలజీ.. ఫోన్‌ నంబర్‌లో 6 లేకపోతే.. బాధ్యతల నుంచి తప్పుకుంటారు..

Numerology: డిసెంబర్‌ 1వ తేదీ న్యూమరాలజీ.. ఫోన్‌ నంబర్‌లో 6 లేకపోతే.. బాధ్యతల నుంచి తప్పుకుంటారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ(Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. పుట్టిన తేదీనే కాకుండా వినియోగిస్తున్న మొబైల్‌ నంబర్‌(Mobile Number) ప్రభావం కూడా మనుషులపై ఉంటుంది?

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Numerology : పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ(Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. పుట్టిన తేదీనే కాకుండా వినియోగిస్తున్న మొబైల్‌ నంబర్‌(Mobile Number) ప్రభావం కూడా మనుషులపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సరైన మొబైల్ నంబర్‌ని ఎంచుకుంటే సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని తెలిపారు. జీవితంలో చెడు ప్రభావాలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. ఇప్పుడు మొబైల్‌ నంబర్‌లో 6 ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

 నంబర్‌ 6 ఆనందం, లగ్జరీకి సూచన

నంబర్‌ 6 స్నేహితులు, బంధువులకు సాయం చేసేలా, వారి పట్ల బాధ్యతగా ఉండేలా చేస్తుంది. వారి అవసరాలను అర్థం చేసుకొని, అందరితో అనుబంధంగా ఉంచుతుంది. నంబర్‌ 6 ముఖ్యంగా సరదాను ఇష్టపడే, విశ్రాంతిగా ఉండే వ్యక్తులను సూచిస్తుంది. వారు ఇంటి వెలుపల ఏదైనా యాక్టివిటీస్‌లో పాల్గొనాల్సి వస్తే.. తప్పు దిశలోకి మారవచ్చు, ఆమోదయోగ్యం కాని రిలేషన్‌లో భాగం కావచ్చు. ముఖ్యంగా నంబర్‌ 6 అందంపై ఆసక్తిని, అందమైన, రంగురంగుల పరిసరాలను ఆకర్షిస్తూ అందంగా కనిపించే వస్తువులను సూచిస్తుంది. జీవితం పట్ల స్నేహం, ఆచరణాత్మక వైఖరిని పెంచుతుంది. ఆనందం, లగ్జరీ, మంచి అవకాశాలను తెస్తుంది.

ఫోన్‌ నంబర్‌లో 6 ఒకసారి కనిపిస్తే

నంబర్ 6 ఫోన్ నంబర్‌లో ఒకసారి కనిపిస్తే.. అది కుటుంబం, జనరల్‌ రిలేషన్‌లపై ప్రేమను తెస్తుంది. ఇది బాధ్యత, అప్పగించిన పనిని చూసుకునే సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. వారు నిజంగా మంచి తల్లిదండ్రులగా ఉంటారు. వారు అందరి కోసం ఆలోచిస్తారు. చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా చూడాలని కోరుకుంటారు. వారు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులగా అన్ని విధులను నెరవేరుస్తారు.

 నంబర్‌లో 6 రెండుసార్లు ఉంటే

మొబైల్‌ నంబర్‌లో 6 రెండు సార్లు కనిపిస్తే.. నంబర్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది మరింత ఆందోళనకు గురి చేస్తుంది. సంబంధిత వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రొటెక్టివ్‌గా కూడా మారుతారు. అందం, అందంగా కనిపించే వస్తువుల వైపు ఆకర్షితులవుతారు. ఎల్లప్పుడూ తమ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. వారిని బాధ్యతాయుతంగా, స్వతంత్రంగా, వారి సొంత కాళ్ళపై నిలబడేంత సామర్థ్యం అందించడంలో కాస్తంత వెనకబడతారు.

Monthly Horoscope : డిసెంబర్ మాసఫలం..ఉద్యోగంలో అదనపు బాధ్యతలు,విదేశీ ప్రయాణ సూచనలు!

 6 మూడుసార్లు రిపీట్‌ అయితే

మొబైల్ నంబర్‌లో అంకె 6 మూడు సార్లు రిపీట్‌ అయితే చెడును సూచిస్తుంది. వారు మానసికంగా కలవరపడతారు. సోషల్‌ స్టేటస్‌ను కాపాడుకోవడానికి తహతహలాడుతారు. ఇతరులకు సహాయం చేయడానికి మార్గం లేదు, కానీ వారి సొంత కుటుంబం బాధపడుతుంది. వారు ప్రతికూలంగా ఆలోచిస్తారు. చాలా నిరాశావాదంగా మారుతారు. అలాంటి వ్యక్తులు ఆచరణాత్మకంగా ఉండరు. సామాజిక సేవలో పాల్గొనాలి.

మొబైల్‌ నంబర్‌లో నాలుగు, అంతకంటే ఎక్కువ సార్లు 6 కనిపిస్తే

ఒకవేళ మొబైల్ నంబర్‌లో 6వ అంకె నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సార్లు కనిపిస్తే.. ఆ వ్యక్తి మరింత యాక్టివ్‌గా లేదా ఇనేక్టివ్‌గా మారుతారు. అలాంటి వ్యక్తులు ఇతరులకు సమస్యగా మారతారు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని, పరిస్థితులను అర్థం చేసుకోలేరు. రోజువారీ జీవితంలో సక్రమంగా పనిచేయలేరు, ఇతరుల కోసం తమ వద్ద ఉన్నదంతా కోల్పోతారు.

ఫోన్‌ నంబర్‌ సిరీస్‌లో 6 లేనప్పుడు

మొబైల్ నంబర్‌లో అసలు 6 లేకపోతే.. సంబంధిత వ్యక్తులు బాధ్యత నుంచి తప్పుకుంటారు. చివరికి అనేక బంగారు అవకాశాలను కోల్పోతారు. గొప్ప అవకాశాలు వచ్చినా, వాటిని పూర్తిగా ఆస్వాదించలేక అనేక పనుల్లో ఇబ్బందులు, అడ్డంకులు ఎదుర్కొంటారు. మొబైల్ నంబర్‌లో 6 లేకపోవడంతో.. ఏదైనా కమిట్‌మెంట్‌ను స్వీకరించడంలో తక్కువ విశ్వాసంతో ఉంటారు.

అన్ని నంబర్‌ల మొత్తం 6 అయితే

ఫోన్‌ నంబర్‌లోని అన్ని అంకెల మొత్తం 6 వస్తే.. అన్ని రకాల ఆనందాన్ని, సౌకర్యాలను తెస్తుంది. వ్యక్తిని బాధ్యతాయుతంగా చేస్తుంది. నంబర్‌ 6 బంగారు అవకాశాలను తీసుకొస్తుంది. ఒక నిర్ణయం ఒక అడుగులా మారుతుంది. సౌకర్యాలను అలవాటు చేసుకున్నప్పుడు, ఆటోమేటిక్‌గా కష్టపడి పనిచేసే తత్వం కోల్పోతారు. ఇంట్లోనే ఉండి పనులు, వస్తువులు చూసుకోవడంలో ఎక్కువ ఆసక్తిని చూపుతారు.

First published:

Tags: Numerology

ఉత్తమ కథలు