Home /News /astrology /

DATTA JAYANTI 2020 DATE TODAY IS THE LORD DATTATREYA JAYANTI IS THE HOLY TRINITY OF BRAHMA VISHNU AND MAHESHWARA NK

Datta Jayanti 2020 Date: దత్తాత్రేయ స్వామి ప్రత్యేకత ఏంటి? ఎలా పూజించాలి?

దత్తాత్రేయ స్వామి ప్రత్యేకత ఏంటి? ఎలా పూజించాలి? (image credit - twitter - sim⚘)

దత్తాత్రేయ స్వామి ప్రత్యేకత ఏంటి? ఎలా పూజించాలి? (image credit - twitter - sim⚘)

Datta Jayanti 2020 Date: మనలో చాలా మందికి దత్తాత్రేయ స్వామి గురించి పెద్దగా తెలియదు. నేడు ఆ స్వామి జయంతి సందర్భంగా తెలుసుకుందాం.

    Dattatreya Jayanti: దత్త జయంతి లేదా... దత్తాత్రేయ జయంతి అంటే... దత్తాత్రేయ స్వామి జన్మదినం అన్నమాట. ఈ స్వామి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, పరమేశ్వరుల కలయిక. హిందూ పండుగల్లో దత్త జయంతికి ప్రత్యేక స్థానం ఉంది. అగ్రహాయనం నాడు... పౌర్ణమి నాడు ఈ పండుగ జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్మాటక, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో ఈ వేడుకను ఎక్కువగా జరుపుకుంటారు. దత్తాత్రేయ స్వామి విగ్రహం మూడు తలలు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర), ఆరు చేతులతో ఉంటుంది. స్వామి చేతుల్లో రోసారీ, బ్రహ్మదేవుడి కుండ నీరు, శంఖం, విష్ణు చక్రం, త్రిశూలం, ఢమరుకం వంటివి ఉంటాయి. దత్తాత్రేయ స్వామిని ఇండియాలోని అత్యంత ప్రాచీన దేవుళ్లలో ఒకరిగా భావిస్తారు.

    Datta Jayanti 2020: Date and time తేదీ, సమయం:
    - ఈ సంవత్సరం దత్తాత్రేయ జయంతిని డిసెంబర్ 29న మంగళవారం నాడు జరుపుకుంటున్నారు.
    - పూర్ణిమ తిథి డిసెంబర్ 29న ఉదయం 7:54కి మొదలైంది.
    - పూర్ణిమ తిథి డిసెంబర్ 30 ఉదయం 5:57కి ముగుస్తుంది.



    Datta Jayanti: పూజ విధానం:
    దత్తాత్రేయ భక్తులు సహజంగా ఈ రోజు ఉపవాసం చేస్తారు. చాలా మంది ఇవాళ పుణ్య నదుల్లో స్నానం చేస్తారు. లేదంటే... దగ్గర్లోని చెరువులకు వెళ్తారు. ఆ తర్వాత పూజ చేస్తారు. దత్తాత్రేయ స్వామి ఫొటోను ఉంచి, చుట్టూ పూలతో డెకరేట్ చేస్తారు. దీపాలు వెలిగిస్తారు. కర్పూరంతో హారతి ఇస్తారు. భక్తులు ధ్యానం చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, పవిత్ర గ్రంథాలైన అవధూత గీత, జీవన్ముక్త గీత వంటి దత్తాత్రేయ స్వామి గురించి తెలిపేవి చదువుతారు. భజనలు కూడా చేస్తారు.


    Datta Jayanti: ప్రాధాన్యం:
    దత్తాత్రేయ స్వామి... అత్రి ముని, అనసూయల కొడుకు. మహా పతివ్రత అయిన అనసూయ... తన బిడ్డకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులు రావాలని కోరుకుంది. అలాగే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. రామాయణం, మహాభారతంలో దత్తాత్రేయ ప్రస్తావన ఉంటుంది. అధర్వణ వేదంలో దత్తాత్రేయ ఉపనిషత్తు ఉంది. తన భక్తులకు ఆ స్వామి జ్ఞానోదయం కలిగిస్తారు.

    ఇది కూడా చదవండి: Horoscope Today: డిసెంబర్ 29 రాశి ఫలాలు. వృషభ, సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులకు మేలు

    దత్తాత్రేయ స్వామిని... మహా విష్ణుమూర్తి 24 ప్రతి రూపాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ స్వామి తన చుట్టుపక్కల ఉండే పరిస్థితులను గమనిస్తూ... విజ్ఞానాన్ని పొందారని ప్రతీతి. దేశవ్యాప్తంగా దత్తాత్రేయ జయంతి నాడు ఆ స్వామికి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Festival

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు