Home /News /astrology /

DAILY PSYCHIC READINGS HERE IS DAILY HOROSCOPE TELUGU ASTROLOGY RASHIFAL RASI PHALAU FOR ALL 12 ZODIAC SIGNS KNOW ABOUT YOURS PJC GH SK

Daily Horoscope: ఈ రోజు మీకు ఎలా ఉండబోతుంది? ఏమేం జరుగుతాయి? జనవరి 2 రాశి ఫలాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: ఇవాళ జనవరి 2 (ఆదివారం). నేడు పలు రాశుల వారికి చాలా బాగుంది. అనుకున్నవన్నీ జరుగుతాయి. కొందరు ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. మరికొందరు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉందో దిన ఫలాల్లో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
(పూజ చంద్ర, జ్యోతిష్య నిపుణులు)

Horoscope Today: కొత్త సంవత్సరంలో  తనకు అదృష్టం కలిసి రావాలని, జీవితంలో విజయం సాధించాలని, ఆర్థికంగా కలిసిరావాలని అందరూ కోరుకుంటారు. గత ఏడాది ఉన్న కష్టాలు ఈసారి ఉండ కూడదని దేవుడిని ప్రార్థిస్తారు.  మరి, ఈ రోజు (జనవరి 2న) మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి.

మేష రాశి (Aries)

ఈ రోజు మేష రాశి వారు ప్రియమైన వారికి ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తారు. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న విషయాన్ని వారికి చెబుతారు. అయితే, దీనికి వారి నుంచి సానుకూల నిర్ణయం వస్తుంది. ఈ రోజు ఏదైనా కొత్త పని చేపట్టండి. తప్పకుండా విజయం సాధిస్తారు. సర్వీస్​ సెక్టార్​లోని ఉద్యోగులకు ప్రమోషన్లు, శాలరీ హైక్​ లభించే అవకాశం ఉంది. వైద్యులకు మరింత గుర్తింపు లభిస్తుంది.

వృషభ రాశి (Taurus)

వృషభ రాశి వారి వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. అయితే, సామరస్యంగా వాటిని పరిష్కరించుకోవచ్చు. మీ ఆలోచనలను భాగస్వామికి స్పష్టంగా తెలియజేస్తారు. అయితే, కొన్నిసార్లు అవతలి వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కానీ, చిన్న టిప్స్​తో సమస్యను పరిష్కరించుకోవచ్చు. మీ చిన్ననాటి మిత్రుడు అనుకోకుండా మిమ్మల్ని కలిసి ఆశ్చర్యపరుస్తారు.

మీ ఇంట్లో తరచూ ఈ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయా? ఎంత అరిష్టమో తెలుసా?

మిథున రాశి (Gemini)

మీ జీవితంలో గతంలో జరిగిన కొన్ని చేదు జ్ఞాపకాలు ఇప్పుడు మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు. మీ సన్నిహితులతో చర్చించి వాటి నుంచి చేదు జ్ఞాపకాల నుంచి బయటికి రండి. మిమ్మల్ని మీరు నమ్మండి. విశ్వాసాన్ని పెంపొందించుకోండి. ఎక్కువగా మాట్లాడటం మీకు నష్టం చేస్తుందని గుర్తించుకోండి.

కర్కాటక రాశి (Cancer)

ధ్యానంతో ఈ రోజును ప్రారంభించండి. ధ్యానం మీ మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. ఇది మీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయడంలో సహాయపడుతుంది. కొత్త సవాళ్లను స్వీకరించడంలో సహాయపడుతుంది. ఈ రోజు మీ జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అయితే, ఆ నిర్ణయం మీకు కలిసొస్తుంది. మీ తల్లిదండ్రుల సలహాలను ఎక్కువగా పాటించడం లాభిస్తుంది.

సింహ రాశి  (Leo)

ఈ రోజు మీ ఉద్యోగానికి సంబంధించి ఓ శుభవార్త వింటారు. మీకు ప్రత్యేక ప్రాజెక్ట్​ కేటాయించే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడుపుతారు. వచ్చే 3 నెలల వరకు మీకు అన్ని విషయాల్లో కలిసొస్తుంది. బంధువుల నుంచి సహాయం లభిస్తుంది. గతేడాది నుంచి పెళ్లి కోసం చూస్తున్న వారికి ఈ ఏడాది పెళ్లి కావడం ఖాయం.

న్యూమరాలజీ ప్రకారం తేదీలవారీగా 2022 ఎలా ఉంటుందో ఓ నజర్ వేద్దాం..

కన్య రాశి (Virgo)

మీరు ప్రేమిస్తున్న వ్యక్తికి ఆ విషయాన్ని తెలియజేస్తారు. అవతలి వ్యక్తి నుంచి పాజిటివ్ రెస్పాన్స్​ వస్తుంది. ఈ రోజు మీ గుండె, ఊపితిత్తుల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ద తీసుకోండి. ఈ రోజు ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. అందువల్ల, ప్రయాణ సమయంలో ఎక్కువ జాగ్రత్తలు పాటించండి. మీ రహస్యాలను మీ దగ్గరే ఉంచుకోండి. మీ తల్లి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

తులా రాశి (Libra)

తులా రాశి వారు ఈ రోజు సృజనాత్మకంగా ఆలోచిస్తారు. మీ ప్రియమైన వారితో ఆలోచనలు పంచుకునే అవకాశం లభిస్తుంది. ఆఫీసులో మీకు ఎక్కువ వర్క్​ అప్పగించవచ్చు. దాన్ని పూర్తి చేసేందుకు సిద్దమవ్వండి. మీరు ప్లాన్​ చేసుకున్న యాత్రలు వాయిదా పడే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి (Scorpio)

మీరు జీవిత లక్ష్యంపై స్పష్టత వస్తుంది. గందరగోళాన్ని విడిచిపెట్టి మంచి ప్రణాళికతో ముందుకెళ్తారు. మీ జీవితం నుంచి దూరమైన వారు ఈ రోజు కనిపించే అవకాశం ఉంది. ఇది మీకు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇక, మీ బాస్​ మిమ్మల్ని మెచ్చుకుంటారు.

విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎవరు ఇచ్చారు? పురాణాలు ఏం

ధనుస్సు రాశి (Sagittarius)

ఈ రోజు మీరు ఆధ్యాత్మిక భావనలో ఉంటారు. మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. కొంతకాలంగా విస్మరిస్తున్న హెల్త్ చెకప్ చేయించుకుంటారు. ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచిన వస్తుంది. మొత్తంగా ఈ రోజు మీకు కలిసొస్తుంది. మీ ఆర్థిక పురోగతి కోసం ఈ సమయాన్ని ఉపయోగించుకోండి.

కుంభం (Aquarius)

మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. వెనుకటి బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

Astrology: శుభ కార్యాలు చేసే ముందు స్వస్తిక్ ఎందుకు గీస్తారు? ప్రతికూల శక్తులు..


మీనం (Pisces)

చేపట్టిన పనులు ఎంతో పట్టుదలతో పూర్తి చేసుకుంటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుది. కొంత రుణ బాధ తొలగుతుంది. ఇంటా బయటా గౌరవాదరణలు లభిస్తాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac sign

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు