హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology: జులై 28 న్యూమరాలజీ.. మ్యారేజ్‌ ప్రపోజల్‌కు మంచి సమయం..

Numerology: జులై 28 న్యూమరాలజీ.. మ్యారేజ్‌ ప్రపోజల్‌కు మంచి సమయం..

జూలై 28 న్యూమరాలజీ (Twitter/Photo)

జూలై 28 న్యూమరాలజీ (Twitter/Photo)

Numerology: న్యూమరాలజీ ప్రకారం 28వ తేదీ గురువారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

ఇంకా చదవండి ...

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)

పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం 28వ తేదీ గురువారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

నంబర్‌ 1 : నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. మీరు ఈ రోజు సూర్యుడిలా ప్రకాశిస్తారు, కాబట్టి నాయకులు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రదర్శించి ప్రపంచాన్ని గెలిచే రోజు. మీరు ఇతర బ్రాండ్‌లతో కలిసి పని చేయడానికి, ప్రసంగం చేయడానికి, ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి, ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి లేదా ఈరోజు ప్రత్యేక స్నేహితుడికి ప్రేమను తెలియజేయడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీరు అన్ని సౌకర్యాలను అనుభవిస్తారు. మీ రిలేషన్స్‌ ద్వారా డబ్బు సంపాదించడం లేదా లక్ష్యాన్ని సాధించడం సులభం అవుతుంది. విజయం సాధించాలంటే గణేశుడు, సూర్య భగవానుడి ఆశీస్సులు తీసుకోవాలని గుర్తుంచుకోండి. క్రీడాకారులు విజయంతో ఇంటికి వస్తారు. మహిళలు మృదువైన సంభాషణ, వంట ద్వారా హృదయాలను గెలుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

మాస్టర్‌ కలర్‌: ఎల్లో, బ్లూ

లక్కీ డే: ఆదివారం, సోమవారం

లక్కీ నంబర్‌: 1

దానాలు: కాపర్‌ గ్లాస్‌, కలశం ఆలయానికి అందజేయాలి

నంబర్‌ 2 : నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. ధ్యానం, వైద్యం చేసే వారికి ఇది శక్తివంతమైన రోజు. మీ రోజును ప్రారంభించడానికి శివునికి పాలతో అభిషేకం చేయాలి. మ్యానిపులేషన్స్‌ లేదా డిప్లమాటిక్‌ విధానం కూడా ఈరోజు బాగా పని చేస్తుంది. మీ పిల్లలు, బంధువులతో గడపడానికి కూడా ఇది గొప్ప రోజు. పెట్టుబడిపై రాబడి కూడా యావరేజ్‌గా కనిపిస్తోంది. మీరు లిక్విడ్స్‌, ఎలక్ట్రానిక్, మందులు, ఎగుమతి దిగుమతులు, సౌరశక్తి, వ్యవసాయం, రసాయనన వ్యాపారాలు చేస్తుంటే లాభాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి.

మాస్టర్‌ కలర్‌: బ్లూ, వైట్‌

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 2

దానాలు: పేదలకు తియ్యని పెరుగు దానం చేయాలి

నంబర్‌ 3 : నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి విజయం ఎంతో దూరంలో లేదు. రోజును ప్రారంభించడానికి మీ గురువు, తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని గుర్తుంచుకోండి. విద్యార్థులకు ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. కానీ మీరు గురువుగారికి కృతజ్ఞతలు చెప్పడం గుర్తుంచుకోండి. మీ భాగస్వామిని రాతపూర్వక సంభాషణ ద్వారా ఆకట్టుకోవడానికి ఇది గొప్ప రోజు. మ్యారేజ్‌ ప్రపోజల్‌ చేయడానికి అనువైన రోజు. పాత కోచ్ సహాయంతో క్రీడాకారులు పోటీలలో విజయం సాధిస్తారు. ఈ రోజు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారి ప్రత్యేకంగా ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధిస్తారు. గురు గ్రహం శక్తిని పెంచడానికి ఆడవారు పసుపు రంగులో భోజనం వండాలి, మొత్తం కుటుంబానికి వడ్డించాలి.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌

లక్కీ డే: గురువారం

లక్కీ నంబర్‌: 3, 1

దానాలు: ఆలయాలకు చందనం దానం చేయాలి

నంబర్‌ 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. ఈ రోజు మీ అయోమయ స్థితి క్లియర్ అవుతుంది. అదృష్టం కలిసి వచ్చి మీకు అనుకూలంగా చర్యలు ఉంటాయి. ఈ రోజు మేనేజ్‌మెంట్‌ ద్వారా పర్‌ఫెక్షన్‌ లభిస్తుంది. ఈరోజు పెట్టుబడి పెట్టిన డబ్బు గోప్యంగా ఉండాలి. డాక్యుమెంట్ల పరిశీలనలో ఎక్కువ సమయం వెచ్చించాలి. ఎగుమతి దిగుమతుల వ్యాపారులు మనసు చేసే సూచనలు వినాలి. వ్యక్తిగత సంబంధాలలో ఎమోషనల్ టర్న్స్‌ ఉంటాయి. ఎవరినైనా బాధపెట్టే అవకాశం ఉంది, కాబట్టి కమ్యూనికేషన్‌లో జాగ్రత్తగా ఉండండి. వ్యాయామం చేయడానికి కొంత సమయం కేటాయించాలి. పుల్లని పదార్థాలు తినాలి.

మాస్టర్‌ కలర్‌: బ్లూ

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్‌: 9

దానాలు: జంతువులకు ఉప్పగా ఉండే పదార్థాలు అందజేయాలి

నంబర్‌ 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. మీరు సుసంపన్నమైన జీవనశైలి కోసం ఈ రోజు డబ్బు ఖర్చు చేస్తారు. మీరు వ్యక్తిగత, వృత్తి జీవితంలో అభివృద్ధిని అనుభవిస్తారు. మీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఇతరులపై చెరగని ముద్ర వేస్తారు. మీ స్వేచ్ఛను అన్యాయంగా ఉపయోగించకుండా జాగ్రత్త వహించండి. స్నేహితులు, బంధువులతో ఉదారంగా, హేతుబద్ధంగా ఉండండి. గ్లామర్, నిర్మాణం, మీడియా, విదేశీ వస్తువులు, క్రీడలలోని వ్యక్తులు స్పెషల్‌ అప్రైజల్‌ అందుకుంటారు. టీల్ ధరించి సమావేశాలకు హాజరైతే మేలు. దయచేసి ఈరోజు లిక్కర్, నాన్ వెజ్ మానుకోండి. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి. క్రీడల్లో విజయాలు పొందుతారు.

మాస్టర్‌ కలర్‌: గ్రీన్‌

లక్కీ డే: బుధవారం

లక్కీ నంబర్‌: 5

దానాలు: అనాథాశ్రమాలకు తులసి మొక్కను అందజేయాలి

నంబర్‌ 6 : నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. వ్యక్తిగత సంబంధాలలో కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ విషయాలు కాలక్రమేణా పరిపక్వం చెందుతాయి. డబ్బు ఖర్చుపై నియంత్రణ అవసరం. తల్లిదండ్రులు తమ పొసెసివ్‌ నేచర్‌ను విడిచిపెట్టాలి. ఎందుకంటే మీరు పిల్లలపై గర్వపడతారు, కుటుంబం, స్నేహితులు, సహోద్యోగుల సపోర్ట్‌ను ఆశీర్వాదంగా భావిస్తారు. మీటింగ్‌లు, డీలింగ్‌లు, హోస్టింగ్, మార్కెటింగ్, ఆఫీసులో ప్రెజెంటేషన్‌లు ఇవ్వడానికి సమయం. ప్రభుత్వ టెండర్లలో రిస్క్ తీసుకోవడానికి మీకు తగినంత అదృష్టం ఉంటుంది. వైద్యం కోసం వెళ్ళడానికి, సమీక్షలకు హాజరు కావడానికి, బట్టలు, ఆభరణాలు, వాహనాలు, మొబైల్, ఇల్లు కొనడానికి లేదా చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి మంచి రోజు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి.

మాస్టర్‌ కలర్‌: ఆక్వా

లక్కీ డే: శుక్రవారం

లక్కీ నంబర్‌: 6

దానాలు: అనాథాశ్రమాలకు చక్కెర దానం చేయాలి

నంబర్‌ 7 : నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. సామాజిక సంబంధాలు, వ్యక్తిగత ఇమేజ్ కారణంగా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. న్యాయవాదులు, రాజకీయ నాయకులు తమ ప్రణాళికలను రహస్యంగా, గోప్యంగా ఉంచాలి. జీవితం ఎత్తు పల్లాల మధ్య ఊగిసలాడుతుంది, వివేకాన్ని ఉపయోగించాలి. కొత్త అవకాశం చిన్న బ్రాండ్ లేదా ఆపోజిట్‌ జెండర్‌కి చెందినదైతే దాన్ని అంగీకరించాలి. న్యాయవాది సలహా తీసుకోవడం సరైన మార్గంలో డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వ్యాపార ఒప్పందాలు అత్యంత విజయవంతమవుతాయి. ఈరోజు మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ ఖరారు కానున్నాయి. శివాలయాన్ని సందర్శించడం, పూజలు చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

మాస్టర్‌ కలర్‌: ఎల్లో

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 7

దానాలు: ఆలయానికి ఆయిల్‌, ఎల్లో మస్టర్డ్‌ అందజేయాలి

నంబర్‌ 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. ఈరోజు మీ లవ్‌ రిలేషన్‌ అదృష్టవంతంగా, సంతోషంగా సాగిపోతుందని రుజువు చేస్తుంది. ఈరోజు విజయానికి అన్ని ద్వారాలను తెరవడానికి కమిట్‌మెంట్స్‌ నెరవేర్చడం కీలకం. ఈరోజులో ఏ అంశాలు అయితే సాఫీగా జరిగిపోవాలని కోరుకుంటారో, అక్కడ జ్ఞానం, డబ్బు శక్తిని ఉపయోగించండి. చట్టపరమైన కేసులు ప్రభావవంతమైన వ్యక్తులు లేదా డబ్బు ద్వారా పరిష్కారమవుతాయి. వ్యాపార ఒప్పందాలను చేసుకోవడానికి నెట్‌వర్కింగ్ ఈరోజు ఉపయోగపడుతుంది. మీ భాగస్వామిని మీ డబ్బు ద్వారా ఆకట్టుకుంటారు. విద్యార్థులు లక్ష్యం కోసం పని చేయడానికి సమయాన్ని కేటాయించాలి. మీకు ఎక్కువ జ్ఞానం ఉంది కాబట్టి నిర్ణయాలన్నీ పరిపూర్ణంగా ఉంటాయి. దాన ధర్మం నేడు తప్పనిసరి.

మాస్టర్‌ కలర్‌: సీ గ్రీన్‌

లక్కీ డే: శనివారం

లక్కీ నంబర్‌: 6

దానాలు: స్థానికులు పాదరక్షలు దానం చేయాలి

నంబర్‌ 9 : నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. కమ్యూనికేషన్ అనేది మీ బలం. పబ్లిక్ ఫిగర్స్ పేరు, కీర్తిని ఆస్వాదిస్తారు. జంటలు భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి ఒక అందమైన రోజు. ప్రభుత్వ టెండర్లు, ప్రాపర్టీ డీల్స్, డిఫెన్స్ కోర్సు, మెడికల్ కోర్సులపై సజావుగా సంతకాలు జరుగుతాయి. గ్లామర్, సాఫ్ట్‌వేర్, సంగీతం, మీడియా లేదా విద్యా పరిశ్రమలోని వ్యక్తులు ప్రజాదరణను అందుకుంటారు. యువ రాజకీయ నాయకులు, యువ కళాకారులు ఈ రోజు కొన్ని కొత్త స్థానాలను అందుకుంటారు. బహిరంగ ప్రసంగం, ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలకు ఈ రోజును తప్పక ఉపయోగించాలి. సంగీత విద్వాంసుల తల్లిదండ్రులు ఈరోజు తమ పిల్లలను చూసి గర్వపడతారు. వైద్యులు, సర్జన్లు బహుమతులు అందుకుంటారు. ప్రయాణ ప్రణాళికలు విజయాలతో నిండి ఉంటాయి.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్‌: 9

దానాలు: పిల్లలకు యాపిల్స్‌ దానం చేయాలి

జులై 28వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు వీరే..

హుమా ఖురేషి, దుల్కర్ సల్మాన్, అయేషా జుల్కా, కాసు బ్రహ్మానంద రెడ్డి, కృష్ణ వంశీ

Published by:Sridhar Reddy
First published:

Tags: Astrology, Horoscope, Numerology

ఉత్తమ కథలు