DAILY HOROSCOPE THESE 4 ZODIAC SIGNS ARE MOST FICKLE MINDED WHO ARE PERPETUALLY CONFUSED SJN
Astrology : ఈ రాశుల వారు ఎలా ఉంటారో అంచనా వేయడం చాలా కష్టం..అండగా ఉంటారని అనుకున్నారో ఇక అంతే?
ప్రతీకాత్మక చిత్రం
Astrology : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు నిలకడలేని మనస్థత్వంతో ఉంటారు. వీరు ఎప్పుడు ఎలా ఉంటారో అంచనా వేయడం చాలా కష్టం. ఇక వీరితో సావాసం అంటే రోజు ఒక సాహసం చేసినట్లు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం).
నిలకడ లేని మనస్థత్వం ఉన్న వారితో ఎప్పుడూ కష్టాలే. ఇక అటువంటి వారు మన ఇంట్లోనే ఉంటే రోజు సమస్యలతో సావాసం చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఎలా ఉంటారు.. ఏ క్షణంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో పసిగట్టడం చాలా కష్టం. (ప్రతీకాత్మక చిత్రం).
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు నిలకడలేని మనస్థత్వంతో ఉంటారు. వీరు ఎప్పుడు ఎలా ఉంటారో అంచనా వేయడం చాలా కష్టం. ఇక వీరితో సావాసం అంటే రోజు ఒక సాహసం చేసినట్లు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం).
ఈ జాబితాలో మిథున రాశి వారు ముందుంటారు. వీరు సరైన నిర్ణయాలను తీసుకోవడంలో ఎప్పుడూ పొరపాట్లను చేస్తూనే ఉంటారు. ఎప్పుడూ విచారంగా ఉంటారు. కాసేపు నవ్వితే ఆ తర్వాతి నిమిషమే పక్కకు వెళ్లి ఏడుస్తారు. మీరు తమ నిర్ణయాలను క్షణాల్లో మార్చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య రాశి వారు ఎక్కువగా ఆలోచిస్తారు. చిన్న చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దాంతో తాము తీసుకున్న నిర్ణయం సరైంది కాదనే భావనతో ఉన్న పళంగా ఆలోచనను మార్చేస్తారు. సినిమాకు వెళ్లడం.. హోటల్ కెళ్లి భోజనం చేయడం వంటి విషయాల్లో కూడా వీరి ఆలోచనలు నిలకడగా ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం).
తులా రాశి వారు సొంత నిర్ణయాలను తీసుకోవడంలో ఎప్పుడూ కన్ ఫ్యూజ్ అవుతుంటారు. వీరు నిర్ణయాలను తీసుకోకుండా పక్కన వారిని సలహా అడుగుతారు. వారు ఏదో చెప్తారు. దానికి అనుగుణంగా వీరు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కాసేపటికి మళ్లీ వేరేవాళ్లని అదే విషయంలో సలహా అడుగుతారు. వారు ఏదో చెబుతారు. దాంతో వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం).
మీనరాశి వారితో కలిసి ఎక్కడికన్నా వెళ్లాలని మాత్రం మీరు అనుకోకండి. ఎందుకంటే వీరు చివరి నిమిషంలో తాను నిర్ణయం మార్చుకున్నానని రాలేనని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరే వచ్చి ఫలానా రోజున అక్కడికి వెళ్దాం అని చెప్పినా.. తీరా ఆ రోజు రాగానే తనకు వేరే పని ఉందని చెప్పే అలవాటు ఈ రాశి వారిది. (ప్రతీకాత్మక చిత్రం).
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.