Home /News /astrology /

DAILY HOROSCOPE ON 29TH JANUARY THESE ZODIAC SIGNS WILL RESOLVE THEIR FINANCIAL ISSUES TODAY HERE IS TODAY ASTROLOGY PJC GH SK

Horoscope Today: నేటి దిన ఫలాలు.. ఈ రాశుల వారి డబ్బు సమస్యలకు పరిష్కారం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Daily Horoscope: నేడు శనివారం. ఇవాళ పలు రాశుల వారికి బాగుంది. అనుకున్నవన్నీ జరుగుతాయి. కానీ కొందరికి మాత్రం బాగాలేదు. అలాంటి వారు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి.. జ్యోతిష్య నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

(పూజచంద్ర, జ్యోతిష్య నిపుణులు)

Horoscope Today: జనవరి 29న అంటే ఈ రోజు.. ఒక రాశి వారికి తమ జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఈరోజు కొందరు కొత్త ప్రపోజల్స్ పై సంతకం చేయకపోవడమే మంచిది. ఇంకా 12 రాశుల (Zodiac signs) వారికి ఈ రోజు ఎలా గడువనుందో  నేటి దినఫలాల్లో ఇక్కడ తెలుసుకుందాం.

* మేషం
ఈ రోజు కాస్త చింత, దిగులుతో ప్రారంభమవుతుంది. కానీ మీ పనులన్నీ సాఫీగా జరుగుతున్నందున ఈ రోజు మీలో ఆశను పెంచుతుంది. గృహ సమస్యలకు సంబంధించి సహాయం కోసం ఎవరైనా మిమ్మల్ని సంప్రదించవచ్చు. హెల్దీ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి.

లక్కీ సైన్ - సూర్యోదయం

* వృషభం
న్యూ లైఫ్ ఛాయిస్‌లు ఏర్పరచుకోవడానికి నేడు మీకు అద్భుతమైన అవకాశాలు అందుబాటులో ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మీ భావోద్వేగాలను అణచి వేయకండి. ముఖ్యంగా మీ పట్ల కేర్ చూపించే వారి ముందు భావోద్వేగాలను వెల్లడించండి.

లక్కీ సైన్ - ఒక వెదురు మొక్క

* మిథునం
క్విక్ ట్రిప్ మీ మనస్సులో ఉంటే, దానిని అమలు చేయడానికి ఇది మంచి సమయం. తీవ్రమైన చర్చ ఈరోజు జరగకపోవచ్చు కాబట్టి వేరే సమయానికి దాన్ని వాయిదా వేయండి. కొన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రతిపాదనలపై సంతకం చేయడానికి తొందరపడకండి.

లక్కీ సైన్ – ప్రకాశవంతమైన జెండా

తరచూ కలలు వస్తున్నాయా? దానర్థమేంటని గందరగోళమా? ఐతే మీ డ్రీమ్ ను ఇలా డీకోడ్ చేసుకోండి!

* కర్కాటకం
మీ దృక్పథం అందరిలోనూ విలువైనదిగా ఉంచుకోవడం ముఖ్యం. హద్దులు దాటి వ్యంగ్యంగా ప్రవర్తిస్తే అది అసలుకే ఎసరు తెచ్చే ప్రమాదం ఉంది. ఒక సోషల్ యాక్టివిటీ మీరు అనుకున్న విధంగా జరగకపోవచ్చు.

లక్కీ సైన్ - ప్రణాళిక లేని నడక

* సింహం
మీరు గతంలో చేసిన కృషికి గర్విస్తుంటే.. అది ఇప్పుడు మీపై ప్రతికూల ప్రభావం చూపడం ప్రారంభించవచ్చు. మీ పిల్లలకు వారి దైనందిన పనుల్లో సహాయపడే సమయం ఇది. అజీర్తి సమస్యలు మిమ్మల్ని ఇంట్లో వండిన ఆహారానికే పరిమితం చేయవచ్చు.

లక్కీ సైన్ - ఒక ముత్యం

* కన్య
ఈ రోజు మీకు ఓ ప్రకాశవంతమైన, భారమైన భావోద్వేగాలతో కూడిన సమయంగా మారొచ్చు. మీరు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై అప్పటికప్పుడే ప్రాక్టికల్ గా మారే అవకాశం ఉంది. మీ చర్చల వ్యూహాలకు కొంత పదును పెట్టాల్సిన అవసరం రావొచ్చు.

లక్కీ సైన్ - కొత్త రింగ్

మీకు త్వరగా పెళ్లి కావాలంటే.. ఈ చిన్న వాస్తు చిట్కా చాలు!

* తుల
ఈ రోజు శక్తి అనేది వ్యూహాత్మక పని చేసే వ్యక్తుల వైపు ఎక్కువగా మళ్లుతుంది. మీరు స్థిరంగా ఉన్నట్లయితే మంచి పురోగతి సాధించవచ్చు. కోపానికి సంబంధించిన సమస్యలు మీ దృష్టిని మళ్లించవచ్చు, కానీ అది ఎక్కువ కాలం ఉండదు.

లక్కీ సైన్ - ఒక రేడియో

* వృశ్చికం
ఈరోజు తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ నడవచ్చు. మీ చతురత, అనుభవం కీలకంగా మారొచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ప్లాన్ ఈరోజు నుంచి రూపుదిద్దుకోవడం ప్రారంభించవచ్చు.

లక్కీ సైన్ - ఒక టెర్రకోట బేసిన్

* ధనుస్సు
మీరు ఈ రోజు కాస్త అసూయగా ఉండొచ్చు. మీ అదృష్టాన్ని, మీకు దక్కిన అన్ని వరాలను, సౌకర్యాలను గుర్తు చేసుకోవడం ద్వారా అసూయ అనే భావన నుంచి బయటపడొచ్చు. సాయంత్రం నాటికి విహారయాత్ర ప్లాన్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

లక్కీ సైన్ - ఒక సిలికాన్ అచ్చు

అష్టలక్ష్మిని ఏ రూపంలో పూజిస్తే ఏ పుణ్యఫలం లభిస్తుందో తెలుసుకోండి..

* మకరం
కొంతమంది పాత స్నేహితులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. అయితే మీరు వారితో చేరే మూడ్‌లో ఉండకపోవచ్చు. కొంత సమయాన్ని మీకు మీరు కేటాయించుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు. తలనొప్పి మిమ్మల్ని పట్టి పీడించవచ్చు.

లక్కీ సైన్ - ఒక కొవ్వొత్తి

* కుంభం
మీ మరచిపోయిన హాబీ లేదా మీకు ఇష్టమైన పాత పనులలో సమయం గడపటానికి ఇది మంచి రోజు. మీ అంతర్గత శక్తి ఈరోజు ఉత్సాహంగా కనిపిస్తుంది. డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా పరిష్కారమవుతున్నట్లు కనిపిస్తాయి.

లక్కీ సైన్ - మిఠాయి

* మీనం
గతంలో చోటుచేసుకున్న కొన్ని నిరాశాజనకమైన ఘటనలు మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు. మీ సహోద్యోగులను ఎక్కువగా విమర్శించకపోవడం మంచిది. మీ జీవిత భాగస్వామి దూరం అయినట్లు అనిపించవచ్చు. పెండింగ్‌లో ఉన్న సంభాషణ ఇప్పుడు పూర్తి కావచ్చు.

లక్కీ సైన్ - అగ్గిపెట్టె
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac sign

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు