Home /News /astrology /

DAILY HOROSCOPE ON 24 01 2022 HERE IS TELUGU ASTROLOGY FOR ALL 12 ZODIAC SIGN KNOW ABOUT YOURS PJC GH SK

Horoscope Today: నేటి దినఫలాలు.. ఈ రాశి వారికి ఎసిడిటీ, ఇతర అనారోగ్య సమస్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope today: దిన ఫలాల ఆధారంగా.. జనవరి 24, సోమవారం నాడు.. ఏ రాశి వారికి ఎలా గడుస్తుందో.. ఎవరికి బాగుందో? ఎవరికి సమస్యలు ఉన్నాయో.. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

(పూజచంద్ర, జ్యోతిష్య నిపుణులు)

Horoscope Today: ఈరోజు సోమవారం. కొందరు వారి మనస్సు​ చెప్పే మాటనే వినాలి. అది వారిని జీవితంలో మరో మెట్టెక్కిస్తుంది. మరికొందరు తమ పట్ల ఉన్న అపార్థాలను తొలగించుకుంటారు.  దిన ఫలాల ప్రకారం.. ఇవాళ మేషం నుంచి మీన రాశి వరకు.. జనవరి 24, సోమవారం నాడు ఎవరికి ఎలా గడుస్తుందో  తెలుసుకుందాం.

* మేషం (Aries): మార్చి 21-ఏప్రిల్ 19
రోజు ప్రారంభం ఏ మార్పులేనిదిగా అనిపించొచ్చు. కానీ వేగం పెరుగుతుంది. చేస్తున్న పనిపై ప్రయత్నాలను కొనసాగించండి.

లక్కీ సైన్- పూలు

* వృషభం (Taurus): ఏప్రిల్ 20-మే20
హామీ ఇచ్చిన పనిని చేపట్టి, సకాలంలో పూర్తి చేస్తారు. అక్కడక్కడా కొన్ని వాదనలు మీ దృష్టి మరలుస్తాయి. రుణం కోసం దరఖాస్తు చేసినట్లయితే.. ఆ సొమ్ము త్వరలో ఆమోదం పొందుతుంది.

లక్కీ సైన్- ఉడతలు

* మిథునరాశి (Gemini): మే 21- జూన్ 21
సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా కమిట్‌మెంట్‌లు గడువులోగా పూర్తి చేయడం ద్వారా మీరు మంచి స్థితిలో ఉంటారు. మీకు కొత్త అవకాశం రాబోతున్నట్లు కనిపిస్తోంది.

ఈ 6 రాశులకు ఫిబ్రవరీ ఆరంభంలోనే సంతోషం-ఐశ్వర్యం పెరుగుతుంది! మీరు

లక్కీ సైన్- స్పష్టమైన క్రిస్టల్

* కర్కాటకం (Cancer): జూన్ 22- జూలై 22
ప్రాధాన్యత పరంగా పనిని పూర్తి చేయండి. ఒక డెడ్​లైన్​ని నిర్ణయించుకోవడం అవసరం. కొందరు మహిళా సహోద్యోగులు మీ పని ప్రదేశంలో అంతరాయం సృష్టిస్తారు. అనుకున్న చిన్న ట్రిప్ ప్రస్తుతానికి వాయిదా పడవచ్చు.

లక్కీ సైన్ - పూల బొకే

* సింహం(Leo): జూలై 23- ఆగస్టు 22
సాధారణం కంటే మరింత శక్తిమంతంగా భావించి ఈ రోజును ప్రారంభించండి. మీ ప్రణాళికలను ఆవిష్కరించేందుకు ఇదే మంచి రోజు. ప్రతి వివరాలను ముందుగా చర్చించుకోండి.

లక్కీ సైన్- ఒక రాగి పాత్ర

* కన్య (Virgo): ఆగస్టు 23-సెప్టెంబర్ 22
మీ మైండ్​ చెప్పే మాటను వినండి. అది మిమ్మల్ని నెక్ట్స్ లెవల్​కు తీసుకెళ్తుంది. మీరేదైనా చర్చలో పాల్గొంటే మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పండి. మీ క్లయింట్ మిమ్మల్ని స్నేహితుడిలా విశ్వసిస్తారు.

లక్కీ సైన్- డిజిటల్ బిల్‌బోర్డ్

Vastu Tips: మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులా? డబ్బు నిలవడం లేదా? ఈ తప్పులు  చేయకండి

* తుల (Libra): సెప్టెంబర్ 23- అక్టోబర్ 23
మీ పట్ల కొందరికి ఉన్న అపార్థాలు ఇప్పుడు తొలగిపోతాయి. మీ రోజు బిజీగా ఉంటారు. సాధారణ పనితో బిజీగా ఉంటారు. మీ వెకేషన్‌లోనూ డ్యూటీ వల్ల అంతరాయం కలగొచ్చు. అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి.

లక్కీ సైన్- ఒక జనపనార బుట్ట

* వృశ్చికం (Scorpio): అక్టోబర్ 24 - నవంబర్ 21
ఉన్నతాధికారులు మీ పై అధికారం చెలాయిస్తారు. ముందుగా మీ ఇంటి పనులు సరిదిద్దుకోవడం నేర్చుకుంటారు. అనవసరమైన రిస్క్ తీసుకోకండి. ఆసుపత్రికి వెళ్లే అవకాశం ఉంది. అయితే త్వరగానే కోలుకుంటారు.

లక్కీ సైన్- కళాఖండాలు

ఈ 4 రాశులవారు తమ ప్రేమను సాధించడానికి ఏదైనా చేస్తారు.. మరి మీ లవర్ రాశి కూడా ఇదేనా?

* ధనుస్సు (Sagittarius): నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రోజు చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది. రియల్ ఎస్టేట్ విషయాల్లో ఎవరైనా మీ సహాయాన్ని కోరవచ్చు. ఎక్కువసేపు ఏదైనా పని చేస్తున్నట్లయితే, మీ విధానాన్ని మార్చుకోవాలని భావించొచ్చు. వాకింగ్ మీ మనస్సును క్లియర్ చేస్తుంది.

లక్కీ సైన్- సోఫా

* మకరం (Capricorn): డిసెంబర్ 22 - జనవరి 19
దూరంగా ఉన్న స్నేహితులతో కనెక్ట్ కావడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజు పని సరదా సమయాలతో గడిచిపోతుంది. మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. జీర్ణక్రియ లేదా ఎసిడిటీ సమస్యలు తలెత్తవచ్చు.

లక్కీ సైన్-నీలం రాయి

* కుంభం(Aquarius): జనవరి 20-ఫిబ్రవరి 18
ఇతరులను ఆకట్టుకునే ఓ విలువైన పరిశోధనను కనుగొంటారు. ఇంట్లో, కార్యాలయంలో వస్తువులను సర్దుకునేందుకు సమయం దొరుకుతుంది. అనుకోని సమస్య వల్ల మీ తల్లి ఆందోళన పడుతుంది. ఆమెను శాంతింపజేయడానికి మీరు బాగా పని చేస్తారు.

లక్కీ సైన్- పాత కెమెరా

రాశిచక్రం ప్రకారం.. 2022లో జతకట్టబోయే బెస్ట్ జోడీ ఏదో తెలుసా?

* మీనం (Pisces): ఫిబ్రవరి 19 - మార్చి 20
మీ చుట్టూ గాసిప్ రాయుళ్లు ఉంటారు జాగ్రత్త. వారి వల్ల మీరు చేయాల్సిన క్లిష్టమైన పనిని పక్కన పెట్టాల్సి రావచ్చు కూడా. మీ కుటుంబ సభ్యులు ఎప్పటిలాగే ఓదార్పునిస్తారు. కాస్త వాకింగ్ చేయండి.

లక్కీ సైన్- ఒక గాజు సీసా
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు