Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...

Daily Horoscope : గ్రహాల కదలికలు, రాసులను బట్టీ ఈ రోజు ఎవరి అదృష్టం ఎలా ఉందో విజయవాడకు చెందిన ప్రముఖ జ్యోతిష్కులు రాళ్ళపల్లి వెంకటేశ్వర శర్మ (srivatcha@gmail.com) గారి ద్వారా తెలుసుకోండి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 15, 2019, 5:41 AM IST
Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...
రాశి ఫలాలు - మీ రాశి ఫలాలు తెలుసుకోండి.
  • Share this:
తేది: 15-8-2019
మేషరాశి వారికి ఈరోజు ఉద్యోగ, వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభదాయకంగా ఉంటుంది. మిత్రుల వలన సమస్యలు తలెత్తవచ్చు. కొద్దిపాటి భయాందోళన కలుగవచ్చు.

వృషభరాశి వారు ఈరోజు ధన విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. శతృపరంగా ధననష్టం కలిగే అవకాశం కలదు. కుటుంబపరంగా చికాకులు కలుగవచ్చు. స్వల్ప ధనలాభం కలుగవచ్చు.

మిధునరాశి వారు ఈరోజు ఆర్థికపరంగా ఎక్కువ జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైన అప్పులు చేయడం మంచిది కాదు. వాటివల్ల ఒత్తిళ్లకు లోనవుతారు.

కర్కాటకరాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు, ధనవ్యయం అధికంగా ఉండవచ్చు. వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. సోదరుల వల్ల కొద్దిపాటి లాభం కలుగవచ్చు.

సింహరాశి వారు ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సమయాలలో వాటి వల్ల ఇబ్బందులు కలుగవచ్చు. దూర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. కుటుంబంలో చికాకులు కలుగవచ్చు.

కన్యారాశి వారికి ఈరోజు శారీరక మానసిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండును. చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు కలుగవచ్చు. మనస్సు స్థిరత్వం తగ్గవచ్చు.తులారాశి వారు ఈరోజు సత్కార్యాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు చిన్నపాటి చిక్కులు కలుగవచ్చు. వాటిని నిరోధించే ఆలోచనలు చేస్తారు.

వృశ్చికరాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు స్వల్ప ధనలాభాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

ధనస్సురాశి వారు ఈరోజు ధన విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులు, అవసరం లేని అప్పులు చేయాలనే ఆలోచనలు కలిగే అవకాశం కలదు. శారీరక, మానసిక ఒత్తిళ్ళు కలిగే అవకాశం ఉంది.

మకరరాశి వారికి ఈరోజు సంతానపరంగా సామాన్యంగా ఉంటుంది. ధనపరమైన చిక్కులు రావచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు బుద్ధి మందగించే అవకాశం కలదు.

కుంభరాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు, తద్వారా లాభం కలిగే అవకాశం కలదు. సత్కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో శారీరక, మానసిక శ్రమ కలిగే అవకాశాలు కలవు.

మీనరాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకంగా ఉన్నా ఖర్చులు అవసరమైనవి కలుగుతాయి. మానసిక చికాకులు కలుగవచ్చు. సోదరుల వల్ల ఇబ్బందులు, ఆకస్మిక ప్రయాణాలు కలుగవచ్చు.
Published by: Krishna Kumar N
First published: August 15, 2019, 5:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading