Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...

Daily Horoscope : గ్రహాల కదలికలు, రాసులను బట్టీ ఈ రోజు ఎవరి అదృష్టం ఎలా ఉందో విజయవాడకు చెందిన ప్రముఖ జ్యోతిష్కులు రాళ్ళపల్లి వెంకటేశ్వర శర్మ (srivatcha@gmail.com) గారి ద్వారా తెలుసుకోండి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 13, 2019, 7:29 AM IST
Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...
రాశి ఫలాలు - మీ రాశి ఫలాలు తెలుసుకోండి.
  • Share this:
తేది: 13-8-2019
మేషరాశి వారికి ఈరోజు మధ్యవర్తి వ్యవహారాల వలన ధనప్రాప్తి కలుగవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శత్రువుల వలన ఆర్థికపరమైన ఇబ్బందులు రావచ్చు.

వృషభరాశి వారికి ఈరోజు బంధువుల వల్ల సోదరుల వల్ల శుభవార్తలు వినే అవకాశం కలదు. ప్రయత్న పూర్వకంగా అనుకున్న కార్యాలు నెరవేరే దిశగా ఆలోచనలు చేస్తారు.

మిధునరాశి వారికి ఈరోజు అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగ, విద్యా, వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకరాశి వారు ఈరోజు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతూ లాభాలు గడిస్తారు. పారమార్థిక చింతన కలిగి ఉంటారు. సహ ఉద్యోగ, వ్యాపారస్తులతో జాగ్రత్త వహించడం మంచిది.

సింహరాశి వారు ఈరోజు విద్యార్థులు దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. తద్వారా మానసిక శారీరక శ్రమ అధికం అయ్యే అవకాశం కలదు. ఉన్నత వ్యక్తుల సాంగత్యం లభిస్తుంది.

కన్యారాశి వారికి ఈరోజు శ్రమకు తగ్గ ఫలం దక్కకపోవచ్చు. శత్రువుల వలన ఇబ్బందులు కలుగవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులకు సామాన్యంగా ఉండును.తులారాశి వారు ఈరోజు సాహస కార్యాలలో ఆసక్తి చూపుతారు. కుటుంబ, ధన, సంతాన విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావచ్చు.

వృశ్చికరాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉన్నా సంతృప్తికరంగా ఉండదు. మానసిక చింతన కలుగవచ్చు.

ధనస్సురాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగవచ్చు. దూరప్రయాణాలు చేసే అవసరాలు రావచ్చు. వాటివల్ల లాభం కలుగవచ్చు. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది.

మకరరాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది. శ్రమ కూడా అధికంగా ఉంటుంది. విద్యార్థులు మందబుద్ధి కలిగి ఉంటారు.

కుంభరాశి వారికి ఈరోజు ఆర్ధికపరమైన జాగ్రత్తలు అవసరం. అప్పులు చేసే ఆలోచనలు కలుగవచ్చు. శారీరక, మానసిక శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది.

మీనరాశి వారికి ఈరోజు పనులలో కొద్దిపాటి ఆటంకాలు కలిగే అవకాశం వుంది. చిన్నపాటి సమస్యలు రావచ్చు.
Published by: Krishna Kumar N
First published: August 13, 2019, 7:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading