DAILY HOROSCOPE FOR MONDAY JANUARY 3 2022 FOR ALL ZODIAC SIGNS BY ASTROLOGER POOJA CHANDRA GH PJC SSR
Horoscope Today: జనవరి 3 రాశి ఫలాలు.. ఈ రోజు 12 రాశుల వారికి ఎలా ఉంటుందంటే..
ప్రతీకాత్మక చిత్రం
కొత్త సంవత్సరం 2022లో మొదటి సోమవారం అయిన జనవరి 3వ తేదీన ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది? ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి? రాశి చక్రములోని 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుంది? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త సంవత్సరం 2022లో మొదటి సోమవారం అయిన జనవరి 3వ తేదీన ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది? ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి? రాశి చక్రములోని 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుంది? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం (Aries): మార్చి 21-ఏప్రిల్ 19
జాబ్ కోసం ప్రయత్నించడానికి.. గత బకాయిలు చెల్లించడానికి ఇది మంచి రోజు. తేలికపాటి అంటువ్యాధులు లేదా తలనొప్పి బాధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం ముఖ్యం. ఏదైనా వాగ్వాదం జరిగినప్పుడు శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇది భవిష్యత్తులో సహాయం చేస్తుంది.
లక్కీ సైన్ - పచ్చని తోట
వృషభం (Taurus) : ఏప్రిల్ 20-మే20
ఈ రోజు ఎనర్జీలు పవర్ ఫుల్ గా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఒక కొత్త పని ప్రారంభించేలా ప్రేరేపిస్తాయి. ఎవరైనా రుణం అడిగితే మీరు సున్నితంగా తిరస్కరించండి. ఈరోజు బాగా నడవడం మంచిది.
లక్కీ సైన్ - బూడిద రంగు ఈక
మిథునరాశి (Gemini) : మే 21- జూన్ 21
మీరు లోలోపల మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ.. ఇతరులు మీ ఎమోషనల్ సైడ్ ను అర్థం చేసుకుంటారు. శారీరకంగా, మానసికంగా నిలకడగా ఉండేందుకు కొన్ని చర్చల వ్యూహాలు అవసరమౌతాయి. సహోద్యోగి నిజంగానే అవసరంలో ఉండి మీ సహాయం కోసం అడగవచ్చు.
పాత పరిచయస్తుడిని మళ్లీ కలిసే అవకాశం ఉంది. ఈరోజు ఔట్ సైడ్ అపాయింట్మెంట్లు అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు ఒక మంచి పనికి మద్దతు ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే.. ఈరోజు ఒక సదవకాశం లభించవచ్చు.
లక్కీ సైన్ - కార్బన్ కాగితం
సింహం (Leo): జూలై 23- ఆగస్టు 22
అతిథులు చెప్పాపెట్టకుండా మిమ్మల్ని కలిసే అవకాశాలున్నాయి. ఈరోజు అంతా చాలా శుభప్రదంగా, సంతోషంగా గడుస్తుంది. కొన్ని పెండింగ్ బకాయిలు క్లియర్ కావచ్చు. మీ సహాయక సిబ్బంది ఫిర్యాదును తీసుకురావచ్చు. దాన్ని పరిష్కరించడం మంచిది.
పని ప్రదేశంలో వాతావరణం అనుకూలంగా కనిపిస్తుంది. ఎన్నో రోజులుగా వాయిదా వేస్తున్న సంభాషణను మీరు ప్రారంభించే అవకాశం ఉంది. ఇంట్లో, కార్యాలయంలో పేపర్ వర్క్ మెయింటెన్ చేయడం ముఖ్యం. నిద్ర లేమితో బాధపడతారు. కాబట్టి ఈరోజు రాత్రి చక్కటి నిద్ర పొందేలా జాగ్రత్త వహించండి.
లక్కీ సైన్ - నిమ్మ సువాసన
తుల (Libra) : సెప్టెంబర్ 23- అక్టోబర్ 23
ఇతరుల పట్ల జాలి, దయ చూపించినంత మాత్రాన మీరు బలహీనులు అవ్వరు. మీ బలమైన పాయింట్లను ముందుకు ఉంచండి. కొత్త రెసిపీని ప్రయత్నించడానికి ఇది గొప్ప రోజు. మీ ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి.
లక్కీ సైన్ - ఎరుపు త్రాడు
వృశ్చికం (Scorpio): అక్టోబర్ 24 - నవంబర్ 21
పీడకలలు లేదా చెడు కలలు అనేవి కేవలం సబ్కాన్షియస్ మైండ్లోని భయాలు మాత్రమే. అందువల్ల వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వ్యతిరేక లింగానికి(ఆడ లేదా మగ) చెందిన ఓ వ్యక్తి మీ దృష్టిని ఆకర్షించవచ్చు. మీరు ఈరోజును మధుర జ్ఞాపకంగా మార్చేందుకు పాత స్నేహితుడికి కాల్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
లక్కీ సైన్ - ఎర్ర ఇటుక గోడ
ధనుస్సు (Sagittarius): నవంబర్ 22 - డిసెంబర్ 21
మీ సన్నిహితుల్లోని ఒకరు మిమ్మల్ని బాగా మిస్ అవుతారు. ఈరోజు మీ ప్రియమైనవారి కోసం సమయం కేటాయించండి. సాయంత్రం వేళ విహారయాత్రకు వెళ్లొచ్చు. సాధారణ మెడికల్ చెకప్ చేయించుకుంటే మంచిది.
ఈ రోజంతా పాత జ్ఞాపకాలు మిమ్మల్ని అతిగా ఆలోచించేలా చేస్తాయి. ఒక్కసారి రియాలిటీ చెక్ చేసుకుంటే ఉపయుక్తంగా ఉండవచ్చు. మీ తల్లిదండ్రులను, ముఖ్యంగా తల్లితో కాస్త సమయం గడపడం చాలా మంచిది. ఎందుకంటే ఆమె మీతో మాట్లాడాలని కోరుకుంటూ ఉండొచ్చు. పాత విధానం కోసం కొత్త ప్రణాళికను రూపొందించండి.
లక్కీ సైన్ - ఒక గాజు సీసా
కుంభం (Aquarius)): జనవరి 20- ఫిబ్రవరి 18
మీ భయాలు అదుపులో ఉంటాయి. పీడకలలు మిమ్మల్ని వెంటాడవు. ఎందుకంటే ఈ రోజుతో మీ సమయం మారిపోతుంది. ఇటీవలి నెలల్లో మీరు సాధించిన దానికి మీరు గర్వంగా ఫీల్ అవుతారు. మీరు అదనపు బాధ్యతను భుజాలపై వేసుకొని అవకాశం ఉంది.
లక్కీ సైన్ - పాత మర్రి చెట్టు
మీనం (Pisces): ఫిబ్రవరి 19 - మార్చి 20
మీరు మీ కుటుంబానికి ఎమోషనల్ సపోర్ట్ సిస్టంగా ఉంటారు. ఈరోజు వారు మీ నుంచి ఎక్కువ సపోర్ట్ ఆశించవచ్చు. కొత్త ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. మీరు వైద్య నిపుణులు అయితే సాధారణ రోజుల కంటే ఈరోజు చాలా బిజీగా గడుపుతారు. ప్రభుత్వ అధికారులు ఆటంకాలు ఎదుర్కొంటారు.
లక్కీ సైన్ - మూడు పక్షులు
పూజా చంద్ర, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.