Home /News /astrology /

DAILY HOROSCOPE 20TH JANUARY 2022 THESE ZODIAC SIGNS MAY FACE SOME PROBLEMS TODAY CHECK YOUR ZODIAC SIGN IN THAT LIST PJC GH SK

Horoscope Today: నేటి దిన ఫలాలు.. ఇవాళ ఈ రాశుల వారికి అస్సలు బాగాలేదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: నేడు కొన్ని రాశుల వారికి బాగాలేదు. ఆఫీసులో పని ఒత్తిడి ఉంటుంది. పెండింగ్ పనిని ఇవాళే పూర్తి చేయాల్సి ఉంటుంది. రోజంతా బిజీగా ఉంటారు. మరి మీది కూడా ఆ రాశియేనా ఇక్కడ చూసుకోండి.

(పూజ చంద్ర, జ్యోతిష్య నిపుణులు)

రాశుల ఆధారంగా మన భవిష్యత్తును తెలుసుకోవచ్చని జ్యోతిష్యం చెబుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... రోజువారీ రాశి ఫలాల ఆధారంగా మనం ఎదుర్కొనే పరిస్థితులను ముందుగానే తెలుసుకోవచ్చు. మరి జనవరి 20 గురువారం రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

మేషం (Aries):
మీ వృత్తితో పాటు ప్రవృత్తి మీకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి మీరు చేసే పనిలో కాస్త శ్రద్ధ వహించాలి. చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న పని ఇప్పుడు పూర్తి చేయాల్సి రావచ్చు. మనసు నుంచి స్పష్టత పొందడం ముఖ్యం.

లక్కీ సైన్-ఆకుపచ్చ వస్త్రం

వృషభం (Taurus) :
పాత పనులను పూర్తి చేయడానికి కొత్త మార్గాలు అన్వేషించడానికి ఇదే మంచి రోజు. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. మీ మనసులోని మాటను ఎవరికైనా చెప్పాలనుకుంటే ఈరోజే చెప్పండి.

లక్కీ సైన్- మెరిసే అరికిల్

Zodiac Sign: ఈ రాశుల వారికి త్వరలో డబ్బే డబ్బు..పేదోడిగా పుట్టినా శ్రీమంతుడవుతారు

మిథునరాశి (Gemini):
మీ ఖచ్చితమైన ఆలోచనలను కమ్యూనికేట్ చేయడంలో సమస్యను ఎదుర్కొంటారు. వాటిపై మళ్లీ పని చేయండి. పని ప్రదేశంలో ఏర్పడే ఘర్షణ కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. వ్యక్తిగత ఎజెండాలకు ప్రాధాన్యత ఉండవచ్చు.

లక్కీ సైన్- వార్తాపత్రిక

కర్కాటకం (Cancer):
భావోద్వేగ మద్దతు కోసం బయటి వ్యక్తులపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండేందుకు ప్రయత్నించండి. మీ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్​ని పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొనడం ద్వారా మంచి భోజనంతో మీ రోజు ముగియవచ్చు.

లక్కీ సైన్- గాజు కూజా

సింహం(Leo):
కొత్త అవకాశాలను సృష్టించుకునేందుకు మీ సమయాన్ని వెచ్చించండి. శ్రద్ధ చూపించకపోవడం వల్ల మీ జీవిత భాగస్వామి నిరుత్సాహపడవచ్చు. తీవ్రమైన పని షెడ్యూల్​లో బిజీగా ఉంటారు.

లక్కీ సైన్- ఇష్టమైన కాఫీ

మీకు రోడ్డుపై డబ్బులు కనిపించాయా? అది దేనికి సంకేతమో తెలుసా?

కన్య (Virgo):
ఈ రోజు ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి మీ మనసును ముందుగా ప్రోగ్రామ్ చేయండి. అది జరుగుతుంది కూడా. అలాంటి చురుకైన శక్తిని మీరు ఎక్స్​పీరియన్స్ చేస్తారు. ఆహారంలో కొంచెం మార్పు చేస్తే మంచిది. దానికి త్వరగా అలవాటు పడండి.

లక్కీ సైన్- ఉప్పు

తుల (Libra) :
తరచూ మీ కంపెనీని కోరుకునే వారి నుంచి దూరంగా ఉండండి. మీ పాత సహోద్యోగులు మీతో త్వరలో ఓ సమావేశాన్ని ప్లాన్ చేయవచ్చు. తెలిసిన వ్యక్తితో కలిసి మీ పనిని సులభతరం చేసుకునే అవకాశం మీకుంది.

లక్కీ సైన్- స్పోర్ట్స్ వాచ్

వృశ్చికం (Scorpio):
మీలోని అసలైన ప్రతిభ మరోసారి ఇబ్బందులపాలవుతుంది. మీరు బాగా స్పందించినప్పటికీ మీ పిల్లలు అసాధారణమై వాటి వెంట పరుగెడుతుంటారు. అయితే మీరు వారితో చర్చించవచ్చు. లాంగ్ డ్రైవ్ కోసం బయలుదేరే అవకాశం ఉంది.

లక్కీ సైన్- ఫెన్స్​డ్ గార్డెన్

జాగ్రత్త.. ఈ క్యాలండర్ మీ ఇంట్లో ఉంటే.. ఆ ఏడాది మొత్తం అశుభమే..!

ధనుస్సు (Sagittarius):
పనిలో తీవ్రమైన చర్చ కొత్త నిబంధనలకు దారితీయవచ్చు. ఈరోజు మీకు ఎమోషనల్ సపోర్ట్ అవసరం కావచ్చు. పాత అలవాట్లు మారాల్సిన సమయం వచ్చింది.

లక్కీ సైన్- ఓల్డ్ సర్టిఫికేట్

మకరం (Capricorn) :
కార్యక్షేత్రంలో కొత్త సవాళ్లు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. మీరు బిజీగా ఉండే అవకాశం ఉంది. సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి ఓ కొత్త ఒప్పందాన్ని చదవండి. మీరు ఎవరినైనా ఇష్టపడితే వ్యక్తపరిచే ముందు మరికొంత సమయం వేచి ఉండాల్సి రావచ్చు.

లక్కీ సైన్- ఫేవరేట్ డిజర్ట్

కుంభం (Aquarius):
మీ డైలీ దినచర్యతో అలసిపోయి ఉంటారు. కొత్త లక్ష్యం కోసం ఈ రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

లక్కీ సైన్- ఒక గ్లాస్ టాప్ టేబుల్

ఈ 4 రాశులవారిని తక్కువ అంచనా వేయకండి.. ఎందుకంటే వారి ట్యాలెంట్

మీనం (Pisces):
చర్చలో మీ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి కొత్త పరిస్థితులు తలెత్తుతాయి. ఎంత తీవ్రమైన సమస్య అయినా కొద్ది రోజుల తర్వాత పరిష్కారం అవుతుంది. దాని చుట్టూ ఉన్న పరిస్థితులు మారవచ్చు.

లక్కీ సైన్- మిర్రర్‌వర్క్ ప్యాచ్
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Horoscope, Rashifal, Rasi phalalu, Zodiac sign

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు