• Home
  • »
  • News
  • »
  • astrology
  • »
  • COLD MOON 2020 YOU CAN SEE FULL COLD MOON TWO DAYS THIS YEAR HERE IS THE DETAILS OF DATE AND TIMINGS NK

Cold Moon 2020: అరుదైన పూర్ణ చందమామ... నేడు మిస్సవ్వకండి...

Cold Moon 2020: అరుదైన పూర్ణ చందమామ... మిస్సవ్వకండి... (File Image)

Cold Moon 2020: అంతరిక్షంలో జరిగే అద్భుతాలు మనం కోరినప్పుడు రావు... అవి వచ్చినప్పుడే మనం వాటిని చూడగలం. మిస్సైతే... మళ్లీ చూద్దామన్నా ఛాన్స్ రాదు. మరి అరుదైన పూర్ణ చందమామ విశేషాలు తెలుసుకుందాం.

  • Share this:
    Full Moon of December: దేశవ్యాప్తంగా చలి గాలులు పెరుగుతున్న వేళ నేడు చంద్రుడు మనకు సంపూర్ణంగా కనిపించబోతున్నాడు. దీన్నే డిసెంబర్ ఫుల్ మూన్ (full moon of December) అంటున్నారు. అంటే ఈ నెలలో రాబోతున్న సంపూర్ణ చందమామ అన్నమాట. ఇందులో ప్రత్యేకత ఏముంది... ప్రతీ నెలలో వస్తూనే ఉంటుంది కదా అని మనకు అనిపించవచ్చు. ఈసారి వచ్చే ఫుల్ మూన్‌కి 4 ప్రత్యేకతలు ఉన్నాయి. 1.ఇది ఈ సంవత్సరంలో చివరి ఫుల్ మూన్. 2.ఇది అత్యంత చల్లటి గాలులు వస్తున్న సమయంలో వస్తోంది కాబట్టి... మంచు వాతావరణంలో సరికొత్తగా కనిపిస్తుంది. 3.డిసెంబర్ 21 నుంచి పగటి సమయం కంటే రాత్రి సమయం పెరుగుతోంది. అంటే ఈ ఫుల్ మూన్... రాత్రి సమయం ఎక్కువగా ఉన్న రోజుల్లో రాబోతోంది. 4.ఈ చందమామను అమెరికాలో లాంగ్ నైట్స్ మూన్ (‘Long Nights Moon’), కోల్డ్ మూన్ (Cold Moon) అని పిలుస్తున్నారు. క్రిస్మస్ తర్వాత వచ్చే సంపూర్ణ చందమామను అలా పిలుస్తారు. యూరప్‌లో యూలే తర్వాత వచ్చే చందమామ (‘Moon after Yule’) అంటారు.

    మొన్ననే డిసెంబర్ 21న గురుగ్రహం పక్కనే శనిగ్రహం కనిపించింది. దాన్ని క్రిస్మస్ స్టార్ (‘Christmas Star’) అని పిలిచారు. అందరూ కళ్లారా ఆ దృశ్యం చూసి... ఒకింత ఆనందం పొందారు. మరి ఇప్పుడు మనం 2020 కోల్డ్ మూన్ ఎలా చూడాలో తెలుసుకుందాం.

    తేదీ:
    2020 చివర్లో వచ్చే ఈ కోల్డ్ మూన్... ఈ సంవత్సరంలో వచ్చిన 13వ సంపూర్ణచందమామ. ఇది వరుసగా రెండు రోజులు కనిపిస్తుంది. మొదటిది డిసెంబర్ 29న అంటే మంగళవారం రాత్రి కనిపిస్తుంది. రాత్రంతా కనిపిస్తుంది. మంగళవారం కంటే... బుధవారం ఇంకా సంపూర్ణంగా ఉన్న చందమామ కనిపిస్తుంది. భారతీయులు దీన్ని కళ్లారా చూడవచ్చు.

    సమయం:
    డిసెంబర్ 29న రాత్రి 10.30కి సంపూర్ణ చందమామ అమెరికాలో మొదలవుతుంది. భారతీయులకు మాత్రం డిసెంబర్ 30 ఉదయం 8.58కి మొదలవుతుంది. ఐతే... 29 రాత్రి, 30 రాత్రి వేళ చందమామ సంపూర్ణంగానే కనిపిస్తుంది. ఈ రెండ్రోజులూ టెలీస్కోప్ పెట్టి చూస్తే చందమామ ఎంతో కాంతివంతంగా, ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఇందుకు కారణం... గాలిలో ఉండే మంచే. కంటికి కనిపించని అతి చిన్న మంచు కణాలు... గాలిలో ఎగురుతూ చందమామను మెరిసేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

    ఇది కూడా చదవండి: ప్రపంచ రోబోటిక్ గ్యాలరీ, దేశంలోనే అతి పెద్ద ఆక్వేరియం ఎక్కడ రాబోతున్నాయో తెలుసా?

    సాయంత్రం 6 తర్వాత తూర్పు వైపు చందమామ కనిపించడం మొదలవుతుంది. సాయంత్రం 7 అయ్యేసరికి చందమామ మన తలపైకి వచ్చేస్తుంది. ఆ సమయంలో చంద్రుడిని చూసి తీరాల్సిందే.
    Published by:Krishna Kumar N
    First published: