• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • CHANAKYA NITI DONOT SPEAK BAD WORDS WITH YOUR PARENTS IN YOUR LIFE YOUR KARMA WILL GET YOU MS GH

Chanakya Niti: ఆ ఇద్దరి మీద మాత్రం ఎప్పుడూ నోరు చేసుకోవద్దు.. చాణక్య నీతి చెప్పే సారమిదే.. కర్మ సూక్ష్మం

Chanakya Niti: ఆ ఇద్దరి మీద మాత్రం ఎప్పుడూ నోరు చేసుకోవద్దు.. చాణక్య నీతి చెప్పే సారమిదే.. కర్మ సూక్ష్మం

ప్రతీకాత్మక చిత్రం

Chanakya Niti: తన శిష్యులకు చాణక్యుడు బోధించిన అతి ముఖ్యమైన విషయం మన నాలుకను అదుపులో ఉంచుకోవటం. మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులపై ఎప్పుడూ నోరు పారేసుకోరాదని, వారిని తిట్టడం, దూషించటం, దుర్భాషలాడటం చేయరాదని బోధించారు.

  • News18
  • Last Updated:
  • Share this:
అత్యంత విలువైన జీవిత సత్యాలను మనకు బోధించిన ఆచార్య చాణక్య నీతిని మనమంతా తెలుసుకుని, ఆచరిస్తే మన జీవితం అత్యంత సుగమంగా సాగుతుంది. చాణక్యుడు చెప్పే వ్యాక్య ప్రయోగం కఠినంగా అనిపించినా అందులోని విషయం మాత్రం అత్యంత క్లిష్టసమయంలో కూడా మనకు దిశా నిర్దేశం చేస్తాయి. చాణక్య నీతిని తెలుసుకోవటం నేటి పరిస్థితుల్లో అత్యవసరం. వ్యక్తిగత జీవితమైనా, వృత్తిపరమైన జీవితమైనా విజయం సాధించాలంటే చాణక్య నీతి అన్ని కాలాల్లోనూ చక్కని మార్గం చూపే మార్గదర్శి. మనల్ని అత్యుత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దే శక్తి ఉన్న ఈ నీతి సారాన్ని మనం గ్రహిస్తే ఇక తిరుగుండదు.

తన శిష్యులకు చాణక్యుడు బోధించిన అతి ముఖ్యమైన విషయం మన నాలుకను అదుపులో ఉంచుకోవటం. మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులపై ఎప్పుడూ నోరు పారేసుకోరాదని, వారిని తిట్టడం, దూషించటం, దుర్భాషలాడటం చేయరాదని బోధించారు. మనకు జన్మనిచ్చి, మాట నేర్పిన తల్లిదండ్రులను చెడు మాటలతో హింసించరాదని బోధించారు. ఇలా చేస్తే అది శాపంగా మారుతుందని కూడా ఆయన హెచ్చరించారు. తల్లి, తండ్రులపై ఎప్పుడు పరుష మాటలు ప్రయోగించవద్దని ఆయన బోధించారు. ఇన్ని అన్ని తరాల వారికి వర్తిస్తుందన్న చాణక్య నీతిని మానవ జాతి సదా గుర్తుంచుకోవాలి.

కర్మ ఇదే..

మనం ఎవరి ముందు మాట్లాడుతున్నాం, ఎవరి గురించి ఎలాంటి పదాలు ప్రయోగిస్తున్నామన్నది ఎప్పుడూ గుర్తెరిగే మాట్లాడాలని చాణక్యుడు హెచ్చరించారు. "ఒక్కసారి సంధించిన బాణాన్ని మళ్లీ వెనక్కు తీసుకోగలమా.. సరిగ్గా ఇలాంటిదే మీ తల్లిదండ్రులపై దురుసైన మాటల ప్రయోగం, దీని పర్యవసానం భరించక తప్పదు".. అజ్ఞానంతో అమ్మా, నాన్నలను తిట్టకూడదంటూ, ఇదంతా కర్మ అని ఆయన తన బోధనల్లో వివరించారు. బాగా కోపం వచ్చినప్పుడు, అసహనంతో రగిలిపోతున్నప్పుడు తల్లిదండ్రులే పిల్లలకు టార్గెట్ అవుతారు, ఇది లోకంలో అత్యంత సహజంగా జరిగే పని.

ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులను బాధపెట్టే కఠిన పదాలు ప్రయోగిస్తుంటారు. కానీ పిల్లల ఉద్దేశం నిజంగా అది కాకపోయినప్పటికీ ఆగ్రహాన్ని అణచుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడతారని ఆచార్యుల వారు చెప్పుకొచ్చారు. చెడ్డ ఉద్దేశం లేకపోయినప్పటికీ ఇలాంటి మాటలు తూలిన దాని పర్యవసానాన్ని భవిష్యత్తులో అనుభవించక తప్పదని, ఇవే శాపాలై వారిని వేధిస్తాయని చాణక్యుడు హెచ్చరించారు. ఒకప్పుడు మాటలు నేర్పిన తల్లిదండ్రులపై మాటలు తూలటం మహా పాపమని, కోపంలో కళ్లు మూసుకుపోయి ఇలాంటి పనులు చేయరాదని నీతి బోధించారు.
Published by:Srinivas Munigala
First published: