Cancer Horoscope 2023: నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తారు. జూన్ 22 నుంచి జులై 22వ తేదీల మధ్య జన్మించిన వారికి కర్కాటక రాశి వర్తిస్తుంది. ఇప్పుడు కొత్త సంవత్సరం 2023 కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? రిలేషన్, కెరీర్‌కి సంబంధించి ఎలాంటి మార్పులు ఎదుర్కొంటారు? అనే విషయాలు తెలుసుకోండి.
* జనవరి
మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే, ఇతరుల నుంచి అంత విశ్వాసాన్ని పొందడం ప్రారంభిస్తారు. మీరు దీన్ని అనుసరిస్తే, ఎక్కువ ప్రతిఘటన లేకుండానే విషయాలు జరుగుతాయని గమనించవచ్చు. మీ పిల్లలు సంతోషానికి ప్రాథమిక మూలం కావచ్చు. మీరు మీ దినచర్యను కొంత విరామం ఇచ్చి, ఇతర బాధ్యతలపై దృష్టి పెట్టవచ్చు.
రిలేషన్: మీకు విశాల హృదయం ఉంది. చాలా ఎమోషనల్‌గా ఉంటారు. వీటిని పదే పదే దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. మీరు మీ ప్రస్తుత రిలేషన్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినట్లు ఫీల్ అవుతారు. ప్రతిదీ హోల్డ్‌లో ఉంచుతుంది. ఇది డిస్ట్రాక్టింగ్‌గా ఉండవచ్చు.
కెరీర్: ధన ప్రవాహం బాగానే ఉంటుంది. ఒత్తిడి అదుపులో ఉండవచ్చు. ఒకవేళ వాయిదా పడి ఉంటే, వర్క్‌కి సంబంధించిన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు పరిస్థితి గురించి మీ సీనియర్‌లతో స్పష్టంగా చాట్ చేయాల్సి ఉంటుంది.
అదృష్ట రంగు: మస్టర్డ్(Mustard)
* ఫిబ్రవరి
జీవితం తక్కువ సవాలుగా అనిపించవచ్చు. మీరు ఉన్నత స్థాయికి ఎదగడానికి కొంత కొత్త స్ఫూర్తిని పొందవచ్చు. ఒక మాజీ సహోద్యోగి వ్యక్తిగత పని కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చు. పరిమిత అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఒకదాన్ని కనుగొనవచ్చు. ఇది రిసీవింగ్ సమయం, దాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. అణచివేసిన భావోద్వేగాలు బహిరంగంగా ప్రదర్శించే అవకాశం ఉంది, ఇతరుల దృష్టిని మరల్చవచ్చు.
రిలేషన్: మీరు ఇంతకు ముందు డేటింగ్ చేసిన వ్యక్తి, ఇప్పటికీ మీ గురించి భావోద్వేగంగా ఉంటారు. మీ భాగస్వామి ఒక ముఖ్యమైన విషయాన్ని దాచి ఉండవచ్చు. మీ కమ్యూనికేషన్ సంబంధాన్ని సజీవంగా ఉంచి ఉండవచ్చు.
కెరీర్: గతంలో జరిగిన ఆర్థిక పురోగతి కొంత కాలానికి స్థిరంగా మారవచ్చు. ఔచిత్యానికి సంబంధించిన ఒక అవకాశం గతాన్ని గుర్తు చేయవచ్చు. పోటీ పరీక్షకు హాజరవుతుంటే, దయచేసి మీరు ఒకేసారి ఎక్కువ సోర్సెస్‌ను ఉపయోగించకుండా చూసుకోండి.
అదృష్ట రంగు: ఎరుపు(Red)
మీది తులా రాశా? అయితే కొత్త సంవత్సరం 2023 మీకు ఎలా ఉంటుందో తెలుసుకోండి
* మార్చి
విశ్వం ప్రస్తుతం మీ అవసరాలు, కోరికల ఆధారంగా తగిన సర్దుబాట్లు చేయడానికి ప్రయత్నిస్తోంది. అది జరిగినప్పుడు మీరు కృతజ్ఞతతో నిండి ఉండవచ్చు. ఇంట్లో చిన్న సమస్యపై చిన్న గొడవ లేదా అసమ్మతి ఎదురుకావచ్చు. ఆధ్యాత్మిక సాధన ప్రశాంతంగా ఉండవచ్చు.
రిలేషన్: మీ జీవిత భాగస్వామికి మీతో ప్రాథమిక అవగాహన లేకపోవచ్చు. పూర్తిగా విరుద్ధంగా ఏదైనా సూచించవచ్చు. మీకు కొంత సమయం కేటాయించుకోవాలని, స్పేస్ తీసుకోవాలని అనిపించవచ్చు. ఒక స్నేహితుడు మీ పట్ల ఫీలింగ్స్ పెంచుకోవచ్చు, కానీ వ్యక్తీకరించడానికి సిగ్గుపడవచ్చు.
కెరీర్: ఎవరైనా కొత్తవారు మీ టీమ్‌లో చేరవచ్చు, కానీ ఇప్పటికే అంతర్గత సిస్టమ్‌లో బాగా కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది. మీకు కచ్చితంగా తెలియకుంటే, సహాయం చేయడానికి ముందుకు రాకండి. ఎప్పటి నుంచో వినియోగిస్తున్న పని విధానం మిమ్మల్ని వెనుకకు నెట్టవచ్చు.
అదృష్ట రంగు: కొరల్(Coral)
* ఏప్రిల్
మీరు దేని గురించి అయినా ఎక్కువసార్లు ఊహిస్తే.. మీరు భయపడే అంశాలు నిజమయ్యే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి ఉత్తమ మార్గం దానికి శక్తిని ఇవ్వడం ఆపివేయడం. మీరు మీ మానసిక శక్తిపై పనిచేస్తున్నట్లుగా శక్తులు సాధారణం కంటే క్రమశిక్షణతో కూడిన రోజుని సూచిస్తాయి. మీరు మీ దినచర్యను చాలా దగ్గరగా అనుసరించవచ్చు. మీ స్నేహితులు ఒకరిద్దరు మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మీరు కలవడానికి ఇష్టపడకపోవచ్చు.
రిలేషన్: మీ విధానాన్ని సింప్లిఫై చేయండి. మీరు రిలేషన్‌షిప్‌ను నిర్వచించే టిపికల్ గైడ్‌లైన్స్‌ను అనుసరిస్తూ ఉండవచ్చు. కొంత స్పేస్ మీ ఇద్దరికీ కొత్త లైఫ్‌లైన్‌ని అందించవచ్చు.
కెరీర్: మీకు కొత్త ఒప్పందం చేసుకునే ఆలోచన ఉంటే, మీరు మీ భాగస్వామిని ఎంచుకోవడంపై పునరాలోచించాలి. కొంత అసమగ్రమైన రాతపని మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ప్రాధాన్యత పరంగా సుదూర భాగస్వామి కంటే స్థానిక భాగస్వామి ఎల్లప్పుడూ మెరుగ్గా ఉండాలి.
అదృష్ట రంగు: సిల్వర్(Silver)
* మే
మీకు ముఖ్యమైన వారితో అపాయింట్‌మెంట్ ఉంటే, మీరు వారి సమయాన్ని, మానసిక స్థలాన్ని గౌరవిస్తున్నారని నిర్ధారించుకోండి. మీరు అమలు చేయలేని ఆలోచనల గురించి మాట్లాడకుండా ఉండవచ్చు. ఒక వృద్ధుడు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. తల్లిదండ్రులు ఏదైనా ముఖ్యమైనదాన్ని ప్లాన్ చేస్తూ ఉండవచ్చు. దాని గురించి మీ అభిప్రాయం, భాగస్వామ్యం అవసరం.
రిలేషన్: లోతుల్లో దాగున్న ప్రేమ రిలేషన్ కోసం తన సొంత మార్గాన్ని కనుగొనడం ప్రారంభించవచ్చు. ఎన్నో మంచి జ్ఞాపకాలను మిగిల్చే నెల ఇది. సుదూర ప్రాంతాలలో ఉన్నవారు, మీ భాగస్వామితో కొంత సమయం గడపడానికి అవకాశం ఉంది.
కెరీర్: కొనసాగుతున్న ఆర్థిక అస్థిరత త్వరలో ముగిసిపోతుంది, చాలా ఉపశమనాన్ని అందజేస్తుంది. సీనియర్లు మీ గురించి చాలా అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు, మీరు వారిని నిరాశపరచకుండా ఉండటానికి ప్రయత్నించవచ్చు. విద్యార్థులు ప్రిపరేషన్‌తో చాలా అలసిపోతారు.
అదృష్ట రంగు: మహోగని(Mahogany )
మీ రాశికి 2023లో ఏ తేదీ అత్యంత అనుకూలమైనది? తెలుసుకోండి..
* జూన్
ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వాదనకు దిగాలని అనుకోవచ్చు. ప్రతిఘటించడం మంచిది. స్వభావం సమస్య కావచ్చు, కానీ మీరు దానిని శాంతింపజేయడానికి మార్గాలను కనుగొనవచ్చు. ఇతరులు పని, ఒత్తిడితో మీపై భారం వేయడానికి ప్రయత్నించవచ్చు. మీ మనస్సులో చాలా జరుగుతూ ఉండవచ్చు, ప్రతిదాని గురించి మాట్లాడటం ముఖ్యం కాదు. గతంలోని సమస్యను పరిష్కరించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఆరుబయట సమయం గడపడం చాలా అవసరమైన మార్పును తీసుకురావచ్చు.
రిలేషన్: కొత్త ప్రేమకథ కేవలం ఆకస్మికంగా జరగవచ్చు. ఇది ఎక్కువ కాలం ఉండకపోవచ్చు కానీ అది మిగిల్చిన జ్ఞాపకాలు చాలా బలమైనవి. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామితో క్విక్ ట్రిప్ ప్లాన్ చేయవచ్చు. మీ రిలేషన్‌కు సంబంధించి స్నేహితుల ద్వారా ప్రభావితమైనట్లు కనుగొనవచ్చు.
కెరీర్: స్నేహితుడితో కలిసి వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది. సాయుధ దళాలలో ఉన్న మీలో కొంతమందికి బిజీ సమయం రావచ్చు. మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్‌ను అన్వేషించే అవకాశం ఉండవచ్చు.
అదృష్ట రంగు: సియాన్(Cyan)
* జులై
మీరు ఒక ప్రణాళికను రూపొందించి ఉండవచ్చు, కానీ దాని అమలుకు ఓపిక పట్టి మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. సాధారణ రోజువారీ పనులు ఆలస్యంగా మారవచ్చు. మీరు సంతృప్తికరమైన సమయం వైపు వెళుతున్నారు. మీరు గతంలో చేసిన వాటికి ప్రతిఫలాన్ని పొందవచ్చు. చాలా విషయాల గురించి ఆలోచించడం గందరగోళానికి, అనవసరమైన ఒత్తిడికి దారితీయవచ్చు. కాబట్టి రోజుకు ఓ విషయంపై దృష్టి పెట్టండి. కొంచెం మానసిక విరామాన్ని ప్లాన్ చేయవచ్చు.
రిలేషన్: సమయం అనుకూలంగా ఉన్నందున పాత సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి. విదేశాలలో నివసిస్తున్న పాత స్నేహితుడు మీతో సంబంధాన్ని అన్వేషించడానికి ఆసక్తిని కలిగి ఉండవచ్చు. చిన్ననాటి ప్రేమ కూడా కావచ్చు.
కెరీర్: ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. ముందస్తు ప్రణాళిక ప్రాముఖ్యతను కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకుంటారు, కానీ మీరు దానిని సకాలంలో ఉపయోగించాలి. సమయానుకూలమైన సలహా మీకు క్లిష్టమైన నిర్ణయం తీసుకోవడంలో కూడా సహాయపడవచ్చు.
అదృష్ట రంగు: మెరూన్(Maroon)
* ఆగస్ట్
మీరు కొన్ని అవసరంలేని ఎమోషన్స్‌కి లోనవుతున్నట్లు అనిపిస్తుంది. ఇది మీకు మిశ్రమ భావాలు, భావోద్వేగాలను మిగిల్చే సమయం. మీరు మానసికంగా కూడా బలహీనంగా ఉండవచ్చు. యాదృచ్ఛిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు ప్రస్తుతం ఏదైనా విషయంలో గందరగోళంగా ఉంటే, దాన్ని వదిలివేయండి.
రిలేషన్: పబ్లిక్‌గా ప్రైవేట్ సంభాషణలు చేయడం మానుకోండి. ప్రత్యేకించి మీ జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్త పాటించండి. గతానికి సంబంధించిన ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. ఒకే సమయంలో ఎక్కువ మందితో సన్నిహితంగా ఉండటం మానుకోండి.
కెరీర్: మీరు అన్ని చోట్లా అనుభూతి చెందుతుంటే, ప్రశాంతంగా ఉండి పని చేయడం ఉత్తమం. మీరు మీ టీమ్ నుంచి ముఖ్యంగా నాన్-టెక్నికల్ సిబ్బంది నుంచి చాలా సపోర్ట్ పొందవచ్చు. ఏదైనా వాదన ఎదురైతే, ఆ సమయాన్ని గడిచి పోనివ్వండి.
అదృష్ట రంగు: ఇండిగో(Indigo)
* సెప్టెంబర్
మిమ్మల్ని మీరు సంతోషపరచుకోండి. మీ మనస్సు పునరుజ్జీవనం పొందాలి. ఎలాంటి రిలాక్సేషన్ అయినా మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడవచ్చు. మీరు మీ స్నేహితులతో తక్కువ సమయం, మీతో ఎక్కువ సమయం గడపాలని అనుకోవచ్చు. మీపై భారంగా ఉన్న ఒక నిర్దిష్ట కుటుంబ ఒత్తిడి ఇప్పుడు పరిష్కారమవుతుంది. సహాయాలు కోరడం మానుకోండి.
రిలేషన్: ఇంతకు ముందు కనిపించని వ్యక్తి, ఇప్పుడు ఆసక్తికరంగా మారవచ్చు. అవతలి వ్యక్తి కమ్యూనికేట్ చేయడానికి మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోండి. ఏర్పాటు చేసిన అరేంజ్డ్ మ్యారేజ్ ప్రపోజల్‌లో ఈ నెల కదలిక ఉంటుంది.
కెరీర్: పనిలో స్తబ్దత ఇప్పుడు గతం. మీరు స్థిరమైన పని జీవితం కోసం ఎదురుచూస్తుంటే.. ఆప్షన్లు చుట్టుముట్టవచ్చు. మీరు త్వరలో ఉన్నత రోల్ కూడా పొందవచ్చు.
అదృష్ట రంగు: సీ గ్రీన్(Sea green)
* అక్టోబర్
చాలా కాలం తర్వాత మీపై మీ నమ్మకం పెరుగుతుంది. మీ గత విజయాలు మీ అంతర్గత సామర్థ్యంపై మీకు భరోసా ఇచ్చేందుకు తిరిగి వస్తాయి. మీరు ఏవైనా పెట్టుబడులు పెడితే, అవి నెమ్మదిగా కదలికను చూపడం ప్రారంభించవచ్చు. కొంతమంది బంధువులు మీ నగర సందర్శనను ప్లాన్ చేసుకోవచ్చు, త్వరలో కలుసుకోవచ్చు.
రిలేషన్: మీ ప్రస్తుత రిలేషన్ నుంచి విషాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి గురించి మీ ఆలోచనలను పునఃపరిశీలించుకోవడానికి సూచన ఉండవచ్చు. మీరు దాచినట్లు భావించేవి ఇప్పటికే కొంతమందికి తెలిసి ఉండవచ్చు.
కెరీర్: మీరు మీ ఇటీవలి ప్రెజెంటేషన్‌తో పనిలో ఉన్న వ్యక్తులపై మంచి అభిప్రాయాన్ని సృష్టించవచ్చు. మిమ్మల్ని గమనిస్తున్న ఎవరైనా మీ కోసం సానుకూల మార్పు తీసుకురావాలని ప్లాన్ చేయవచ్చు. బ్యాంకు రాతపని నిర్వహించడానికి కొన్ని రోజులు కేటాయించవచ్చు.
అదృష్ట రంగు: ఆరెంజ్(Orange)
* నవంబర్
మరొక వ్యక్తి ఉద్దేశాన్ని అంచనా వేయడం అంత తేలికైన పని కాకపోవచ్చు. కానీ మీరు ఇప్పటికీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను విశ్వసించడం మీకు అంత సులభం కాదు. మీరు ప్రస్తుత ప్లాన్‌కు గణనీయమైన బ్యాకప్‌ని కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. ప్రయాణాలు త్వరలో జరగవచ్చు. మీరు విస్మరించడానికి ప్రయత్నిస్తున్న ఎవరైనా అనుకోకుండా ల్యాండ్ కావచ్చు. మీ సన్నిహితులను తెలివిగా ఎన్నుకోండి.
రిలేషన్: మీ ఇద్దరి మధ్య కొంచెం అసౌకర్యం ఉండవచ్చు. కారణం గత వాదనలు, కఠిన పరిస్థితులు కావచ్చు. త్వరలో కొత్త ఆశాకిరణం కూడా కనిపించవచ్చు. సుదూర సంబంధాలు ఉన్నవారు కలవడానికి ప్లాన్ చేసుకోవచ్చు.
కెరీర్: ఇది సంవత్సరంలో చేసిన కష్టానికి సంబంధించిన ప్రయోజనాలు పొందే సమయం. వారి ఉద్యోగంలో మీ సహాయాన్ని కోరే వ్యక్తిని కూడా ఆశించవచ్చు. మీ ప్రయత్నాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
అదృష్ట రంగు: మిడ్‌నైట్ బ్లూ(Midnight Blue)
* డిసెంబర్
మీరు నిర్దిష్ట ఔచిత్యం గురించి సంప్రదాయవాదంగా ఉండవచ్చు. సరళమైన విధానం త్వరలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో మీకు సహాయపడవచ్చు. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. కలిసి పనిచేయడానికి కొత్త అవకాశాన్ని పొందవచ్చు. ధైర్యం కనుగొనడం ఉపయోగకరంగా ఉంటుంది. ఏదో ఒక రకమైన గుర్తింపును పొందే సూచనలు ఉన్నాయి.
రిలేషన్: రిలేషన్ కొనసాగించడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సవాళ్లను తరచుగా ఎదుర్కోవడం మిమ్మల్ని మరింత దృఢంగా మార్చింది. కొన్నిసార్లు వ్యంగ్యం తగ్గకపోవచ్చు.
కెరీర్: ఇది పని ప్రదేశంలో కొంచెం నిదానమైన సమయం కావచ్చు. కొత్త ఉద్యోగాల్లో ఉన్నవారు తమ ఉద్యోగాలను నిలబెట్టుకోవడానికి తెలివిగా పని చేయాల్సి ఉంటుంది. కెరీర్ మారడానికి మరికొంత కాలం వేచి ఉండొచ్చు.
అదృష్ట రంగు: బంగారం(Gold)
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cancer, Horoscope, New Year 2023