Bhakti: పండితుల ప్రకారం... ఆగస్ట్ 8న వచ్చే ఆదివారం అలాంటిలాంటి రోజు కాదు. అరుదైనది, ప్రత్యేకమైనది, అద్భుతమైనది. ముఖ్యంగా ఈ ఆదివారం సూర్య భగవానుడు... పుష్యమి నక్షత్రంలో ఉదయం 9గంటల 30 నిమిషాల వరకు ఉంటారు. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రంలోకి వెళ్లిపోతారు. సూర్యుడు పుష్యమీ నక్షత్రంలో ఉండేంత వరకూ ఆదివారం అద్భుతమైన రోజుగా చెబుతున్నారు. దాన్నే రవి పుష్యయోగం అని పిలుస్తున్నారు. దానికితోడు ఆదివారం నాడు అమావాస్య కూడా. ఇలా సూర్య భగవానుడు... ఆదివారం వేళ పుష్యమీ నక్షత్రంలో ఉండటం అనేది అరుదైన, అద్భుతమైన రోజు అని పండితులు చెబుతున్నారు. పైగా అమావాస్యతో వచ్చిన రోజు ఇది. అంటే... ఏదైనా మంచి తంత్ర పూజ చేసేటప్పుడు అమావాస్య వస్తే... ఆ తంత్రం అద్భుతంగా పనిచేస్తుందని వివరిస్తున్నారు.
ఎన్నో ఫలాలు:
ఈ ఆదివారం చేసే కార్యక్రమం ఆర్థిక వృద్ధిని కలిగిస్తుంది. వాస్తు దోషాలు పోగొడుతుంది. అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందేలా చేస్తుంది. రాజయోగం పట్టిస్తుంది. కష్టాలు, దారిద్ర్యం పోగొడుతుంది. జీవితంలో బాగా ఎదిగేందుకు ఇది ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు.
ఇలా చెయ్యండి:
ఉదయం 9.30 దాకా సూర్యభగవానుడు పుణ్యమీ నక్షత్రంలో ఉంటారు. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రంలోకి వచ్చేస్తారు. అలా వచ్చేసే లోపు ఎక్కడైనా తెల్ల జిల్లేడు చెట్టు (Calotropis Procera tree) దగ్గరకు వెళ్లి... దానికి ఓ కంకణం కట్టి... ఆ చెట్టుకి పసుపు, కుంకుమలు చల్లి... బెల్లం కలిపిన నీళ్లను ఆ చెట్టుకు పోసి.. "ఓ వృక్ష రాజమా... నీ నుంచి ఓ వస్తువు తీసుకెళ్తున్నాను. ఇది నాకు అన్ని విధాలా మేలు చెయ్యాలి. ఐశ్వర్యం ప్రసాదించాలి" అని కోరుకోవాలి. ఆ తర్వాత ఆ తెల్ల జిల్లేడు చెట్టు వేరు చిన్న ముక్క లేదా... బెరడు చిన్న ముక్క తీసుకోవాలి. దాన్ని ఇంటికి తీసుకెళ్లాలి. ఈ తెల్ల జిల్లేడు మొక్కలు రోడ్ల పక్కన, ఊర్లలో చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటాయి.
ఇంటికి తీసుకెళ్లిన వేరును ఒకేసారి మొత్తం వాడేయకూడదు. అది అత్యంత పవిత్రమైనది. దాన్లో కొంత భాగాన్ని ఒక తాయత్తులో... వెండి లేదా ఇత్తడి లేదా పంచలోహాల తాయత్తు లేదా రాగి తాయత్తులో తెల్ల జిల్లేడు వేరును కొద్దిగా వేసి... సూర్య భగవానుడి నామస్మరణ చేస్తూ... సూర్య నమస్కారం చేసుకొని... మెడలో ధరించాలి. సూర్యుణ్ని నమస్కరించుకోవాలి. ఇలా చేస్తే... దారిద్ర్యం వదిలిపోతుంది. అప్పుల నుంచి బయటపడతారని పండితులు సూచిస్తున్నారు. తెల్ల జిల్లేడు వేరు తాయత్తు ధరించేవారికి ఆరోగ్యం, ఆయుష్యు, ఐశ్వర్యం మూడూ లభిస్తాయనీ... ఆ ఇంట పెళ్లిళ్లు జరుగుతాయనీ, ఉద్యోగాలు లభిస్తాయనీ, విదేశీయానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi's Vehicle Owl: లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనంగా ఎలా అయ్యిందో తెలుసా?
తెల్ల జిల్లేడు చెట్టు వేరు తెచ్చుకోలేకపోతే... తెచ్చుకున్న బెరడును... గణపతి ఆకృతిలో చెక్కించుకోవాలి. దాన్ని పూజగదిలో పెట్టుకొని రోజూ పూజలు చేస్తే... ఆ ఇంట్లో వారంతా సిరి సంపదలతో ఉంటారు. గణపతి ఆకృతి కాకపోతే... ఆంజనేయస్వామి ఆకృతైనా చేయించుకోవచ్చు. అలా చేయిస్తే శత్రువుల బాధ తొలగిపోతుంది. శత్రువులు మీ జోలికి రాలేదు. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది, శుభకార్యాలు జరుగుతాయి, వాస్తు దోషాలు పోతాయి అని పండితులు చెబుతున్నారు.
ఇలాంటి రోజు మళ్లీ మళ్లీ రాదు. ఆ తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడుందో ఇవాళే వెతుక్కోవాలి. ఆ వేరు, బెరడు సేకరించడం అనేది... ఆదివారం ఉదయం 9-30 లోపు పూర్తవ్వాలి. అదే కీలకం. ఆ తర్వాత తాయత్తు ఎప్పుడైనా మెడలో వేసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Bhakti, Devotional, Horoscope, Sun