హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

New Year Remedies: న్యూ ఇయర్ తొలి రోజు ఇలా చేయండి.. ఏడాది మొత్తం మీ దగ్గర డబ్బేడబ్బు

New Year Remedies: న్యూ ఇయర్ తొలి రోజు ఇలా చేయండి.. ఏడాది మొత్తం మీ దగ్గర డబ్బేడబ్బు

కొత్త ఏడాది ఇలా చేస్తే డబ్బే డబ్బే

కొత్త ఏడాది ఇలా చేస్తే డబ్బే డబ్బే

New Year Remedies: మరో ఏడాది గడిచిపోతోంది.. త్వరలో న్యూ ఇయర్ లోకి అంతా అడుగు పెట్టబోతున్నాం.. దీంతో గడిచిన ఏడాది కష్టాలన్నీ పోయి.. న్యూ ఇయర్ హ్యాపీగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు. అలాంటి వారు.. న్యూ ఇయర్ తొలి రోజు.. ఇలా చేస్తే.. మీ దగ్గర డబ్బు డబ్బు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

New Year Remedies: ప్రతి ఒక్కరూ.. ప్రతి రోజు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. భగవంతుడిని ప్రార్థిస్తారు. ఇక న్యూ ఇయర్ (New Years) వస్తే.. చాలా హోప్స్ తో అడుగుపెడతారు.. ఇంట్లో సుఖ శాంతులు, అష్ట ఐశ్వర్యాలు లభించాలని కోరుతూ.. భగవంతుడిని ప్రార్ధిస్తుంటారు. అంతా శుభం జరగాలని కోరుకుంటారు. అలా కోరుకునే వారు.. కొత్త ఏడాది ఈ చిట్కాలు ఫాలో అయితే.. మీరు కావాల్సినంత డబ్బు వస్తుంది. అయితే కొత్త సంవత్సరాదికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది. అందరూ ఇప్పటికే కొత్త ఏడాదిని ఎలా ప్రారంభించాలి. కొత్త ఏడాది చేయాల్సిన పనులు ఏంటి..? ఇలా చాలా హోప్ప్ పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త ఏడాది అంతా హ్యాపీగా ఉండాలని.. అలాగే కష్టాలు అన్నీ తొలిగిపోవాలని.. అంతా బాగుండాలని కోరుకుంటారు. ముఖ్యంగా కొత్త ఏడాది అంతా..? తమపై లక్ష్మీదేవి (God Lakshmi) కటాక్షం ప్రాప్తించాలని భావిస్తారు. అయితే అలా ఏడాది అంతా మీపై లక్ష్మీ దేవి కటాక్షం ఉండాలి అంటే..? కొన్ని పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు.

కొత్త ఏడాది ఉపాయాలు

కొత్త ఏడాది మొదటిరోజున హనుమంతుడి పూజకు విశేష మహత్యముందని పండితుల చెబుతున్న మాట. ఆ రోజున హనుమంతుడిడి పూజిస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏడాదిలో కనీసం నాలుగుసార్లు హనుమంతుడికి ప్రత్యేక వ్రతం చేయాలని.. అలా చేస్తే.. హనుమంతుడు త్వరగా ప్రసన్నుడై కటాక్షం కురిపిస్తాడని చెబుతున్నారు.

కొబ్బరితో చిట్కాలు, మహత్యం

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొబ్బరికాయది చాలా కీలక పాత్ర అంటున్నారు. ప్రతి వ్యక్తినీ చెడు దృష్టి నుంచి కాపాడే శక్తి కొబ్బరికాయకు ఉంటుంది అంటున్నారు. అందుకే కొత్త ఏడాది మొదటి మంగళవారం, గురువారం లేదా శనివారం నాడు ఒక కొబ్బరికాయను మీ కుటుంబసభ్యులపై నుంచి 21 సార్లు దిష్టి తీయాలి. ఆ తరువాత ఆ కొబ్బరికాయను నీళ్లలో వదిలేయాలి. ఇలా ప్రతినెలా లేదా ఏడాదిలో ఒకసారి చేయాలి. ఇలా చేస్తే.. ప్రతి వ్యక్తి చెడు దృష్టి నుంచి తప్పించుకుంటారు. దోష విముక్తుడౌతాడని చెబుతున్నారు.

ఇదీ చదవండి : వైకుంఠ ద్వాదసి దర్శనానికి వెళ్లాలి అనుకుంటున్నారా.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు.. టీటీడీ సూచనలు ఇవే

బ్లాక్ సుర్మా

అలాగే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొత్త ఏడాది మొదటి రోజు 11 సార్లు కళ్లలో సుర్మా రాసుకోవాలి, దీనివల్ల రోగాలు, దోషం, భయం తొలగిపోతాయి. దాంతోపాటు వ్యక్తుల గ్రహస్థితిలో మెరుగుదల వస్తుంది. కొత్త ఏడాది మొదటి శనివారం నాడు పేదలు, ఆపన్నులకు తెలుపు లేదా రెండు రంగుల రగ్గులు పంచిపెట్టాలి. అలాగే వారికి చలినుంచే కాపాడుకునేందుకు స్వెట్టర్, షాల్ వంటివి కూడా దానం చేయవచ్చు. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Astro Tips, Earn money

ఉత్తమ కథలు