హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Bathukamma 2022: మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ ప్రత్యేకత ఇదే..

Bathukamma 2022: మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ ప్రత్యేకత ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bathukamma 2022: పూలతో తయారు చేసే బతుకమ్మ ఒక పొరగా పేర్చబడిన వృత్తాల వరుసలో పెరుగుతున్న పూల సేకరణ. దీనిని దక్షిణ భారతదేశంలోని దేవాలయాలలో కనిపించే 'గోపురం'తో పోల్చవచ్చు. బతుకమ్మ అంటే 'జీవించు తల్లి' అని అర్థం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Vizianagaram

Bathukamma 2022: పూలతో తయారు చేసే బతుకమ్మ (Bathukamma) ఒక పొరగా పేర్చబడిన వృత్తాల వరుసలో పెరుగుతున్న పూల సేకరణ. దీనిని దక్షిణ భారతదేశంలోని దేవాలయాలలో కనిపించే 'గోపురం'తో పోల్చవచ్చు. బతుకమ్మ అంటే 'జీవించు తల్లి' అని అర్థం. ఇంటిలోని స్త్రీలు పంట పండించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఇంటి శ్రేయస్సు కోసం ఆమె ఆశీర్వాదాల (Blessings)ను కోరుకుంటారు.

మొదటి ఏడు రోజులు (ఆరో రోజు మినహా) మహిళలు చిన్న బతుకమ్మ (Bathukamma ) లతో పాటు మట్టితో బొడ్డెమ్మ (గౌరీ దేవత) ప్రతీకాత్మక చిత్రాలను తయారు చేస్తారు. ప్రతి రోజు సూచించిన 'నైవేద్యం' సమర్పిస్తారు. ఇందులో నువ్వులు, బియ్యం పిండి, తడి బియ్యం, బెల్లం, మొదలైనవి

ఇది కూడా చదవండి: నవరాత్రి.. మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం పూజావిధానం..

బతుకమ్మ తెలంగాణలో చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ వర్షాకాలం చివరిలో శీతాకాలం తొలిరోజుల్లో వస్తుంది. ఈ సమయంలో వర్షాలకు చెరువులన్నీ నిండి రంగురంగుల పువ్వులు విరబూసి ఉంటాయి. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పెరుగుతాయి. అంతేకాదు, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం.

1) ఎంగిలి పూల బతుకమ్మ 2) అటుకుల బతుకమ్మ, 3) ముద్దపప్పు బతుకమ్మ 4) నానే బియ్యం బతుకమ్మ 5) అట్ల బతుకమ్మ..6) అలిగిన బతుకమ్మ..

ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి నైవేద్యమేమీ సమర్పించరు.

ఇది కూడా చదవండి: మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

7) వేపకాయల బతుకమ్మ.. 8) వెన్నముద్దల బతుకమ్మ.. 9) సద్దుల బతుకమ్మ..మొదటిరోజు చేసుకునే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. అంటే 25 పెత్తర అమావాస్య రోజు రానుంది. ప్రతి ఏడాది పెత్తర అమావాస్య రోజే మొదలవుతుంది. దీన్ని ఎందుకు అలా పిలుస్తారో తెలుసా? సాధారణంగా పూలను చేయి లేదా కత్తెరతో కట్ చేస్తాం. కానీ, కొందరు నోటితో కూడా తుంచి బతుకమ్మను తయారు చేస్తారు. ఆ విధంగా మొదటిరోజు చేసే బతుకమ్మకు ఎంగిలిపూల బతుకమ్మ అని ప్రాచుర్యంలోకి వచ్చింది.

తొమ్మిదిరోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేధ్యంగా పెడతారు. ఏ రోజు ఏ బతుకమ్మను తయారు చేస్తారంటే...

చివరి రోజు సద్దుల బతుకమ్మ, ప్రత్యేక పళ్లెంపై మహిళలు (Women) భారీ బతుకమ్మలను సిద్ధం చేస్తారు. పూలు పేర్చడంలో ఆటలు పాటలతో వేడుకలు చేసుకుంటారు. సాంప్రదాయకంగా ఆ పువ్వులు స్త్రీలు దాదాపు ఒకే రకమైన పువ్వులను ఉపయోగిస్తున్నప్పటికీ, రెండు బతుకమ్మలు ఒకేలా ఉండవు.

మూడోరోజు ‘ముద్దపప్పు బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం అందరూ కలసి ‘బతుకమ్మ’ ఆడతారు. ఈరోజు వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చక్కర, బెల్లం కలిపి పెడతారు.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )

Published by:Renuka Godugu
First published:

Tags: Bathukamma, Bathukamma 2022

ఉత్తమ కథలు