హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Astrology Today: నేడు ఈ రాశుల వారికి అస్సలు బాగాలేదు.. వ్యాపారంలో ఇబ్బందులు తప్పవు..

Astrology Today: నేడు ఈ రాశుల వారికి అస్సలు బాగాలేదు.. వ్యాపారంలో ఇబ్బందులు తప్పవు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rasi Phalalu Today: గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు చెప్పే రాశి ఫలాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆయా రాశుల స్థితిని వీరు అంచనా వేస్తారు. సెప్టెంబర్ 28వ తేదీ బుధవారం నాడు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Astrology Today: గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు చెప్పే రాశి ఫలాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆయా రాశుల స్థితిని వీరు అంచనా వేస్తారు. సెప్టెంబర్ 28వ తేదీ బుధవారం నాడు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం.

* మేషం (Aries):

ఈ రోజు సంతోషంగా మీ పనుల్లో మీరు నిమగ్నం కావచ్చు. గత కొద్ది రోజులుగా మీరు చేసుకున్న ప్లానింగ్ ప్రకారం పనుల్లోకి దిగొచ్చు. ఈ రోజు మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు అనుభవమవుతుంది.

లక్కీ సైన్ - టాన్జేరిన్ దుస్తులు

* వృషభం (Taurus):

భ్రమలో నుంచి బయటపడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఈ రోజు మీకు అంతా స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు మీకు ఎదురయ్యే సవాలు క్లిష్టతరమైనది. కానీ, అసాధ్యమైనది అయితే కాదు. ఒకసారి ప్రయత్నిస్తే చాలు. సమస్యలు ఈ రోజు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి.

లక్కీ సైన్ - లవంగాలు

Astrology: ఆడవారు ఇంటికి వెళ్లే ముందు ఈ చిన్న పని చేస్తే డబ్బే డబ్బు!

* మిథునం (Gemini):

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేందుకు ఈ రోజు మీరు ప్లాన్ వేసుకుంటారు. కానీ, మీ మనసులో ఉన్న ప్రణాళికకు మీరు వేయబోయే ప్రణాళికకు తేడా ఉండొచ్చు. మీ మాటలతో ఎవరినైనా బాధపెట్టినట్లయితే మీరు ఆ విషయాన్ని సమీక్షించుకోవాలి.

లక్కీ సైన్ - రూబి

* కర్కాటకం (Cancer):

పట్టుదలతో విజయం సాధించవచ్చన్న విషయం మీరు నేర్చుకుంటారు. అంసతృప్తి వల్ల మీరు ఈ రోజు సాధించేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకు కూడా మీరు చాలా కష్టపడి పని చేయాలి. లీగల్ ఫీల్డ్‌లో ఉన్న వారికి ఈ రోజు శుభ వార్త అందుతుంది.

లక్కీ సైన్- బంతిపువ్వు

* సింహం (Leo):

ప్రాక్టికల్‌గా ఉండటం వల్ల మీలో అహంకారం వచ్చే అవకాశాలున్నాయి. ఆర్థిక పరమైన విషయంలో ఈ రోజు మీకు కదలిక ఉండవచ్చు. కొత్త డీల్స్ చేయడమో లేదా ఏదైనా విషయమై పేపర్స్ సైన్ చేసే ముందు జాగ్రత్త వహించాలి.

లక్కీ సైన్ - మెరిసే బ్రాస్లెట్

* కన్య (Virgo):

మీరు అనుకున్న విధంగానే అవతలి వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. మిమ్మల్ని ఎలా అయితే అర్థం చేసుకోవాలని మీరు భావిస్తారో, అలా జరగకపోవచ్చు. మీ గురించి చెప్పే క్రమంలో సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పడం ఉత్తమం. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

లక్కీ సైన్ - వాటర్ బాటిల్

* తుల (Libra):

ఎవరితోనైనా మీకు ఉన్న రిలేషన్‌లో ఏవైనా లోపాలుంటే అవి చక్కబడతాయి. ఎవరితోనైనా మిస్ కమ్యూనికేషన్ జరిగి అది సంక్లిష్టంగా మారవచ్చు. విషపూరితమైన వ్యక్తుల నుంచి దూరంగా ఉండటం ఉపయోగకరం.

లక్కీ సైన్ - ఆకుపచ్చ రాయి

* వృశ్చికం (Scorpio):

ఈ రోజు మీరు ఏదైనా పనిలో మీరు జోక్యం చేసుకుంటే అది అలానే ఆగిపోవచ్చు. కాబట్టి మీరు అలా కాకుండా పనులు అవాయిడ్ చేయాలి. కొత్త భాగస్వామ్య ఒప్పందం ఈ రోజు జరగవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో మీ పని విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు చేయాలనుకుంటే ఈ రోజు చేయడం మంచిది.

లక్కీ సైన్ - ఉడత

Zodiac signs: నవరాత్రులలో ఈ రాశులవారికి దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందట..

* ధనుస్సు (Sagittarius):

మీ హృదయం నుంచి వచ్చిన విషయాలు ఈ రోజు జరగొచ్చు. చాలా కాలం నుంచి మీతో కొన్ని భావాలను పంచుకోవాలనుకున్న వారు ఈ రోజు మీతో అవి చెప్పొచ్చు. ఏదైనా చేయడానికి ధైర్యం ఉండాలి. పన్నుల విషయమై మీకు ఈ రోజు ఏ కారణం లేకుండానే అడ్డంకులు ఎదురుకావచ్చు.

లక్కీ సైన్ - పావురం

* మకరం (Capricorn):

ఓ వ్యక్తి గురించి అవగాహనకు రావడానికి ఈ రోజు మీరు గందరగోళ పడవచ్చు. ఇతరుల సంభాషణలు విని మీరు ప్రభావితం కాకుండా ఉండటం మంచిది. కొత్త వ్యాపారంలో లేదా స్టార్టప్‌లో ఉన్నవారయితే ఈ రోజు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

లక్కీ సైన్ - ఎండమావి

* కుంభం (Aquarius):

ఈ రోజు మీరు చెత్త అనుకున్నది అంతా అయిపోయి నూతన జీవితం, సాహసం చేస్తారు. దాంతో మీరు ఆత్మ సంతృప్తి పొందుతారు. ఆర్థిక ప్రణాళికలను మరొక సారి పరిశీలించుకోవాలి. ప్రతి ఒక్కటీ మీ నియంత్రణలో ఉంటుంది.

లక్కీ సైన్ - నీరు, మంచు మిశ్రమం

*మీనం (Pisces):

మీరు చాలా కాలం నుంచి గుర్తింపు కోసం చేస్తున్న పని ద్వారా మీకు ఈ రోజు గుర్తింపు లభిస్తుంది. మీరు అస్సలు అనుకోనంతగా మీకు గుర్తింపు రావచ్చు. సరైన సమయం ప్రాధాన్యతను మీరు ఈ రోజు అర్థం చేసుకోవాలి.

లక్కీ సైన్ - ఇత్తడి గాజు

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Horoscope, Zodiac signs

ఉత్తమ కథలు