Horoscope Today: మే 23 రాశి ఫలాలు. నేడు ఓ రాశివారు వృత్తి జీవితంలో సమతుల్యత సాధించే అవకాశం ఉంది. మరోరాశివారికి తోబుట్టువులతో వాదనలు ఉంటే అభిప్రాయాలను పరిమితం చేసుకోవడం మేలు. మరికొందరు సామాజిక పరిస్థితి కోసం ఉనికిని తెలిపేలా పని చేస్తారు. కొందరు ఆఫీసులో పోటీని ఎదుర్కొంటారు. మే 23వ తేదీ సోమవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి తెలుసుకోండి.
* మేషం (Aries):
వృత్తి జీవితంలో సమతుల్యం సాధించే అవకాశం ఉంది. ఓ సీనియర్ వ్యక్తి చేరడంతో చాలా అవసరమైన సహకారం అందుతుంది. గత అనుభవాల కారణంగా ప్రస్తుతం విశ్వాసం సమస్యగా మారవచ్చు.
లక్కీ సైన్- గుడ్ హ్యూమర్
* వృషభం (Taurus):
మీ దినచర్యకు సంబంధించిన పనులను పూర్తి చేయడానికి స్మూత్ రిథమ్ కనిపిస్తోంది. అనుకోకుండా అందిన ఓ వార్త మీకు ఊహాగానాలు కలిగించవచ్చు. న్యూ స్పోర్ట్స్ యాక్టివిటీ మిమ్మల్ని ఆకర్షిస్తుంది.
లక్కీ సైన్- లార్జ్ హోర్డింగ్
* మిథునం (Gemini):
మీ తోబుట్టువు మీతో వాగ్వాదించి ఉంటే, మీరు ప్రస్తుతానికి దానిపై మీ అభిప్రాయాలను పరిమితం చేయాల్సి ఉంటుంది. సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న సంభాషణ వంటి సాధారణ విషయాలు మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. స్నేహితులను ఎన్నుకోవడంలో మీరు జాగ్రత్తగా ఉంటారు. లక్కీ సైన్- సిలికాన్ మౌల్డ్
* కర్కాటకం (Cancer):
ఫలానా పని చేయాలా? లేదా? అనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడవచ్చు. మీరు కొనసాగించడాన్ని లేదా పూర్తి చేయడాన్ని ఎంచుకోవచ్చు. ప్రాథమికంగా ఆలోచన స్పష్టత ఉంటుంది. సామాజిక స్థితి ఇప్పుడు ముఖ్యమైనది కావచ్చు కాబట్టి మీరు మీ ఉనికిని తెలిపేలా పని చేసే సూచనలు ఉన్నాయి.
లక్కీ సైన్- బ్లూ రిబ్బన్
* సింహం (Leo):
సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, మీరు శక్తివంతంగా, పూర్తి ఉత్సాహంతో ఉంటారు. ఇది మీరు స్వీకరించే సానుకూల వార్తల ఫలితంగా ఉండవచ్చు. మీరు మీ పని ప్రాంతంలో కొంత పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు.
లక్కీ సైన్- ఫేవరెట్ డెసెర్ట్
* కన్య (Virgo):
మీ రోజువారీ పనులను విభజించుకోవడం సహాయకరంగా ఉండవచ్చు, ఎందుకంటే వాటిని సకాలంలో పూర్తి చేయలేకపోవడం వల్ల మీరు నిరాశకు గురవుతారు. కొంత సహాయం తీసుకోవడం మంచిది. ఇతరులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడానికి సరైన రీతిలో కమ్యునికేట్ చేయాలని నిర్ధారించుకోండి.
లక్కీ సైన్- సావనీర్
* తుల (Libra):
మీరు గతంలో మీకు చేసుకొన్న ఓ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇది సమయం. ఓల్డ్ ప్యాటెర్న్స్ కొంత వరకు పునరావృతం కావచ్చు. మీ తోబుట్టువులు కొన్ని గృహ సమస్యలను ఎదుర్కొంటారు.
లక్కీ సైన్- కాపర్ బాటిల్
* వృశ్ఛికం (Scorpio):
యాదృచ్ఛికంగా మీ ప్రస్తుత కల లేదా అబ్సెషన్గా మారిన వాటి కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇది అదృష్ట దినం. ఇతరులను కలవడం, వారితో సమాచారం పంచుకోవడం వంటి విషయాలను పరిమితం చేయాలి. అలాంటివి చేయడం ద్వారా సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి.
లక్కీ సైన్- టెర్రాకోట్ట బౌల్
* ధనస్సు (Sagittarius):
మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మిమ్మల్ని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు, మీరు వారి కంపెనీని నివారించ లేకపోవచ్చు. మీ మనసులోని ఆలోచనలను క్లియర్ చేసుకొనేందుకు సుదీర్ఘమైన నడక, కొత్త వ్యూహం ఉపయోగపడతాయి.
లక్కీ సైన్- గ్లాస్ టాప్ టేబుల్
* మకరం (Capricorn):
తొందరపడి పూర్తి చేస్తే మీ ప్రిపరేషన్ సరిపోకపోవచ్చు. చివరి నిమిషంలో ఆందోళన అంతరాయం కలిగించవచ్చు. ఒక సమయంలో ఒక విషయం తీసుకోవడం మంచిది. కొందరి మధ్యవర్తిత్వం సహాయ పడే సూచనలు ఉన్నాయి.
లక్కీ సైన్- ర్యూబిక్స్ క్యూబ్
* కుంభం (Aquarius):
పాత కల మిమ్మల్ని రోజంతా వెంటాడుతూనే ఉండవచ్చు. కొత్త దిశలో ఇప్పుడు చేసే చిన్న ప్రయత్నాలు ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఉద్యోగావకాశానికి మీరు నిజమైన లీడ్ అని మీ స్నేహితుడు చెబుతారు.
లక్కీ సైన్- చాకొలేట్స్
* మీనం (Pisces):
కొన్ని పనులు బ్యాలెన్స్ తప్పి జరుగుతున్నట్లు గుర్తించే అవకాశం ఉంది. వర్షం కురిసే సూచనలు ఉన్నాయి, సిద్ధంగా ఉండండి. త్వరలో జరగబోయే ఇంటర్యాక్షన్ గురించి ఆందోళన చెందుతున్నారా? చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నీ అనుకూలంగా జరుగుతాయి.
లక్కీ సైన్- న్యూ వెహికల్
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.