Astrology Tips For Good Luck: ప్రస్తుతం మనీ లేనిదే ఏదీ జరగదు.. అలా డబ్బులు లేక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. తమ జీవితం ఇంతే అంటూ చింతిస్తుంటారు(Problems in Life).ఎంత సంపాదించినా.. సరిపోవడం లేదు.. ఈ కష్టాల నుంచి గట్టెక్కేది ఎలా అని మదన పడుతుంటారు. తమ విధి రాతా మారాలే చేయు అని దేడుడికి మొక్కులు మొక్కుకుంటారు.. గుళ్లు గోపురాలు తిరుగుతారు.. అలా అయినా తమ కష్టాలు తగ్గుతాయని.. దురదృష్టం (Bad Luck ) పోయి అదృష్టం (Good Luck) వస్తుందని ఆశిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లగ్జరీగా, సంతోషంగా జీవించాలని (Luxury and Happy Life) కోరుకుంటారు. అలా ఉంటేనే తాము అదృష్టంతవంతులు అని ఫీల్ అవుతారు. ఇలాగే బతకాలనీ అంతా అనుకున్నా..? అది కొంత మందికే సాధ్యమవుతుంది.దీనికి కారణం దురదృష్టమే అని భావిస్తుంటారు. అయితే అలాంటి వారి కోసం ఆస్ట్రాలజీలో ఈ దురదృష్టవంతులను కూడా అదృష్టవంతులను చేసే చిట్కాలు ఉన్నాయి. కచ్చితంగా రోజూ ఇవి పాటించడం వల్ల మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
అదృష్టం రావాలంటే..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా..? లేక కుటుంబ ఇతర సమస్యలు ఏవైనా ఇబ్బంది పెడుతున్నా..? ఆదివారం నాడు తాంబూలం చెట్టను పూజించాలని.. పండితులు సూచిస్తున్నారు. అలా చేసిన తరువాత.. కొంత డబ్బును ఆ స్థలంలో ఉంచండి. దీంతో మీ అదృష్టం త్వరగా మారుతుంది.. కష్టాలు అన్నీ తీరుతాయి అని చెబుతున్నారు.
ఇదీ చదవండి : మెగా వినాయక సంబరాలు.. చిరంజీవి ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూడండి..
అలాగే మనిషి సరైన దిశలో కూర్చుని ఆహారం తీసుకుంటే జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది అంటున్నారు. జ్యోతిష్యం.. వాస్తు శాస్త్రం ప్రకారం, ఎప్పుడూ తూర్పు ముఖంగా కూర్చుని ఆహారం తీసుకోవాలి.. అలా తీసుకోవడంలో లక్ష్మీ అనుగ్రహం ఆ ఇంటిలో ఉంటుంది అంటున్నారు. అలాగే పూజలో ఉపయోగించే పువ్వులు లేదా ఇతర పదార్థాలను ఎప్పుడు తిరస్కరించకూడదు. అలాగే పూజ చేసిన తరువాత అయినా.. లేద ముందే పూవులు ఎండిపోయి ఉంటే.. వాటిని పారే నీటిలో వేయాలి అంటున్నారు. అది కుదరని పక్షంలో పాతిపెడితే అంతా శుభమే జరుగుతుంది అంటున్నారు.
ఇదీ చదవండి : మందులను దేవుడి ప్రసాదంలా సేవిస్తున్న బాలయ్య.. టీవీపై జోక్ వింటే పడి పడి నవ్వాల్సిందే
అలాగే ప్రతిరోజూ సాయంత్రం తులసి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఇది ఇంట్లో సానుకూలతను తెస్తుంది. దీంతో పాటు మాత లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుందని దాని వల్ల త్వరగా ధనవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు. రోజూ స్నానం చేసిన తర్వాత ఇంటి ఈశాన్య మూలలో గంగాజలంను చల్లాలి. ఇలా చేయడంతో ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astro Tips, Astrology, Earn money, Money Astrology, Money savings