హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu: ఈ రాశుల వారికీ రెండు రకాలుగా ఆదాయం.. ట్రావెల్‌కు ఇదే మంచి సమయం..

Rasi Phalalu: ఈ రాశుల వారికీ రెండు రకాలుగా ఆదాయం.. ట్రావెల్‌కు ఇదే మంచి సమయం..

రాశీ ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

రాశీ ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

Today Horoscope (నేటి దిన ఫలం) : జ్యోతిష్యం ప్రకారం రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 25, గురువారం నాడు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Today Horoscope (నేటి దిన ఫలం) : జ్యోతిష్యం ప్రకారం రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 25, గురువారం నాడు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో పరిశీలిద్దాం.

* మేషం

మీ జీవితం చాలా వేగంగా గడిచిపోతున్నట్లు అనిపిస్తే.. నెమ్మదించండి. కొత్త వ్యక్తి ఎవరైనా మీ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపవచ్చు. రెండు రకాలుగా సంపాదించే అవకాశం రావచ్చు. దాన్ని పరిగణనలోకి తీసుకోండి.

లక్కీ సైన్- నక్షత్ర మండలం

* వృషభం

ఒక సబ్జెక్ట్‌పై ఆసక్తికి ప్రధాన కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోవచ్చు. దాని గురించే కలలు రావచ్చు. అవి కొన్నిసార్లు కలవరపెట్టవచ్చు. ఒక అలవాటును వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మీరు ఇప్పుడు విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది.

లక్కీ సైన్ -సర్కస్

* మిథునం

ఎవరైనా మిమ్మల్ని నిశితంగా గమనిస్తూ ఉండవచ్చు. దీంతో ప్రమాదం ఉందని మీకు అనిపించవచ్చు. అయితే తెలివితేటలు, వ్యూహాలతో దాన్ని అధిగమించవచ్చు. పనిలో ఉన్న వ్యక్తులతో మీ వ్యక్తిగత సమస్యలను పంచుకోకపోవడమే మంచిది.

లక్కీ సైన్- స్పార్‌క్లింగ్ వాటర్

* కర్కాటకం

మీది మాస్టర్‌ప్లాన్‌ అయితే ఈ పాటికే ఫలితాలు వచ్చేవి. వ్యూహాన్ని మార్చుకోవడానికి ఇది మంచి సమయం. కొత్త ఆలోచన మీ సీనియర్లను ఆకట్టుకోవచ్చు. కుటుంబ జీవితం కొంత అల్లకల్లోలం కావచ్చు. అయితే అది తాత్కాలికంగా ఉంటుంది.

లక్కీ సైన్ - కొత్త చెప్పులు

* సింహం

మీ గతానికి సంబంధించిన వ్యక్తుల్లో ఎవరైనా ఇప్పుడు ఎంట్రీ ఇవ్వవచ్చు. అయితే మీరు అతన్ని పట్టించుకోకపోవచ్చు. ప్రస్తుతం విషయాలు మీకు బిజీగా అనిపించవచ్చు. అయితే మీరు ఒంటరినని ఫీలయ్యే ఛాన్స్ ఉంది. ఓ పిల్లవాడు కొంటె చేష్టలకు పాల్పడవచ్చు. అది మిమ్మల్ని రంజింపజేస్తుంది.

లక్కీ సైన్ - డైమండ్ రింగ్

* కన్య

కొత్త ప్రదేశంలో వర్క్ చాలా ప్రశాతంగా ఉండవచ్చు. అది ట్రావెల్‌కు సంబంధించినదై ఉండవచ్చు. ఆఫీస్‌లో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడానికి తహతహలాడవచ్చు. ఒక సాధారణ విధానం పెద్ద ప్రభావాన్ని సృష్టించే అవకాశం ఉంది.

లక్కీ సైన్ - గ్రహణం

* తుల

ఇంట్లో ఎవరైనా నిర్లక్ష్యంగా భావించవచ్చు. పాత ఫోటో‌ఫ్రేమ్ దాగి ఉన్న భావోద్వేగాన్ని ప్రేరేపిస్తుంది. మీ ఆలోచనలు ప్రత్యేకమైనవి, వాటిని వ్యక్తీకరించే అవకాశం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి తాజాగా సంభాషణలను ప్రారంభించండి.

లక్కీ సైన్- వైర్‌లెస్ హెడ్‌ఫోన్

* వృశ్చికం

మీ వాయిస్‌‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఓ మార్గాన్ని కనుగొనవచ్చు. అయితే మీరు ఇప్పటికే ప్లాన్ చేసి ఉంటే, దాన్ని పునఃపరిశీలించడం మీకు ఇష్టం లేకపోవచ్చు. విదేశీ పర్యటన కొత్త అవగాహన కల్పిస్తుంది. దినచర్యను కొనసాగించండి.

లక్కీ సైన్- టెర్రకోట బేసిన్

* ధనుస్సు

గడువుకు వ్యతిరేకంగా మీ ఎఫర్ట్స్ ఉండవచ్చు. అయితే స్థానిక సమస్యలకు సంబంధించి కొత్త ఆశాకిరణం కనిపిస్తుంది. యువకుడి వ్యూహం మీ లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.

లక్కీ సైన్ - సిలికాన్ ట్రే

* మకరం

మీతో స్నేహపూర్వకంగా ఉంటూనే అసూయపడవచ్చు. కాబట్టి మీరు నిశితంగా గమనించాల్సింది ఉంది. కొత్త అలవాటు వాస్తవ ప్రయోజనాలను చూపడం ప్రారంభించవచ్చు. సర్దుబాటు సమస్యలపై పని చేయాల్సి రావచ్చు. అందుకు సిద్ధంగా ఉండండి.

లక్కీ సైన్- ఎరుపు కొవ్వొత్తి

* కుంభం

న్యాయపరమైన విషయాలలో కొంత విశ్రాంతిని అనుభవించవచ్చు. పనిలో మీ పర్యవేక్షణలో ఉన్న సిబ్బంది మీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించాల్సి వస్తే, ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంచవచ్చు. మధ్యవర్తిత్వం మీకు సహాయపడవచ్చు.

లక్కీ సైన్- సోర్ క్యాండీ

* మీనం

చుట్టు జరిగే సంఘటనలు మీ దృష్టిని ఆకర్షించవచ్చు. లక్ష్యానికి దగ్గరగా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. కానీ ఇంకా సమయం ఉంది. మీరు చూడనప్పుడు ఒక అవకాశం మీ తలుపు తడుతుంది.

లక్కీ సైన్- ఎల్లో క్రిస్టల్

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Horoscope, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు