Today Horoscope (నేటి దిన ఫలం) : జ్యోతిష్యం ప్రకారం రాశిఫలాలకు అధిక ప్రాధ్యానత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 10 బుధవారం నాడు మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం.
* మేషం
చాలా కాలంగా మీరు బిజీబీజీగా గుడుపుతుంటారు. అయితే ఈరోజు మీకు అంతర్గతంగా శాంతి లభిస్తుంది. కొత్త ప్రణాళికను ప్రారంభించాలని భావించవచ్చు. పెండింగ్‌లో ఉన్న పనులను ముగించండి.
లక్కీ సైన్ - పాత ఇష్టమైన చొక్కా
* వృషభం
మీరు ఆలోచిస్తున్న ఆఫర్ చాలా వరకు మైండ్ స్పేస్ తీసుకుంటుంది. బహిరంగంగా భావోద్వేగానికి గురికాకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. దీంతో మీ పరిమితులను కచ్చితంగా మెరుగుపరుచుకోవచ్చు.
లక్కీ సైన్ - క్లాసిక్ నవల
* మిథునం
ఒక సరికొత్త ఆలోచన రాబోయే కొద్ది నెలలకు ట్రిగ్గర్ పాయింట్‌గా మారవచ్చు. దీన్ని మరింత అభివృద్ధి చేయాలని సూచన ఉంది. మీరు ఏకాంత స్థలం కోసం వెతకవచ్చు. ఆయిల్ ఫుడ్‌కు దూరంగా ఉంటే మంచిది.
లక్కీ సైన్ - అన్ స్టాండబుల్ ఫర్నిచర్
* కర్కాటకం
పై నుంచి వచ్చే సంకేతాలు, కొన్నిసార్లు మీ దృష్టిని ఆకర్షించడానికి చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఒక మహిళా స్నేహితురాలు సమయానుకూలమైన సలహాను అందించవచ్చు.
లక్కీ సైన్ - రంగురంగుల గులకరాళ్లు
* సింహం
ఇవాళ సాధారణ రోజులా అనిపించవచ్చు. కానీ మీరు క్రమంగా పురోగతిని గమనిస్తారు. మీ సంభాషణల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ ముందుకు వచ్చే పని కోసం ముందుగానే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.
లక్కీ సైన్ - పాత మర్రి చెట్టు
* కన్య
మీరు బయటికి నిర్మలంగా కనిపిస్తారు. అయితే లోపల కలతపెట్టే ఆలోచనలు ఉండవచ్చు. చిన్న విజయాలు మీకు నిజంగా ముఖ్యమైనవి. ఉత్తమ ఫలితాలను పొందడానికి మీరు మరింత ప్రాక్టికల్‌గా ఉండాలి. త్వరలో సుదీర్ఘ కారు ప్రయాణం రాబోతోంది.
లక్కీ సైన్ - కప్పు గ్రీన్ టీ
* తుల
గతంలో నేర్చుకున్న విషయాలు మార్చిపోయి ఉండవచ్చు. మీరు వాటిని మళ్లీ సాధన చేయాల్సి రావచ్చు. మీరు త్వరలోనే క్లారిటీ ఇస్తారని మీ కుటుంబం ఎదురుచూస్తోంది.
లక్కీ సైన్ - రెడ్ పెన్
* వృశ్చికం
కొన్ని కొత్త పరిణామాలు నిద్రలేని రాత్రులను మిగల్చవచ్చు. పరిస్థితులు స్థిరపడటానికి కొంత సమయం పడుతుంది. సన్నిహిత స్నేహితుడి నుంచి వచ్చే కాల్ మీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. సామాజిక పని మీ దృష్టిని ఆకర్షించవచ్చు.
లక్కీ సైన్- టూల్ కిట్
* ధనుస్సు
అడ్వాన్స్‌డ్ స్టడీస్ లేదా ఫ్యూచర్ లెర్నింగ్ టాఫిక్స్ ఈరోజు మీ దృష్టిని ఆకర్షించవచ్చు. మీరు ఇటీవల కలుసుకున్న వ్యక్తికి కొన్ని కొత్త భావాలు ఏర్పడవచ్చు. నగదు ప్రవాహం కూడా కనిపించవచ్చు.
లక్కీ సైన్ - స్పేర్ వాలెట్
* మకరం
ఏదైనా అడ్మిషన్ కోసం కొత్త అర్హత ప్రమాణాలు సరిపోవచ్చు. కోల్పోయిన వ్యక్తి లేదా ముఖ్యమైన పత్రానికి సంబంధించి కొన్ని సానుకూల వార్తలు వస్తాయి. బయటకు వెళ్లడం లేదా విరామం తీసుకోవడం మంచి ఆలోచన కావచ్చు.
లక్కీ సైన్ - కాఫర్ ఆర్టికల్
* కుంభం
కొన్ని కొత్త క్రీడా కార్యకలాపాలకు ఆకర్షితులవుతారు. ప్రజలను కలవడానికి ఇవాళ అనువైనది. ఏదైనా వైద్య అవసరాల కోసం సిద్ధంగా ఉండండి. ఒక ఫోన్ కాల్ ఈ రోజు ప్రణాళికలను మార్చవచ్చు.
లక్కీ సైన్- బంగారు గడియారం
* మీనం
మీరు ఆశ్చర్యాలను అభినందించే మానసిక స్థితిలో లేకపోవచ్చు. మీ పాత స్నేహం సంక్లిష్ట దశకు చేరుకోవచ్చు. స్వీయ సందేహం ఉంటే, మార్గనిర్దేశం చేసే వ్యక్తిని సంప్రదించండి. ఈరోజు స్వీట్‌లను తినాలని మీకు అనిపించవచ్చు.
లక్కీ సైన్ - స్పష్టమైన ఆకాశం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope Today, Rasi phalalu