హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu: ఈ రాశుల వారికీ పెళ్లి సంబంధించిన శుభవార్త వింటారు.. డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి..

Rasi Phalalu: ఈ రాశుల వారికీ పెళ్లి సంబంధించిన శుభవార్త వింటారు.. డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి..

రాశి ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

రాశి ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

Today Horoscope (నేటి దిన ఫలం): ఆగస్టు 28వ తేదీ ఆదివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Today Horoscope (నేటి దిన ఫలం): ఓ రాశివారు అసాధారణమైన అంశాలపై నమ్మకం ఉంటే ముందుకు సాగవచ్చు. మరో రాశివారు నిర్ధిష్ట లక్ష్యం కోసం పని చేస్తున్నారు. మరి కొందరు సొంత వ్యాపారం ప్రారంభించేందుకు చాలా కష్టపడుతున్నారు. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఆగస్టు 28వ తేదీ ఆదివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

* మేషం

ఇది వ్యక్తిగత ఆసక్తికి సంబంధించిన విషయం కావచ్చు, కానీ మీకు అసాధారణమైన దానిపై నమ్మకం ఉంటే, మీరు ముందుకు సాగవచ్చు. ఏదైనా స్పోర్ట్స్‌పై మీకు ఆసక్తితో ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి. మీరు మీ వ్యక్తిగత ఆసక్తులతో పాటు మీ పని ప్రణాళికలను ముందుకు తీసుకు వెళ్లాల్సిన సమయం. మిమ్మల్ని వారి బృందంలో ఉండాలని కోరుకునే వారు మీ కోసం లాబీ చేయవచ్చు.

లక్కీ సైన్- మాస్క్‌

* వృషభం

ఒక సంస్థ నుంచి వచ్చే సత్వర ప్రతిస్పందన, మీరు సెలక్ట్‌ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సూచిస్తుంది. మీ సామర్థ్యం గురించి మీకు తెలుసు, అందుకే మీరు ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించాలని ఆశిస్తున్నారు. అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ విజయాల వెనుక మీ తల్లిదండ్రుల ఆశీస్సులు ఉంటాయి. మీ కలలను సాకారం చేసుకోవడానికి స్పాన్సర్‌ కూడా లభించవచ్చు.

లక్కీ సైన్- బోరు బావి

* మిథునం

సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం మీకు ఒక కల. మీరు దాని కోసం చాలా కష్టపడుతున్నారు. ఎంత డిస్ట్రాక్షన్‌ వచ్చినా మిమ్మల్ని ఇంకో దాని గురించి ఆలోచించేలా చేయదు. ఈ వ్యాపారానికి సంబంధించి మీ అన్ని భవిష్యత్తు ప్రణాళికలను సమీక్షించవలసిందిగా సలహా. ఏదైనా అవకాశం వస్తే పూర్తిగా పరిశీలించకుండా, తిరస్కరించ వద్దు. కొంత కాలం వరకు ప్రయత్నించేందుకు తగినంత సేవింగ్స్‌ ఉన్నాయి.

లక్కీ సైన్- స్పోర్ట్స్‌ మోడల్

* కర్కాటకం

ఇప్పటికి మీకు మీ మనస్సు, ప్రవృత్తులపై స్పష్టత వస్తుంది. మీరు చేయాల్సిన పనుల గురించి, నడవాల్సిన మార్గం గురించి సూచనలు చేస్తాయి. ఈ ఆలోచనను రాబోయే రోజుల్లో దారి చూపనివ్వండి. కార్పొరేట్ ప్రపంచంలో మీలో కొందరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ముద్ర వేస్తారు. ప్రయత్నించే లేదా వేచి ఉండే వ్యక్తులకు ఇలాంటి విషయాలు జరుగుతాయి. మీరు కూడా త్వరలో గుర్తింపు పొందుతారు. త్వరలో నిజమైన ఆహ్లాదకరమైన విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

లక్కీ సైన్- సిరామిక్‌ వేస్‌

* సింహం

పబ్లిక్‌గా ప్రైవేట్ విషయాల గురించి మాట్లాడటం మానుకోండి. మీకు తెలియకుండానే మీరు ఏదో ఒక విషయంలో పాలుపంచుకున్నట్లు అనిపించవచ్చు. ఇది మిశ్రమ భావాలు, భావోద్వేగాలతో కూడిన రోజు. మీ పట్ల ఆకర్షితులైన ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. మీరు మానసికంగా కూడా బలహీనంగా ఉండవచ్చు. తొందరపాటు లేదా త్వరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. మీకు గందరగోళంగా ఉంటే, ప్రస్తుతానికి వదిలేయండి.

లక్కీ సైన్- రెడ్‌ కలర్‌

* కన్య

మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించే ఏదో ఒకటి ఎదురుకావచ్చు. అది మీరు ఇంకా ప్లాన్ చేసి ఉండకపోవచ్చు లేదా ఊహించి ఉండకపోవచ్చు. మీరు దీన్ని సీరియస్‌గా తీసుకుంటే, ఇది ఆసక్తికరమైన ప్రపోజల్‌ కావచ్చు. అందరి సలహాలను స్వాగతించవచ్చు. అందరి అభిప్రాయాలను స్వీకరించి, చివరికి మీ నిర్ణయం చెప్పవచ్చు. న్యాయవాద సంఘంలో ఉన్నవారు, రాబోయే రోజులలో కొన్ని సవాలుతో కూడిన రోజులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి.

లక్కీ సైన్- స్మార్ట్‌ వాచ్‌

* తుల

కాంపిటీటివ్‌గా ఉండటం గురించి ప్లాన్ చేయడం, పథకాలు రచించడం ఎవరి ఆసక్తికి మంచిది కాదు. మీరు మీ వ్యవహారాల్లో స్పష్టంగా మరియు పారదర్శకంగా ఉండాలి. మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా బాధపడవచ్చు. సలహా కోసం మీ వద్దకు వచ్చే అవకాశం ఉంది. మీకు ఆరోగ్యం పరంగా కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. దాని గురించి ఆందోళన చెందుతారు. ఇది తాత్కాలికమైనప్పటికీ, కాలక్రమేణా మెరుగుపడుతుంది.

లక్కీ సైన్- ప్యాటర్న్‌డ్‌ కుషన్‌

* వృశ్ఛికం

మీ వైఖరి మీకు మేలు చేస్తుంది. మీకు లాభాలను అందించడానికి మీ నెట్‌వర్క్ బాధ్యత వహిస్తుంది. కానీ అదే సమయంలో, మీరు విశ్వసనీయ సమస్యలను కూడా ఉండవచ్చు. సీనియర్లు లేదా అధికారంలో ఉన్నవారు కూడా కొన్ని సవాలు పరిస్థితులను ఎదుర్కోవచ్చు. మీ జీవిత భాగస్వామి మీ అతిపెద్ద విమర్శకులు, సపోర్ట్‌గా కూడా కొనసాగుతారు. ఆస్తి విక్రయానికి సంబంధించి ప్రాథమిక చర్చలు జరపవచ్చు.

లక్కీ సైన్- ఎంబ్రాయిడరీ వర్క్‌

* ధనస్సు

ప్రజలు చాలాసార్లు ఏదైనా పనిని పూర్తి చేయలేమని భావిస్తుంటారు. కానీ మీకు ఏ లోపం లేదు, పనిని పూర్తి చేయలేని అసమర్థులు కారు. కాబట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందండి, మీ ముందు ఉన్న లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధమవ్వండి. నెర్వస్‌కా ఫీల్‌ అవ్వకండి, మీరు కూడా అనుకొన్న స్థాయికి చేరుతారు. దేన్నీ పూర్తిగా అర్థం చేసుకోకుండా తిరస్కరించవద్దు. భవిష్యత్తులో మీరు మరింత సాహసోపేతమైన చర్యలు తీసుకోవాలని అనిపిస్తోంది.

లక్కీ సైన్- నెమలి

* మకరం

గతంలో జరిగిన చేదు అనుభవం పునరావృతం కావచ్చు. కానీ సరిగ్గా అదే విధంగా ఉండదు. మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కొత్త సందర్భాలు మెరుగైన అనుభవానికి మార్గం చూపుతాయి. ఎలైట్ గ్రూప్‌లో ఎక్కడైనా మీ కార్యాలయానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం మీకు త్వరలో లభిస్తుంది. పారదర్శకత వలన మీరు చాలా మంది ఆరాధకులను పొందుతారు.

లక్కీ సైన్- సెలబ్రిటీ

* కుంభం

ఎప్పుడైనా సంక్షోభం సంభవించినప్పుడు మీరు ఒంటరిగా మిగిలిపోతారనే వాస్తవం మీకు ఎప్పుడైనా బెదిరింపుగా అనిపిస్తే, అది కచ్చితంగా కాదు. సమయం చాలా డైనమిక్, అందరికీ మారుతూ ఉంటుంది. మీ గత తప్పిదాలను మీరు తిరిగి చూసుకోవాలి, సమీక్షించుకోవాలి. ఒక ఆధ్యాత్మిక యాత్రకి వెళ్లే సూచనలు ఉన్నాయి. మీరు కోల్పోయిన శక్తిని స్నేహితులు తిరిగి నింపుతారు.

లక్కీ సైన్- ఫ్యాన్సీ కార్‌

* మీనం

పెళ్లి చేసుకునే సమయమైతే, అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ పనికి సంబంధించి అవసరమైన వ్యక్తిని ఎంచుకోగలరు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి కూడా మీరు దేన్ని కోరుకుంటున్నారో, దాన్నే కావాలని అనుకుంటున్నాడు. బహుశా అదృష్టవంతుడు కాదని ఆలోచిస్తున్నాడు. దయచేసి అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి, ఎందుకంటే వారు అప్పుడప్పుడు అసూయను ప్రదర్శించవచ్చు. కొన్నిసార్లు ప్రతికూల మనస్తత్వం మిమ్మల్ని జీవితంలో కొన్ని అడుగులు వెనక్కి వేసేలా చేస్తుంది.

లక్కీ సైన్- ట్రీ ఆఫ్‌ లైఫ్‌

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు