Home /News /astrology /

ASTROLOGY RASI PHALALU MARRIAGE EFFORTS WILL BE FRUITFUL FOR THESE ZODIAC SIGNS THIS IS THE RIGHT TIME FOR FUTURE PLANNING AUGUST 14TH GH PJC TA

Rasi Phalalu: ఈ రాశుల వారికీ వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి.. భవిష్యత్తు ప్రణాళికకు ఇదే సరైన సమయం..

రాశీ ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

రాశీ ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

Today Horoscope (నేటి దిన ఫలం) : జ్యోతిష్యం ప్రకారం రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 14 ఆదివారం నాడు మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం. 

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
Today Horoscope (నేటి దిన ఫలం) : జ్యోతిష్యం ప్రకారం రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 14 ఆదివారం నాడు మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం.

* మేషం
వ్యక్తిగత ఆసక్తికి సంబంధించిన విషయంలో ముందుకు సాగవచ్చు. క్రీడలకు సంబంధించిన విషయాల పట్ల ఆసక్తితో మీకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉండవచ్చు. వ్యక్తిగత ఆసక్తులతో పాటు పని ప్రణాళికలను ఏకీకృతం చేయడానికి ఇది సమయం.

లక్కీ సైన్ - ముసుగు

* వృషభం
ఒక సంస్థ నుంచి సత్వర ప్రతిస్పందన, మీ ఎంపికకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు అనిపించవచ్చు. మీ సామర్థ్యం ఏమిటో మీకు బాగా తెలుసు. అందుకే ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించాలని మీరు ఆశిస్తున్నారు. అవకాశాలు కూడా ప్రకాశవంతంగా ఉన్నాయి. కలలను సాకారం చేసుకోవడానికి స్పాన్సర్‌‌ను కూడా కనుగొనే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్ట్ ఆకర్షణీయంగా అనిపించవచ్చు.

లక్కీ సైన్- బోరు బావి

* మిథునం
సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం మీ కల. అందుకు చాలా కష్టపడుతున్నారు. వ్యాపారానికి సంబంధించి భవిష్యత్తు ప్రణాళికలను సమీక్షించాల్సిన అవసరం ఉంది. మీ పరిశీలనకు వచ్చిన విషయాలను మీరు పూర్తిగా తిరస్కరించకుండా ఉండవచ్చు.

లక్కీ సైన్ - స్పోర్ట్స్ మోడల్

* కర్కాటకం
మీ ఆలోచన విధానం గురించి ఇప్పుడు మీకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఆలోచనలు రాబోయే రోజుల్లో మీకు దారి చూపిస్తాయి. కార్పొరేట్ ప్రపంచంలో మీకు సంబంధించిన కొందరు బలమైన ముద్ర వేయవచ్చు. వారి కోసం ప్రయత్నించే లేదా వేచి ఉండే వ్యక్తులకు ఈ విషయాలు తెలుస్తాయి. మీరు కూడా త్వరలో గుర్తింపు పొందుతారు. మరిచిపోలేని యాత్ర త్వరలో జరగనుంది.

లక్కీ సైన్ - సిరామిక్ వాజ్

* సింహం
పబ్లిక్‌గా ప్రైవేట్ సంభాషణలు చేయడం మానుకోండి. మీకు తెలియకుండానే ఏదో ఒక విషయంలో మీరు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఇవాళ మిశ్రమ భావాలు, భావోద్వేగాలతో కూడిన రోజు. మీపట్ల ఆకర్షితులైన ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. మీరు మానసికంగా కూడా బలహీనంగా ఉండవచ్చు. తొందరపాటు లేదా త్వరిత నిర్ణయాలు తీసుకోకుండా ప్రయత్నించండి.

లక్కీ సైన్- ఎరుపు రంగు

* కన్య
ఆసక్తికరమైనది ఏదో ఒకటి మీ దరికి రావచ్చు. అయితే అది మీరు ఊహించి ఉండరు. దాన్ని సీరియస్‌గా తీసుకుంటే, ఆసక్తికరమైన ప్రతిపాదన కావచ్చు. అందరి సలహాలు స్వాగతించండి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి రాబోయే రెండు రోజులు సవాలుగా ఉండవచ్చు.

లక్కీ సైన్- స్మార్ట్ వాచ్

* తుల
పోటీతత్వంతో ఉండడం మంచిదే. అయితే అందుకు రచించిన ప్రణాళిక ఆసక్తిగా ఉండకపోవచ్చు. కాబట్టి, మీ వ్యవహారాల్లో స్పష్టంగా, పారదర్శకంగా ఉండాలి. మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా ఇబ్బందుల్లో ఉండవచ్చు. సలహా కోసం మీ వద్దకు వచ్చే అవకాశం ఉంది.

లక్కీ సైన్- నమూనా కుషన్

* వృశ్చికం
మీ వైఖరే మీకు చోటు కల్పిస్తుంది. లాభాలను అందించడానికి మీ నెట్‌వర్క్ బాధ్యత వహిస్తుంది. కానీ అదే సమయంలో వ్యక్తులతో సమస్యలు ఏర్పడవచ్చు. సీనియర్లు లేదా అధికారంలో ఉన్నవారు కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. జీవిత భాగస్వామి మీకు అతిపెద్ద విమర్శకులు. మీకు మద్దతుగా ఉంటారు.

లక్కీ సైన్ - ఎంబ్రాయిడరీ వర్క్

* ధనుస్సు
నిర్దిష్ట పనిని మీరు పూర్తి చేయలేరని ప్రజలు భావించవచ్చు. కానీ ఏదైనా నిర్వహించలేని అసమర్థత మీకు లేదు. దీంతో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందండి. ముందు ఉన్నదాని కోసం సిద్ధంగా ఉండండి. మీరు కూడా ప్రకాశిస్తారు. దేన్నీ పూర్తిగా అర్థం చేసుకోకుండా తిరస్కరించవద్దు.

లక్కీ సైన్ - నెమలి

* మకరం
గత చేదు అనుభవం పునరావృతం కావచ్చు. అయితే అది ముందులాగా ఉండదు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కొత్త సందర్భాలు మెరుగైన అనుభవానికి మార్గం చూపుతాయి. ఎలైట్ గ్రూప్‌లో ఎక్కడైనా మీ ఆఫీస్ తరుపున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని మీరు త్వరలో పొందుతారు.

లక్కీ సైన్ - ప్రముఖుడు

* కుంభం
సంక్షోభం వచ్చినప్పుడు ఒంటరి అనే భావన మీకు అనిపించవచ్చు. అది వాస్తవం అయినా కాలం చాలా డైనమిక్. అందరికీ మారుతూ ఉంటుంది. మీ వైఖరిలో మార్పు లేకుండా గత తప్పిదాలను పరిశీలించాలి. మీరు కోల్పోయినట్లుగా భావించే శక్తిని మీ స్నేహితులు తిరిగి ఇవ్వబోతున్నారు.

లక్కీ సైన్- ఫ్యాన్సీ కారు

* మీనం
వివాహం అయ్యే చాన్స్ ఉంటే, అవకాశాలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి, మీకు ఏమి కావాలో కోరుకుంటాడు. కొన్నిసార్లు ప్రతికూల మనస్తత్వం మిమ్మల్ని జీవితంలో కొన్ని అడుగులు వెనక్కి వేసేలా చేస్తుంది.

లక్కీ సైన్- చెట్టు
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Horoscope, Rasi phalalu

తదుపరి వార్తలు