Horoscope Today: 2022 సెప్టెంబర్ 2, శుక్రవారం నాడు కొన్ని రాశుల వారికి చాలా సానుకూలంగా గడిచిపోతుంది. మరికొందరు కాస్త ఒత్తిడికి గురి కావచ్చు. ఇంకొందరిని కొత్త అవకాశాలు వరించవచ్చు. అన్ని రాశుల వారికి ఈ రోజు ఎలా గడిచిపోతుందో తెలుసుకుందాం.
* మేష రాశి
మీ నియంత్రణలో లేని విషయాల గురించి అనవసరమైన ఒత్తిడికి గురవుతుండొచ్చు. ఏదైనా పరిస్థితిలో చాలా వివాదం ఉంటే.. దాన్ని విడిచిపెట్టడమే మంచిది. ఎట్టకేలకు మీ జీవితం సాధారణ స్థితికి వస్తుంది.
లక్కీ సైన్- ఎమరాల్డ్ గ్రీన్
* వృషభ రాశి
జరగబోయే వాటి గురించి ఎక్కువగా నిరుత్సాహపడే అవకాశం ఉంది. నేడు మీకు ఈ జీవనశైలి ఉందంటే.. దాన్ని సంపాదించడం మీ కష్టం చాలానే ఉంది. కానీ ఏదో మిమ్మల్ని అడ్డుకున్నట్లు అనిపించవచ్చు. నటనా రంగంలో ఉన్నవారు మంచి గుర్తింపు దక్కించుకోవచ్చు.
లక్కీ సైన్ - సూర్యోదయం
* మిథున రాశి
పాజిటివ్ సంకేతాలు ఎప్పటినుంచో మీకు అందుబాటులో ఉంటాయి కానీ వాటిని మీరు స్వీకరించడం అవసరం. ఆఫీస్‌లో మీ వెనుక చాలానే జరుగుతున్నాయి. వాటిని మీరు కనుగొనవచ్చు. ఈ రోజులో ఇంటి సంబంధిత విషయాలు ప్రశాంతంగా అనిపిస్తాయి.
లక్కీ సైన్ - చేప వల
* కర్కాటక రాశి
మీ ఆర్థిక సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. మీకు సంబంధిత ఒక అంశంలో వచ్చిన అభివృద్ధి గురించి తెలిసి మీరు ఆశ్చర్యపోవచ్చు. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు.
లక్కీ సైన్ - అంబర్ స్టోన్
* సింహ రాశి
ఊహించని ఒక ప్రదేశం నుంచి కొత్త అవకాశం రావచ్చు. ఇది మీ రొటీన్ లైఫ్‌లో అవసరమైన ఉత్సాహాన్ని తీసుకురావచ్చు. నేడు మీరు ఆధ్యాత్మిక అభ్యాసాలను స్వీకరించాలని భావించవచ్చు.
లక్కీ సైన్ - వయొలెట్స్
* కన్యా రాశి
మీరు ఆశించిన ఫలితం చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల భవిష్యత్ మార్గానికి అవసరమైన స్పష్టత మీకు లభించవచ్చు. ఒక కొత్త పాజిటివ్ డెవలప్మెంట్ ఈరోజును హ్యాపీగా మారవచ్చు.
లక్కీ సైన్ - రూబీ రెడ్
* తులా రాశి
రొటీన్ వర్క్స్ మీ లైఫ్ నుంచి త్వరలోనే తొలగిపోవచ్చు. మిమ్మల్ని విశ్వసించే వ్యక్తికి ఇప్పుడు రెండవ ఆలోచనలు ఉండవచ్చు. గత పెట్టుబడి సానుకూల మార్గంలో ఊహించని ఫలితాలను ఇవ్వవచ్చు.
లక్కీ సైన్ - ఒక సిల్క్ స్టోల్
* వృశ్చిక రాశి
రాజకీయ, కళ, సినిమా రంగాల వారికి సాధికారత చేకూరే రోజుగా కనిపిస్తోంది. ఒక పద్ధతిగల ఆలోచనా ప్రక్రియ ఇప్పుడు ఒక పని అమలుకు అవకాశం కూడా తీసుకురావచ్చు. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి తీవ్ర ప్రభావాన్ని సృష్టించవచ్చు.
లక్కీ సైన్ - తెల్ల గులాబీ
* ధనుస్సు రాశి
పని ప్రదేశంలో మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పనిని పూర్తి చేయడానికి తగినంత సమయం లేకపోవడం వల్ల మీరు చిరాకుగా అనిపించవచ్చు. మీరు ఎంచుకున్న పనిలో మీ గ్రౌండింగ్‌ను కనుగొనవచ్చు. డబ్బు రాక కూడా ఆశించవచ్చు.
లక్కీ సైన్ - స్కై బ్లూ
* మకర రాశి
తాము మిస్ఫిట్ అని మకరరాశి వారు ఈరోజు అనుకునే అవకాశముంది. అయితే ఏ విషయంలోనైనా ఫిట్ అవ్వాలంటే అడ్జస్ట్ కావాలి. అందుకు కొంత సమయం ఇవ్వాలి. మీ మనస్సులో అనేక ఆలోచనలు మార్చాల్సి రావచ్చు. కానీ ఇది ఇప్పుడే చేయనక్కర్లేదు. రెట్టింపు ఉత్సాహంతో రావాలంటే ఒక చిన్న ట్రిప్ అవసరం కావచ్చు.
లక్కీ సైన్ - నియాన్ గ్రీన్
* కుంభ రాశి
మీ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. దీనివల్ల మీ రాబోయే సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. మీరు ఒకే సమయంలో అనేక ఆలోచనలను చేయవచ్చు. కానీ ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోవచ్చు.
లక్కీ సైన్ - గోల్డ్ ఫిష్
* మీన రాశి
మీ స్పృహ (Conscious mind) మీకు అనేక విషయాలు చెబుతూ ఉండవచ్చు. కానీ మీ సహజ గుణాలు ఇంకేదైనా సలహా ఇవ్వవచ్చు. మీ దగ్గరి బంధువుకు కొన్ని సలహాలు లేదా సహాయం అవసరం కావచ్చు. ఒక కొత్త వెల్నెస్ రొటీన్లోకి అడుగుపెట్టే మంచి సమయమిది.
లక్కీ సైన్ - కోబాల్ట్ బ్లూ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Rasi phalalu