Home /News /astrology /

ASTROLOGY RASHI PHALALU HOROSCOPE TODAY 6TH AUGUST 2022 ASTROLOGY PREDICTIONS FOR ALL ZODIAC SIGNS PH PJC TA

Horoscope: రాశి ఫలాలు.. జీవనం కఠినంగా గడుస్తుంది.. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి..

Zodiac Signs (ప్రతీకాత్మక చిత్రం)

Zodiac Signs (ప్రతీకాత్మక చిత్రం)

Horoscope: గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల భవిష్యత్తును జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆస్ట్రాలజీ ప్రకారం ఆగస్టు 6, శనివారం నాడు కొందరు ఇంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి. మరికొందరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేయాలి. నేడు ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం..

ఇంకా చదవండి ...
Horoscope:  గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల భవిష్యత్తును జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆస్ట్రాలజీ ప్రకారం ఆగస్టు 6, శనివారం నాడు కొందరు ఇంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి. మరికొందరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేయాలి. నేడు ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం.

* మేషం
ఈ రోజు మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవడానికి, ఏదైనా కొత్త ప్రయోగం చేయడానికి మంచి రోజు. తక్షణమే మీరు దృష్టి పెట్టాల్సిన అంశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం.

లక్కీ సైన్‌- సాలిటైర్

* వృషభం
ఈ రోజు మీ గతం నుంచి ఒక క్షణాన్ని తిరిగి పొందే అవకాశాన్ని పొందవచ్చు. మీ ఆఫీస్‌లో ఇంకా కొన్ని మైలురాళ్లను సాధించాల్సి ఉంది. వివాహ బంధాన్ని ఖరారు చేసుకోవడం వల్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

లక్కీ సైన్‌- ఈక

* మిథునం
ఏదైనా పని ఎక్కువ సమయం తీసుకుంటే అది జరగదని కాదు. మీరు ప్రయత్నించి ఓపికపట్టండి లేదా మీ శక్తిని మరెక్కడైనా మార్చుకోండి. ఆఫీస్‌లో విమర్శలు రావచ్చు.

లక్కీ సైన్‌- ఒక చెక్క పెట్టె

* కర్కాటకం
మీ బాధ్యతలు కఠినమైన టైమ్‌ మేనేజ్‌మెంట్‌ను మీకు గుర్తు చేయవచ్చు. మీ పనిని వేగవంతం చేయాల్సి రావచ్చు. ఒక కొత్త అవకాశం పని చేయడానికి కొత్త ఉత్సాహాన్ని సృష్టించవచ్చు. విశ్రాంతి ముఖ్యం.

లక్కీ సైన్‌- వైట్ స్లాబ్

* సింహం
మీరు ఆపేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతిదాన్ని వదిలివేయడానికి ఇది మంచి సమయం. మీ కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తే, మనశ్శాంతి కోల్పోవచ్చు. స్నేహపూర్వక సంకేతం (friendly gesture) రోజును మెరుగ్గా ఉంచడంలో మీకు సహాయపడవచ్చు.

లక్కీ సైన్ - ఒక జాడే మొక్క

* కన్య
మీరు మీ కోసం సంపాదించిన దానితో వేడుకలు చేసుకునే రోజులు ఉన్నాయి. మీ ప్రణాళికలు ఇప్పుడు అమలు అవుతున్నాయి. మీరు తీసుకోగలిగిన నిర్ణయాల గురించి ఆలోచించడానికి, ప్రతిబింబించడానికి కొంత సమయం కేటాయించండి.

లక్కీ సైన్‌- ఒక స్టిక్కర్

* తుల
ఏదైనా మీ దృష్టి మరల్చినట్లయితే, మీరు దానిని అలా చేయనివ్వడమే అందుకు కారణం. మీ సహోద్యోగి కొత్త ఆదాయ వనరులను సృష్టించే ఆలోచనను సూచించవచ్చు. మీరు ట్రిప్ కోసం ప్లాన్ చేస్తుంటే, వెంటనే చేయండి.

లక్కీ సైన్‌- సూర్యరశ్మి

* వృశ్చికం
మీరు ఈరోజు అదృష్టవంతులు కావచ్చు. రోజులో మీ కోసం కేటాయించుకున్న అన్ని పనులు నెరవేరవచ్చు. స్టాక్ ఫైనాన్స్ కూడా మీకు అనుకూలంగా మంచి కదలికను చూపవచ్చు.

లక్కీ సైన్‌- పసుపు కొవ్వొత్తులు

* ధనుస్సు
మీరు ఒక ఆలోచన నుంచి పారిపోతుంటే, అది చాలా త్వరగా తిరిగి వచ్చి మిమ్మల్ని కాటు వేయవచ్చు. చాలా ముఖ్యమైన పని చేయడానికి మీకు ధైర్యం లేకపోవచ్చు. ఇది చాలా బిజీగా ఉండే రోజు, మీరు త్వరగా ముగించలేకపోవచ్చు.

లక్కీ సైన్- ఒక సిలికాన్ అచ్చు

* మకరం
ఆశ్చర్యం వివిధ ప్యాకేజీలలో రావచ్చు. వాటిలో కొన్ని మీకు నచ్చకపోవచ్చు. మీ వైఖరి కారణంగా ఎవరి మనసైనా గాయపడవచ్చు కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాల్సి రావచ్చు. ఒక చిన్న దొంగతనం కేసు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.

లక్కీ సైన్‌- క్రిస్టల్ టంబ్లర్

* కుంభం
పరీక్ష ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు. కొంచెం యుక్తి, డిప్లమసీ మీ పనిని పూర్తి చేయడంలో మీకు సహాయపడవచ్చు. ఇది అలసిపోయే రోజు కావచ్చు, కానీ మంచి గమనికతో ముగుస్తుంది. ర్యాష్ డ్రైవింగ్ మానుకోండి.

లక్కీ సైన్‌- గొడుగు

* మీనం
మీ చుట్టూ ఉన్న వారి నుంచి ప్రేరణ పొందినట్లు అనిపించవచ్చు. ఈరోజు ఇంట్రావర్ట్‌గా ఉండడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. పనిలో ఉన్న ఎవరైనా మిమ్మల్ని సాధారణంగా నిందించవచ్చు. ఇది మీకు కొంచెం కఠినమైన రోజుగా ఉండవచ్చు.

లక్కీ సైన్‌- నీలి ఆకాశం
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు