Home /News /astrology /

ASTROLOGY HOROSCOPE TODAY CONVERSATION WITH LOVED ONES NEED TO BE CAREFUL ABOUT MONEY GOOD BENEFITS FOR THESE ZODIAC SIGNS GH PJC TA

Rasi Phalalu : ప్రియమైన వారితో సంభాషణ.. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope : ఓ రాశివారికి సంబంధించి బయట అనవసరమైన అసంప్షన్స్‌ క్రియేట్‌ అవుతున్నాయి. కొందరికి సింప్లిసిటీ రివార్డులను అందిస్తుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఆగస్టు 8వ తేదీ సోమవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో త?

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
Today Horoscope (నేటి దిన ఫలం) : ఓ రాశివారికి సంబంధించి బయట అనవసరమైన అసంప్షన్స్‌ క్రియేట్‌ అవుతున్నాయి. కొందరికి సింప్లిసిటీ రివార్డులను అందిస్తుంది. ఇంకొందరు డొనేషన్లు ఇవ్వడం, దానాలు చేయడాన్ని సంతృప్తిగా భావిస్తారు. మరో రాశివారికి ప్రియమైన వారితో సంభాషన్‌ రోజులో హైలెట్‌గా నిలుస్తుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఆగస్టు 8వ తేదీ సోమవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

* మేషం
నిజమైన టీం వర్క్‌ ఒక క్లిష్టమైన అవసరం కావచ్చు. మీరు రిలేషన్‌లో ఉన్నా, వివాహం చేసుకొని ఉన్నా.. మీ గురించి బయట అనవసరమైన అసంప్షన్స్‌ ఉండవచ్చు. మిమ్మల్ని మీరు ప్యాంపర్‌ చేసుకోవడానికి అనుకూలమైన రోజు.
లక్కీ సైన్- సూట్‌కేసులు

* వృషభం
మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మీ నక్షత్రాలు మీకు అసాధారణమైన అవకాశాన్ని ఇవ్వవచ్చు. మీ ప్రయోజనం కోసం దాన్ని ఉపయోగించుకోండి. సింప్లిసిటీ మీకు చాలా బహుమతులు సంపాదించవచ్చు. మీ డబ్బు విషయాలను స్పష్టంగా ఉంచుకోవడానికి ఇది సమయం.
లక్కీ సైన్- ఫ్లవర్‌ షాప్‌

* మిథునం
ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయడం ఈరోజు సవాలుగా ఉండవచ్చు. రోజులోని శక్తిని సమతుల్యం చేయడానికి, కొన్ని జర్నలింగ్ లేదా ఉదయాన్నే ధ్యానం చేయండి. ఇప్పటికే సమస్యల్లో ఉన్న వారిని ఆటపట్టించకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
లక్కీ సైన్- సూర్యాస్తమయం

* కర్కాటకం
మీరు క్రమంగా ప్రజలను విశ్వసించడం ప్రారంభించాలి. ఇది మీ దైనందిన జీవితాన్ని పురోగమింపజేస్తుంది. గతంలో జరిగిన ఒక సంఘటన మళ్లీ తెరపైకి రావచ్చు. డొనేషన్‌ ఇవ్వడం సంతృప్తికరంగా అనిపిస్తుంది.
లక్కీ సైన్- కొత్త కుర్చీ

* సింహం
ఒక మిస్టరీ త్వరలో బయటపడుతుంది, మీరు వాస్తవికతను చూడగలరు. మీ పనిపై నిబద్ధతతో ఉండడం వల్ల మీరు కోరుకున్న స్థానాలను పొందగలరు. ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. విషయాలను వాయిదా వేయకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
లక్కీ సైన్- రబ్బర్‌ ప్లాంట్‌

* కన్య
పాత పరిచయస్తునికి ఆర్థిక సహాయం అవసరం కావచ్చు. మీ పొదుపులకు మరింత ప్రోత్సాహం అవసరం కావచ్చు. ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా దంతాల సమస్యలను వాయిదా వేయడం మంచిది కాదు.
లక్కీ సైన్- సిల్వర్‌ స్పూన్‌

* తుల
మీ మనసు చేసే సూచనలు.. ఈ రోజును నిర్వహించే దిశగా మిమ్మల్ని నడిపిస్తాయి. ఒక ముఖ్యమైన సమావేశం భవిష్యత్తుకు స్పష్టమైన సంకేతం ఇస్తుంది. మీకు విరాళం లేదా దానం చేయాలనే కోరిక కలిగే అవకాశం ఉంది.
లక్కీ సైన్- బ్లూ స్పోర్ట్స్‌ బ్యాగ్‌

* వృశ్ఛికం
ఉదయాన్నే తెలియని భారాన్ని మోస్తున్నట్లు ఫీల్‌ అవుతారు. రోజులో విషయాలు అదుపులో ఉన్నట్లు కనిపిస్తోంది. అపార్థాలను నివారించడానికి సక్రమంగా కమ్యునికేట్‌ చేయడానికి ప్రయత్నించండి. తోబుట్టువుల సపోర్ట్‌ అవసరం కావచ్చు.
లక్కీ సైన్- స్టెయిన్డ్ గ్లాస్‌

* ధనస్సు
మీరు కోరుకున్న విధంగా రోజును ప్రారంభించడానికి అనుకూల సమయం. మీరు ఏదైనా కొత్త బాధ్యతను స్వీకరించే అవకాశం ఉంది. చిన్న దొంగతనం జరిగే ప్రమాదం ఉన్నందున మీ వస్తువులను సురక్షితంగా, భద్రంగా ఉంచుకోండి.
లక్కీ సైన్- న్యూ డైరీ

* మకరం
మీలో కొందరిని మీ సన్నిహిత స్నేహితులు కాపాడుతున్నారు. ఆ అవసరం లేదనిపిస్తోంది. మీరు ఇంట్లోనే ఎక్కువ సమయాన్ని గడిపే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదైనా డాక్యుమెంట్‌లకు సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేయాలి.
లక్కీ సైన్- రెడ్‌ బ్రిక్‌ వాల్‌

* కుంభం
ప్రియమైన వారితో మంచి సంభాషణ ఈ రోజు మీ హైలైట్ కావచ్చు. మీకు తెలిసిన వారిలో మ్యానుపులేట్‌ చేసే వ్యక్తులతో దూరం పాటించండి. ఈ రోజు షేరింగ్‌, బాండింగ్‌కి అనుకూలం. మీరు కొందరితో మళ్లీ కనెక్ట్ కావచ్చు.
లక్కీ సైన్- బ్రైట్‌ ఇంటీరియర్‌

* మీనం
కొత్త రొటీన్‌తో మీరు అంత సంతోషంగా కనిపించకపోవచ్చు. కానీ అది మీకు మంచిది. ఈరోజు ఏదైనా తాజా పెట్టుబడి పెట్టడం ద్వారా అనవసరమైన రిస్క్ తీసుకోకండి. ఆశ్చర్యకరమైన సందర్శన లేదా పాత స్నేహితుడి కాల్ ఉండవచ్చు.
లక్కీ సైన్- గోల్డెన్‌ స్టార్‌
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Horoscope

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు