హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu: ఈ రాశుల వారు డబ్బు విషయంలో క్లారిటీగా ఉండాలి.. పనులు సకాలంలో పూర్తి చేయడం సవాలుగా మారవచ్చు..

Rasi Phalalu: ఈ రాశుల వారు డబ్బు విషయంలో క్లారిటీగా ఉండాలి.. పనులు సకాలంలో పూర్తి చేయడం సవాలుగా మారవచ్చు..

రాశి ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

రాశి ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

Rasi Phalalu (రాశి ఫలాలు):  జ్యోతిష్యం ప్రకారం రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 29, సోమవారం నాడు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Rasi Phalalu (రాశి ఫలాలు):  జ్యోతిష్యం ప్రకారం రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 29, సోమవారం నాడు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం.

* మేషం

మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మీ నక్షత్రాలు అసాధారణమైన అవకాశాన్ని ఇస్తాయి. ప్రయోజనం పొందటానికి వాటిని ఉపయోగించుకోండి. సింప్లిసిటీగా ఉంటే మీరు ఎన్నో రివార్డ్‌లు పొందవచ్చు. డబ్బు విషయాల్లో స్పష్టంగా ఉండటానికి ఇది సరైన సమయం.

లక్కీ సైన్- జత సూట్‌కేసులు

* వృషభం

టీమ్‌వర్క్ ఎంతో విలువైనదని రుజువు అవుతుంది. రిలేషన్ లేదా వివాహంలో ఉంటే, మీ గురించి అనవసరమైన ఊహలు ఉండవచ్చు. కుటుంబం ఈ రోజు మిమ్మల్ని ప్యాంపర్ చేయవచ్చు.

లక్కీ సైన్- పూల దుకాణం

* మిథునం

క్రమక్రమంగా ప్రజలను విశ్వసించడం ప్రారంభించాలి. ఇది మీ రోజువారీ జీవితాన్ని పురోగతిలోకి తీసుకొస్తుంది. గతంలో జరిగిన సంఘటన మళ్లీ తెరపైకి రావచ్చు. విరాళం ఇవ్వడం మీకు సంతృప్తికరంగా అనిపిస్తుంది.

లక్కీ సైన్ - సూర్యాస్తమయం

* కర్కాటకం

ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయడం ఈ రోజు సవాలుగా ఉండవచ్చు. మీ శక్తిని బ్యాలెన్స్ చేయడానికి ఉదయాన్నే ధ్యానం చేయండి. ఇప్పటికే సమస్యల్లో ఉన్న వారిని ఆటపట్టించకండి.

లక్కీ సైన్ - కొత్త కుర్చీ

* సింహం

పాత పరిచయస్తునికి ఆర్థిక సహాయం అవసరం కావచ్చు. అయితే మీ పొదుపులకు మరింత ప్రోత్సాహం కూడా అవసరం కావచ్చు. ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా డెంటల్ సమస్యలపై చికిత్సను వాయిదా వేయకండి.

లక్కీ సైన్- రబ్బరు మొక్క

* కన్య

ఒక నమ్మకం, అభిప్రాయం సరైనది కాదనే వాస్తవాన్ని త్వరలో తెలుసుకుంటారు. నిబద్ధతతో పనిచేస్తే ఉన్నత స్థానాలకు వెళ్లవచ్చు. ఈ రోజు చాలా బిజీగా ఉండవచ్చు. పనులను వాయిదా వేయకండి.

లక్కీ సైన్ - వెండి స్పూన్

* తుల

ఉదయం పూట ఏదో తెలియని భారాన్ని మోస్తున్నట్లు అనిపించవచ్చు. మిగతా సమయంలో విషయాలు అదుపులో ఉన్నట్లు అనిపిస్తుంది. అపార్థాలను నివారించడానికి కమ్యూనికేషన్ విషయంలో స్పష్టంగా ఉండటానికి ప్రయత్నించండి. తోబుట్టువుల మద్దతు అవసరం కావచ్చు.

లక్కీ సైన్ - నీలిరంగు స్పోర్ట్స్ బ్యాగ్

* వృశ్చికం

మీ అంతర్గత శక్తి రోజును మేనేజ్ చేసే దిశగా నడిపిస్తాయి. ఒక ముఖ్యమైన సమావేశం భవిష్యత్తుకు స్పష్టమైన సంకేతం ఇస్తుంది. విరాళం లేదా చారిటీ పని చేయాలనే కోరిక మీకు కలగవచ్చు.

లక్కీ సైన్ - స్టెయిండ్ కలర్ గ్లాస్

* ధనుస్సు

మీలో కొందరు సన్నిహిత స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే ఆ అవసరం లేదనిపిస్తోంది. గృహప్రవేశం రోజును ఎక్కువగా ఆస్వాదించవచ్చు. పేపర్ వర్క్ చేయడానికి ఇవాళ అనువైనది.

లక్కీ సైన్ - కొత్త డైరీ

* మకరం

ఈరోజు మీరు కోరుకున్న విధంగా, అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కొత్త బాధ్యతను కూడా స్వీకరించే అవకాశం ఉంది. చిన్న దొంగతనం జరిగే ప్రమాదం ఉన్నందున, వస్తువులను భద్రంగా ఉంచండి.

లక్కీ సైన్- ఎర్ర ఇటుక గోడ

* కుంభం

న్యూ రొటీన్‌ కారణంగా అంత సంతోషంగా ఉండకపోవచ్చు. కానీ అది మీకు మంచిది. ఈరోజు ఏదైనా తాజా పెట్టుబడి పెట్టడానికి అనవసరమైన రిస్క్ తీసుకోకండి. ఒక పాత స్నేహితుడు కాల్ చేయవచ్చు, సర్‌ప్రైజ్ ఇస్తూ మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది.

లక్కీ సైన్ - బ్రైట్ ఇంటీరియర్

* మీనం

ప్రియమైన వారితో మంచి కన్వర్జేషన్ హైలైట్ కావచ్చు. మ్యానిపులేట్ చేసేవారి పట్ల దూరం పాటించండి. ఓ బంధం కారణంగా ఈ రోజు మీకు ఎనర్జీ వస్తుంది. మీరు కొందరితో మళ్లీ కనెక్ట్ కావచ్చు.

లక్కీ సైన్ - బంగారు నక్షత్రం

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు