Home /News /astrology /

ASTROLOGY DAILY RASI PHALALU LUCKY DAY FOR THESE THREE SIGNS STRESS WILL GO AWAY AUGUST 10 GH PJC TA

Rasi Phalalu: ఈ మూడు రాశుల వారికీ లక్కీ డే.. ఒత్తిడి దూరం అవుతుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope (నేటి దిన ఫలం) : జ్యోతిష్యం ప్రకారం రాశిఫలాలకు అధిక ప్రాధ్యానత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 11 గురు వారం నాడు మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Today Horoscope (నేటి దిన ఫలం) :ఓ రాశివారికి ఒత్తిడి దూరమవుతుంది, ఇప్పుడు బ్యాలెన్స్‌డ్‌గా ఫీల్‌ అవుతారు. మరో రాశికి చెందిన వారు చర్చల సమయంలో ఓపికగా ఉండాలి. ఒకరు ఈ రోజు ఆహ్వానం మేరకు హాజరైన ఈవెంట్‌లో కొత్త వారిని కలిసే అవకాశం ఉంది. ఇంకొందరు ఏదైనా కొత్త దాన్ని ప్రారంభించేందుకు ఆందోళన చెందుతారు. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఆగస్టు 11వ తేదీ గురువారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.


* మేషం
వేడుకలకు సంబంధించి ఆకస్మికంగా ప్లాన్‌ చేసే అవకాశం ఉంది. కొత్త సెలబ్రేషన్‌, కొత్త పెట్టుబడులకు నక్షత్రాల కదలికలు అనుకూలిస్తున్నాయి. చర్చల సమయంలో ఓపికగా ఉండండి. క్లిష్టమైన విశ్లేషణను సమీక్షించడానికి మీ సమయాన్ని వెచ్చించండి.

లక్కీ సైన్- మ్యానకిన్‌

* వృషభం
మీరు గతంలో చాలా మానసిక ఒత్తిడికి గురై ఉంటే, ఇప్పుడు బ్యాలన్స్‌డ్‌గా ఫీల్‌ అయ్యే సూచనలు ఉన్నాయి. గతంలోని కొన్ని సంప్రదాయాలు అడ్డంకిగా మారవచ్చు. మనసు స్పష్టత కోసం లాంగ్‌ వాక్‌ ఉపయోగపడుతుంది.

లక్కీ సైన్- రోల్‌ మోడల్‌

* మిథునం
ప్రణాళికలో మార్పు మీ రోజుని పూర్తిగా మార్చవచ్చు. మీకు ఓ ఈవెంట్‌కు ఆహ్వానం లభించే అవకాశం ఉంది. అక్కడ మీరు కొత్త వారిని పరిచయం చేసుకోవచ్చు. ఈ పరిచయం రిసోర్స్‌ఫుల్‌గా కూడా మారవచ్చు. బయట తినడం మానుకోండి.

లక్కీ సైన్- సిల్వర్‌ స్ట్రింగ్‌

* కర్కాటకం
కొత్తదాన్ని ప్రారంభించే ముందు మీరు కొంచెం భయాందోళన చెందుతారు. కానీ అందుకు అవసరమైన శక్తులు మీతో ఉన్నాయి. ఒక నిర్దిష్ట నిర్ణయాన్ని అమలు చేయడం గురించి మీ మనసులో గందరగోళం ఉండవచ్చు. స్పష్టత పొందడానికి మీకు మరింత సమయం పట్టవచ్చు.

లక్కీ సైన్- రోజా మొక్క

* సింహం
ఇది మీ సొంత నిబంధనల ప్రకారం షైన్‌ అవ్వడానికి, పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీరు ఇతరులతో నైతికంగా పోటీ పడటం మీరు చూడవచ్చు, ప్రశంసలు కూడా పొందుతారు. ఈరోజు మీరు చేస్తున్న పనులకు మీరు త్వరలో రివార్డ్‌లను అందుకొనే అవకాశం ఉంది.

లక్కీ సైన్- సూర్యోదయం

* కన్య
రోజు నిదానంగా ప్రారంభం కావచ్చు కానీ ద్వితీయార్థంలో వేగం పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు సాధారణ ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. దాన్ని పరిష్కరించడానికి మీకు కొంత మెంటల్‌ స్పేస్‌, టైమ్‌ ఇవ్వండి. ఆహ్లాదకరమైన సాయంత్రం అనుభవించబోతున్నారు.

లక్కీ సైన్- టాల్‌ బిల్డింగ్‌

* తుల
చాలా సంవత్సరాల అనుభవం మీకు ఏదైనా పరిస్థితిని బాగా ప్రాసెస్ చేయగల, విశ్లేషించే సామర్థ్యాన్ని అందిస్తుంది. మీ నుంచి మంచి ఏదో ఆశిస్తున్నారు, దాన్ని మీరు రిఫ్లెక్ట్‌ చేయాలి. మీకు సన్నిహితంగా ఉండే వారిలో ఎవరైనా బాధలో ఉండే అవకాశం ఉంది.

లక్కీ సైన్- వ్యాలెట్

* వృశ్ఛికం
మీరు కమిట్‌మెంట్‌ ఇచ్చిన వారి కోసం అందుబాటులో ఉండటమే మీ ప్రాథమిక పని. కానీ అది లేకపోవడం మీ ఇద్దరి మధ్య చిరాకు కలిగించవచ్చు. మీరు ఆస్తి లావాదేవీలో ఉంటే, మీరు మంచి సమయాల కోసం వేచి ఉండవచ్చు.

లక్కీ సైన్- ఎమరాల్డ్

* ధనస్సు
ఈ రోజు మల్టిపుల్‌ అవకాశాలతో డైనమిక్‌గా ఉంటుంది. ఆ అవకాశాలు ప్రస్తుతానికి చిన్నవిగా ఉండవచ్చు, కానీ ఆసక్తికరంగా ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న నిర్ణయాలపై మీరు ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. మెసేజ్‌లు, కాల్‌లకు రిప్లై ఇవ్వడం మంచిది.

లక్కీ సైన్- గోల్డెన్‌ ఎంబ్రాయిడరీ

* మకరం
ప్రత్యేక దృష్టితో ఒక సాధారణ రోజును గడపడానికి శక్తి బాగా అనుకూలిస్తుంది. ఫార్వర్డ్ ప్లానింగ్‌తో మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. స్నేహితురాలు అనుకోకుండా ల్యాండ్ అవ్వవచ్చు, మిమ్మల్ని ఉత్సాహపరచవచ్చు. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

లక్కీ సైన్- హనీ బీ

* కుంభం
మీరు చాలా డ్రీమీగా ఫీల్‌ అవుతున్నారు, ఒకరిని చాలా ఎక్కువగా మిస్‌ అవుతున్నారు. కానీ మీరు తప్పనిసరిగా రియాలిటీలోకి రావాలి. మీ జీవితానికి కొత్త దిశను అందించే ఆసక్తికరమైన అవకాశం రావచ్చు.

లక్కీ సైన్- జ్యూట్‌ బ్యాగ్‌

* మీనం
మీరు మీ భావాలను ప్రకటిస్తే, మీరు గాయపడతారేమో అనే భయం మీకు ఉంటుంది, కానీ మీరు చేయకపోతే, అది మీకు ఆందోళన కలిగిస్తుంది. కావాలంటే మీరు దాన్ని రాసి పంపవచ్చు. మీ రహస్యాలు తెలిసిన అత్యంత సన్నిహిత మిత్రుడు ఆధారపడటానికి సరైన వ్యక్తి.

లక్కీ సైన్- సరస్సు
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Horoscope, Rasi phalalu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు