Home /News /astrology /

ASTROLOGY DAILY HOROSCOPE RASI PHALALU OLD DUES WILL BE COLLECTED THESE ZODIAC WILL GET GOOD MONEY BENEFITS AUGUST 13 GH PJC TA

Rasi Phalalu: పాత బాకీలు వసూలు అవుతాయి.. ఈ రాశుల వారికీ ఆర్ధికంగా కలిసి వస్తుంది..

రాశీ ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

రాశీ ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

Today Horoscope (నేటి దిన ఫలం) : జ్యోతిష్యం రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 13, శనివారం నాడు వివిధ రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Today Horoscope (నేటి దిన ఫలం) :ఓ రాశివారు ఈ రోజు అనుకున్న దాని కంటే బిజీగా ఉంటారు. వారు ఈ రోజు ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. ఇంకో రాశివారు వాయిదా వేస్తున్న పనులు ఇప్పుడు కార్యరూపం దాలుస్తాయి. మరికొందరికి రాకుండా నిలిచిపోయిన డబ్బు అందుతుంది. కొందరికి ఈ రోజు తీరిక లేకుండా ఉన్నా.. అర్థవంతంగా ముగుస్తుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఆగస్టు 13వ తేదీ శనివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.


* మేషం
మీరు అనుకున్నదానికంటే ఎక్కువ బిజీగా రోజు ఉండవచ్చు. ఏదైనా క్లిష్టమైన పనికి ఎక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చు. ఈ రోజు మీ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఒత్తిడిగా ఉన్న సమయంలో ఎక్కువగా తినేయకుండా చూసుకోండి. అత్యంత ముఖ్యమైన పని అయితే తప్ప ముందుగా కమిట్‌మెంట్‌ ఇవ్వొద్దు.

లక్కీ సైన్- మల్లె పువ్వు

* వృషభం
రిలాక్స్డ్, బద్ధకమైన ఉదయంతో మిమ్మల్ని మీరు ప్యాంపర్‌ చేసుకోండి. ఆ తర్వాత మధ్యాహ్నం బిజీగా గడపాల్సి వస్తుంది. సన్నిహిత మిత్రుడు కొన్ని సానుకూల వార్తలను తీసుకురావచ్చు. మీరు వాయిదా వేస్తున్నది ఇప్పుడు కార్యరూపం దాల్చవచ్చు అనే వాస్తవాన్ని గుర్తుంచుకోండి.

లక్కీ సైన్- లెమన్‌ ఫ్రాగ్నెన్స్‌

* మిథునం
ఇది ఆర్థిక ప్రయోజనాలను, లాభాలను అందించే రోజు. మీకు రాకుండా నిలిచిపోయిన డబ్బును కొత్త కమిట్‌మెంట్స్‌ తిరిగి వచ్చేలా చేయవచ్చు. మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారనే అంశాలను సమీక్షించాలి. త్వరలో విరామం తీసుకొనే అవకాశం ఉంది.

లక్కీ సైన్- రెండు ఉడుతలు

* కర్కాటకం
మీ మునుపటి ప్రణాళికలు సకాలంలో విజయవంతం కావచ్చు. ఏకపక్ష సంబంధం ఇప్పుడు దాని అర్ధాన్ని కోల్పోవడం ప్రారంభించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులకు, మీడియా పరిశ్రమలోని వ్యక్తులకు తీరిక లేని రోజు, కానీ అర్థవంతమైన రోజు.

లక్కీ సైన్- గద్ద

* సింహం
మీ ఇండివిడ్యువల్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూకి ఈరోజు ప్రాముఖ్యత రావచ్చు. ఇది మీకు పురోగతికి వేదికను అందించవచ్చు. మీ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి మంచి రోజు. మీ జీవిత భాగస్వామికి కొన్ని అత్యవసర పనిలో మీ సపోర్ట్‌ అవసరం కావచ్చు.

లక్కీ సైన్- నోటీస్‌ బోర్డ్‌

* కన్య
మీకు ఏది కావాలనేదానిపై స్పష్టత పొందండి.. ఫలితాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీ ఇటీవలి చర్యల గురించి ఇతరులు జడ్జ్‌ చేయవచ్చు. శక్తివంతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మిమ్మల్ని సంప్రదించవచ్చు. ర్యాండమ్‌ ట్రావెల్‌ ప్లాన్‌ ఇప్పుడు రావచ్చు.

లక్కీ సైన్- ఎల్లో సఫైర్

* తుల
ఇది దాదాపు ఖచ్చితమైన రోజు, మీరు దానిని పూర్తిగా భరించాలి. వ్యవస్థీకృతంగా ఉండండి ఇంకా అన్వేషించండి. నిశ్చయమైన మార్గం వైపు వెళ్లేందుకు శక్తులు మిమ్మల్ని నడిపిస్తున్నాయి. కుటుంబ విహారయాత్ర లేదా స్నేహితులతో భోజనం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

లక్కీ సైన్- న్యూ గాడ్జెట్‌

* వృశ్ఛికం
కొత్తగా అభివృద్ధి చెందిన హాబీ మిమ్మల్ని కొత్త ప్లేసెస్‌కు తీసుకెళ్లవచ్చు. మీరు ఇటీవల కలిసిన వారిని నమ్మవచ్చు. లోపల ఉన్న చాలా డ్రామా గందరగోళం, మానసిక అయోమయానికి దారితీయవచ్చు. క్రమబద్ధంగా ఉండటానికి కొత్త దినచర్యను అభివృద్ధి చేసుకోండి.

లక్కీ సైన్- స్ట్రింగ్‌ ఆఫ్‌ లైట్స్‌

* ధనస్సు
ప్రీ మెచ్యూర్‌ సంభాషణ ఖచ్చితంగా మంచిది కాదు. మీరు సహనం ప్రదర్శించాలి. మీ ఉద్దేశాలకు మంచి సపోర్ట్‌ ఉంది. కానీ మెరుగైన కమ్యూనికేషన్ అవసరం. పరిసరాల్లోని ఎవరైనా అడ్డంకిని సృష్టించవచ్చు.

లక్కీ సైన్- వెనీలా ఫ్రాగ్నెన్స్‌

* మకరం
మీ ఉద్దేశాలను సరిగ్గా సెట్ చేసుకునే రోజు. మీరు చర్య తీసుకోవడానికి చాలా రోజులుగా అంతర్గతంగా ఆలోచించారు.. ఇప్పుడు సమయం వచ్చింది. మీరు మీ భయాలను పక్కన పెట్టి, ఈ  కొత్త సవాలును స్వీకరించాలి. దీన్ని సింపుల్‌గా ఉంచండి, ముందుకు తీసుకెళ్లండి.

లక్కీ సైన్- ఇండోర్‌ ప్లాంట్‌

* కుంభం
శ్రేయస్సు మీ వైపు నెమ్మదిగా అడుగులు వేస్తుంది. కొత్త ఆలోచనలను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. ఇది కొంత సమయం వరకు మీ కంఫర్ట్ జోన్‌ను కలవరపెట్టవచ్చు, కానీ మీరు దీన్ని చేయడానికి ఒక వ్యవస్థీకృత మార్గాన్ని కనుగొంటారు.

లక్కీ సైన్- క్లియర్‌ స్కై

* మీనం
మీ భయాలు నిజమవుతున్నాయనే భావన మీకు ఉండవచ్చు. కానీ ఏదో ఒక విధంగా మీరు రోజును చక్కగా నిర్వహించి గలుగుతారు. వారు సహాయం, సపోర్ట్‌గా ఉంటారు. మీరు పనిలో కొన్ని పరిస్థితులను సమీక్షించవలసి ఉంటుంది. కొత్త అవకాశం రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.

లక్కీ సైన్- పూలు
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Horoscope, Rasi phalalu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు