Home /News /astrology /

ASTROLOGY DAILY HOROSCOPE RASI PHALALU NEW BUSINESSES WILL COME TOGETHER FOR THESE ZODIAC SIGNS THE INVESTMENT WILL GET MORE BENEFITS GH PJC TA

Rasi Phalalu : ఈ రాశుల వారికీ కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి..పెట్టిన పెట్టుబడికి పదింతలు వస్తుంది..

రాశీ ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

రాశీ ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

Today Horoscope (నేటి దిన ఫలం) : ఈ రాశుల్లో డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి రావచ్చు. కొందరికి ధన లాభాలు పెరగవచ్చు. జ్యోతిష్య శాస్త్ర (Astrology) నిపుణుల ప్రకారం, ఈ రోజు (Today Horoscope) రాశిచక్రం (Zodiac)లోని 12 రాశుల వారికి ఎలా గడుస్తుందో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Today Horoscope (నేటి దిన ఫలం) : నేడు 2022 ఆగస్టు 18న కొందరికి సంతోషంగా గడిచి పోవచ్చు. మరికొందరు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి రావచ్చు. కొందరికి ధన లాభాలు పెరగవచ్చు. జ్యోతిష్య శాస్త్ర (Astrology) నిపుణుల ప్రకారం, ఈ రోజు (Today Horoscope) రాశిచక్రం (Zodiac)లోని 12 రాశుల వారికి ఎలా గడుస్తుందో తెలుసుకుందాం.


* మేషరాశి
మీరు ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలని ప్రయత్నిస్తుంటే.. అలా చేయడానికి మంచి రోజిది. ఇది కొత్త వెంచర్, ప్రాజెక్ట్ లేదా అసైన్‌మెంట్ అయినా కావచ్చు. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటారు కానీ మీకు చాలా ఎక్కువ సామర్థ్యం ఉంటుంది.
లక్కీ సైన్ - మిర్రర్ ఇమేజ్

* వృషభరాశి
ఏ పరిస్థితులనైనా జీవితాంతం మీరు మీ నియమాలకు కట్టుబడి ఉండటం మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తున్న ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టాలి. నిర్ణయాలు తీసుకోవడానికి కొంత కాలం వాయిదా వేయవచ్చు.
లక్కీ సైన్ - వెండి కొవ్వొత్తి

* మిథునరాశి
మీరు ఎవరితోనైనా భాగస్వామి కావాలని సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటే.. ఇదే సరైన సమయం. పబ్లిక్‌గా మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని, ప్రతి ప్రణాళికను పంచుకోకుండా ఉండటం మంచిది. అనవసరంగా ఒత్తిడి కూడా పడకూడదు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది.
లక్కీ సైన్ - ఒక రత్నం

* కర్కాటక రాశి
మీలో దాగున్న ఎమోషన్స్ మీ గురించి తెలుసుకునే వారికి ఇప్పుడు తెలియవచ్చు. మీరు అనవసరంగా వేరొకరిపై మానసికంగా ఎక్కువగా ఆధారపడుతున్నారు. అలా కాకుండా మీరు స్వతంత్రంగా ఉంటూ జీవితంలో ముందుకు కదలాల్సిన అవసరం ఉంది.
లక్కీ సైన్ - పసుపు రాయి

* సింహ రాశి
మీరు కొంతకాలంగా మీట్ అవ్వని వారు మీకు ఈ రోజు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పవచ్చు. మీలో కొందరు విదేశాల్లో విహారయాత్రకు కూడా ప్లాన్ చేసుకుంటూ ఉండవచ్చు.
లక్కీ సైన్ - ఒక కొవ్వొత్తి

* కన్యా రాశి
ప్రస్తుతం మీరు పరధ్యానంలో ఉన్న వ్యక్తితో ఉంటే, అంత త్వరగా ఆ భావోద్వేగాలను వదిలించుకోలేరు. మీరు పబ్లిక్‌తో వ్యవహరిస్తున్నట్లయితే, మిమ్మల్ని ఎవరో ఒకరు పర్యవేక్షించవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ సైన్ - బుద్ధ విగ్రహం

*తులా రాశి
మీలోని చర్చలు జరిపే లక్షణాలు ఇప్పుడు ఉపయోగపడతాయి. వివరాలు, పర్ఫెక్షన్ పై నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం మీకు ఉంటుంది. మీరు దానిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. దూరం నుంచి ఒకరు మిమ్మల్ని గమనిస్తూ ఉండవచ్చు.
లక్కీ సైన్ - ఒక ఇండోర్ ప్లాన్

* వృశ్చిక రాశి
పనిలో మీ వైఖరిపై గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు పునఃపరిశీలించవచ్చు. ధన లాభాలు పెరుగుతాయి. మీరు త్వరలో కొత్త ప్రాజెక్ట్ కోసం సైన్ అప్ చేయవచ్చు. చేసే వ్యాపారంలో లాభాలుంటాయి.
లక్కీ సైన్ - ఒక గది

* ధనుస్సు రాశి
మీ మెంటల్ స్కిల్స్‌తో మీరు తీసుకొచ్చిన ఓ ప్రభావం ప్రశంసలు దక్కించుకుంటుంది. మీరు కొత్త వర్క్ ఐడియా గురించి ఆలోచిస్తుంటే, అది అతి త్వరలో మీకు అనుకూలంగా మారుతుంది. త్వరలో ఒక రిట్రీట్ ప్లాన్ చేయడం మంచిది.
* లక్కీ సైన్ - ఒక అధిరోహకుడు

* మకర రాశి
ఈ రోజు చాలా మిశ్రమ అనుభవాలతో ముగిస్తుంది. మీరు చాలా సన్నిహితంగా విశ్వసించే వ్యక్తిపై బాగా ఆధారపడుతూ ఉండవచ్చు. నేడు మీరు వారిపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు. మీరు త్వరలో రోడ్ ట్రిప్‌కు వెళ్లే అవకాశం ఉంది.
లక్కీ సైన్ - ఒక సీతాకోకచిలుక

* కుంభ రాశి
మీరు మీ వర్క్ అప్‌గ్రేడ్ చేయడానికి ప్లాన్స్ వేస్తూ ఉండవచ్చు, దీనికి మరికొంత సమయం పట్టవచ్చు. ఏ విషయంలోనైనా సరైన క్షణం కోసం వేచి ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుంచి వచ్చే ఏదైనా సలహా మీకు సంబంధించినదిగా అనిపించకపోవచ్చు.
లక్కీ సైన్ - కాన్వాస్

* మీన రాశి
గతంలో చేసిన పనులకు సంబంధించి మీరు ప్రస్తుతం చాలా పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచు. మీతో మీ భాగస్వామి కూడా అదే విషయాన్ని మీకు గుర్తు చేస్తూనే ఉంటారు. విధి మీకు అతి త్వరలో మరో అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
లక్కీ సైన్ - రెండు ఈకలు
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Rasi phalalu, Zodiac signs

తదుపరి వార్తలు