Today Horoscope (నేటి దిన ఫలం) :జ్యోతిష్యం (Zodiac Signs) ప్రకారం రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 22, సోమవారం నాడు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో పరిశీలిద్దాం.
* మేషం
ఇప్పటికే తీసుకున్న నిర్ణయం గురించి పునరాలోచించడం చాలా అరుదు. అయితే, ఇప్పుడు అలా చేయాలని మీకు అనిపించవచ్చు. ఉదారంగా ఉండాలని మీకు అనిపించవచ్చు. మీరు చేసిన సహాయం వేరే రూపంలో తిరిగి రావచ్చు.
లక్కీ సైన్- డేగ
* వృషభం
ఒప్పుకోవడానికి (Confess), ఎక్స్‌ప్రెస్ (Express) చేయడానికి ఇవాళ అనువైనది. మీరు ఇంతకు ముందు కూడా అలాంటి అవకాశాలను పొంది ఉండవచ్చు. కానీ ఈ హోదాలో ఎప్పుడూ ఉండరు. విషయాలను బాగా అర్థం చేసుకోగలిగేలా మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. ఏదైనా కొత్తగా ప్రారంభించండి.
లక్కీ సైన్ - నల్ల మిరియాలు
* మిథునం
మెచూరిటీతో ఏదైనా పనిని సక్రమంగా చేయవచ్చు. లేకపోతే పనిలో ఇబ్బందులు తప్పవు. మీ దృక్పథంలో విస్తరణ, మెరుగుదలను గమనించవచ్చు. ఈ వారం ఆరోగ్యంపై చిన్నచిన్న ఆందోళనలు ఉండవచ్చు.
లక్కీ సైన్ - పాత సైకిల్
* కర్కాటకం
మీరు ఒక కళాఖండాన్ని సృష్టించి ఉండవచ్చు. కానీ, అది అంత సులభంగా ఆమోదం పొందకపోవచ్చు. ఆఫీస్‌లో పాజిటివ్ మూమెంట్ కనిపిస్తోంది. అయితే అది సాధారణం కంటే నెమ్మదిగా ఉంటుంది. మీరు అందించే ప్రతిఫలం కోసం ఎవరైనా వేచి ఉండవచ్చు.
లక్కీ సైన్ - పెద్ద కప్పు
* సింహం
లోతైన, అర్థవంతమైన సంభాషణలకు ఇవాళ ఆహ్లాదకరంగా ఉంటుంది. విషయాలను అర్థం చేసుకోవడం కోసం కన్వర్జేషన్లో అందరితోపాటు మీరు కూడా పాల్గొనాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు క్రమబద్ధంగా ఉంచుకోవడం ద్వారా త్వరలో ప్రయోజనాలను పొందుతారు.
లక్కీ సైన్- నెమలి ఈక
* కన్య
మీ గత పొరపాటు కొన్ని మచ్చలను మిగిల్చి ఉండవచ్చు. అయితే వాటిని మరచిపోయే సమయం ఆసన్నమైంది. ఈ రోజు మీరు చాలా వరకు పాత స్నేహితుడి నుంచి ఆనందకరమైన ఆశ్చర్యానికి లోనవుతారు. మీ మైండ్ స్పేస్‌ను చాలా వరకు తీసుకున్న గందరగోళానికి త్వరలో స్పష్టత వస్తుంది.
లక్కీ సైన్- పసుపు కొవ్వొత్తి
* తుల
మీకు సంబంధించిన వార్తలు చాలా దూరం ప్రయాణించి ఉండవచ్చు. దీంతో మిమ్మల్ని ఎప్పుడూ కలవని వారు సైతం సంప్రదించవచ్చు. ముఖ్యమైన వ్యక్తుల కోసం సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. మీరు సాధనాలు లేదా విడిభాగాల వ్యాపారంలో ఉన్నట్లయితే, శ్రామికశక్తి సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు.
లక్కీ సైన్- పిరమిడ్
* వృశ్చికం
కొనసాగుతున్న మార్పుల మధ్య జీవితంలో కొత్త ప్యాటర్న్ ఉద్భవిస్తుంది. మీరు చేసిన పనికి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. ఒక చిన్న పర్యటన రెడీగా ఉంది. మీరు ప్రేమించిన వ్యక్తితో ఎక్కువ సమయం గడపవచ్చు.
లక్కీ సైన్ - టార్మాలిన్
* ధనుస్సు
మీరు దేన్నైనా పరిష్కరించలేకపోతే లేదా మరచిపోలేకపోతే.. దాన్ని వదిలివేయడం మంచిది. కొన్ని విషయాలను పరిష్కారం కోసం కాలానికి వదిలివేయడం ఉత్తమం. పనిలో సహకారం కోసం ఆసక్తికరమైన వారిని కలుసుకోవచ్చు. మీ మనస్సు కూడా ప్రస్తుతం వినూత్న ఆలోచనలతో నిండి ఉంది.
లక్కీ సైన్ - టర్కీకోడి
* మకరం
చాలా కాలం తర్వాత మీరు రిలాక్స్‌గా ఉండవచ్చు. దీంతో మీ కోసం సమయం కేటాయించాలని భావిస్తారు. త్వరలో కొత్త పని మార్గాలు ఆవిర్భవిస్తాయి. ఈ మార్గాల కోసం వెతకడం మొదలు పెట్టండి. మీ తోబుట్టువులు కొంత ఆర్థిక ఒత్తిడికి లోనవుతారు.
లక్కీ సైన్ - పట్టు దారం
* కుంభం
కొత్త ఉద్యోగావకాశాలు ఎట్టకేలకు దక్కవచ్చు. మీరు దాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఏదైనా విషయం గురించి మాట్లాడటానికి తల్లిదండ్రులకు మీ నుంచి కొంత సమయం అవసరం కావచ్చు. రాబోయే రోజుల్లో అతిథులు రావచ్చు. ధన ప్రవాహం మెరుగుపడుతుంది.
లక్కీ సైన్ - డిజైనర్ వాచ్
* మీనం
సరళత, సంక్లిష్టత లేని విధానం మీ పనిని సులభతరం చేయవచ్చు. ప్రజల నుంచి ఎక్కువగా ఆశించడం కొన్నిసార్లు కఠినమైన భావాలను పెంపొందించడానికి దారితీయవచ్చు. మీరు నలుగురి దృష్టిలో పడేందుకు చిన్న స్థాయి పార్టీని ఆశించవచ్చు.
లక్కీ సైన్ - పావురం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Rasi phalalu, Zodiac signs