Home /News /astrology /

ASTROLOGY DAILY HOROSCOPE RASI PHALALU EVERYTHING IS AUSPICIOUS FOR THE PEOPLE OF THESE ZODIAC SIGNS HARD WORK WILL BE REWARDED AUGUST 20TH GH PJC TA

Rasi Phalalu: రాశి ఫలాలు.. ఈ రాశుల వారికీ అంతా శుభమే.. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది..

రాశీ ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

రాశీ ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

Today Horoscope (నేటి దిన ఫలం) : ఆగస్టు 20న శని వారం ఒక్కో రాశివారికి ఒక్కో విధంగా గడిచిపోతుంది. రాశిచక్రం (Zodiacs)లోని 12 రాశుల వారికి ఈ రోజు (Horoscope Today) ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
Horoscope Today: (నేటి రాశి ఫలం) : ఈ రోజు  ఆగస్టు 20న 2022 ఒక్కో రాశివారికి ఒక్కో విధంగా గడిచిపోతుంది. రాశిచక్రం (Zodiacs)లోని 12 రాశుల వారికి ఈ రోజు (Horoscope Today) ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం.

* మేష రాశి
అధికారిక విషయాలను పరిశీలించడానికి, రాత పని చేసుకోవడానికి మంచి రోజిది. మీరు ఏవైనా పనులు వాయిదా వేస్తూ ఉండవచ్చు. అవి త్వరలో పూర్తి చేయాల్సి రావచ్చు. గతంలో పరిచయమైన ఒక వ్యక్తి సహాయం కోసం మిమ్మల్ని అడగడానికి ప్రయత్నించవచ్చు.

లక్కీ సైన్ - హెడ్‌ఫోన్

* వృషభ రాశి
ఈ రోజు యాదృచ్ఛికంగా సంఘటనలు జరుగుతాయి. కానీ మీరు ఆ సంఘటనలో కొన్నింటిని ఇప్పటికే ఊహించి ఉండవచ్చు. మీ తోబుట్టువులు చెప్పేదాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నించాలి. కొంత సమయాన్ని వెచ్చించుకోవడానికి, మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోవడానికి మంచి రోజిది.

లక్కీ సైన్ - ఒక నల్ల రాయి

* మిథున రాశి
మీ సహనానికి తగిన ప్రతిఫలం ఊహించిన దాని కంటే త్వరగా దక్కుతుంది. మీ గతం చాలా కష్టాలు, బాధలతో నిండిపోయి ఉండటం వల్ల మీరు మానసికంగా కృంగిపోయి ఉంటే.. మీరు త్వరలో మంచి సలహాదారుని కలవచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులు ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

లక్కీ సైన్ - ఒక తాళం

* కర్కాటక రాశి
గతంలో పరిచయమైన ఓ నమ్మదగిన వ్యక్తి సలహా కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు స్టార్ట్-అప్ వ్యాపారంలో ఉంటే.. ఎక్కువ సంపద పొందే అవకాశం ఉంది. మీరు రాబోయే ప్రాజెక్ట్‌లో పని చేయడానికి ఆసక్తి చూపొచ్చు.

లక్కీ సైన్ - ఒక నోట్‌బుక్

* సింహ రాశి
ఈరోజు మీరు ఎన్నడూ లేని విధంగా చిరునవ్వు నవ్వుతూ సంతోషంగా ఉంటారు. మీ తల్లిదండ్రులు మీతో సమయం గడపాలని అనుకోవచ్చు. కాబట్టి నేడు వారిని కలవడం మంచిది. పోగొట్టుకున్నది ఇప్పుడు మళ్లీ దొరకవచ్చు.

లక్కీ సైన్ - ఒక వెండి కాళ్లపట్టీ

* కన్యా రాశి
ముఖ్యమైన, అర్ధవంతమైన విషయాలపై చర్చలు జరపడానికి ఇదొక అద్భుతమైన రోజు. మీరు బెస్ట్ డీల్ గెలుచుకునే సూచనలున్నాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంటే నేడు కొనుగోలు చేయాలనుకోవచ్చు. ఇవాళ ఎక్స్చేంజ్‌కి మంచి సమయం కూడా.

లక్కీ సైన్ - ఒక డెకరేటివ్ ఫ్రేమ్

* తులా రాశి
తులారాశి వారి జీవితంలో త్వరలో వేడుకలు ప్రారంభమయ్యే అవకాశముంది. మీరు ప్లాన్ చేయకుండానే ఏదైనా జరిగితే.. దానివల్ల మీకు ఒక మంచి సదావకాశం లభిస్తుంది. లేదా ఒక మంచి హోప్ ఇస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపడకూడదు, లేదంటే పరిణామాలు తప్పవు.

లక్కీ సైన్ - ఒక తెర

* వృశ్చిక రాశి
మీరు ప్రాక్టికల్‌గా ఉండటం ఒకరికి బాధ కలిగించవచ్చు. మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్‌ను మెరుగుపరుచుకోవాల్సి రావచ్చు. మీరు అనుకున్నదంతా పూర్తిగా కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు. సన్నిహిత సహచరుడు కూడా మీ పనిని గమనించవచ్చు.

లక్కీ సైన్ - బస్ షెల్టర్

* ధనుస్సు రాశి
మీరు కోరుకున్నంత మంచిగా ఈరోజు గడిచిపోతుంది. అతిగా పెర్ఫార్మ్ చేయడానికి మీ బ్రెయిన్‌పై ఎక్కువ ఒత్తిడి పెట్టకపోవడమే మంచిది. నేడు మీరు ఏదీ పట్టించుకోకుండా పని పూర్తి చేయడానికి సమయం కేటాయించవచ్చు. మీలో శక్తిని ఉరకలెత్తించడానికి & రిఫ్రెష్ చేయడానికి సరైన రోజిది.

లక్కీ సైన్ - ఒక పిచ్చుక

* మకర రాశి
మీరు బాగా హైప్ ఉన్న డెస్టినేషన్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. అది మీ అంచనాలకు తగినంత గొప్పగా ఉండకపోవచ్చు. మీకు సన్నిహితమైన ఓ బంధువు మిమ్మల్ని ప్రేమగా గుర్తుతెచ్చుకుంటూ ఉండొచ్చు. స్టాక్ ట్రేడింగ్‌లో ఉంటే కొనడానికి, విక్రయించడానికి ఇది మంచి రోజు.

లక్కీ సైన్ - సీతాకోకచిలుక

* కుంభ రాశి
ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత లేదా ఏదైనా ఒక దానికి కట్టుబడి ఉన్న తర్వాత మీ మనసును మార్చుకోకూడదు. వర్క్‌ప్లేస్‌లో ఉన్న సీనియర్లు మీ పనితీరును మెచ్చుకుంటారు. త్వరలో మీపై అదనపు బాధ్యత పడొచ్చు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగే అవకాశం ఉంది.

లక్కీ సైన్ - పసుపు నీలమణి

* మీన రాశి
ఒక పనిని పూర్తి చేయడానికి అవసరమైన స్కిల్‌ను మీరు అలవర్చుకోవడం ముఖ్యం. అలానే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మీ బాస్ మీ కోసం ఇప్పటికే కొన్ని ప్లాన్‌లు చేసి ఉండవచ్చు. మీ లైఫ్ మీ అభిరుచికి దగ్గరవడం మీరు గమనించవచ్చు.

లక్కీ సైన్ - వెండి తీగ
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Horoscope, Rasi phalalu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు