Home /News /astrology /

AS PER VASTU SHASTRA REMEMBER THESE RULES WHEN PUTTING ANCESTRAL PHOTOS IN THE HOUSE RNK

ఇంట్లో పూర్వీకుల ఫోటోలు పెట్టేటప్పుడు ఈ నియమాలను గుర్తుంచుకోండి.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vastu shastra: వాస్తు శాస్త్రం ప్రకారం పూర్వీకుల ఫోటోను ఇంట్లో పెట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం చాలా ముఖ్యం. వాటిని పట్టించుకోకపోతే ఇంట్లోని సుఖశాంతులు హరించి పోతాయి. దీంతో పాటు డబ్బు రాబట్టడంలో కూడా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇంకా చదవండి ...
Vasty shastra for ancestral photos: ఇంట్లో ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి ఫోటోను గోడపై పెట్టుకుంటాం. వారిని పూర్వీకులు (Ancestral)  అంటారు. ఇంట్లో పూర్వీకుల ఫోటోలు (Photos) పెట్టడం వల్ల ఇంటిపై కుటుంబ సభ్యులపై పూర్వీకుల ఆశీస్సులు నిలిచి ఉంటాయి. కానీ వాస్తు నియమాల ప్రకారం వారి ఫోటోలను పెట్టుకునన్నప్పుడే ఆశీర్వాదం ,వారి అనుగ్రహం లభిస్తుంది. వాస్తు ప్రకారం పూర్వీకుల ఫోటోను తప్పు ప్రదేశంలో లేదా తప్పు దిశలో ఉంచడం ఒక వ్యక్తి జీవితంపై అననుకూల ప్రభావం చూపుతుంది.

ఇంట్లో తప్పుడు ప్రదేశంలో ఉంచిన పూర్వీకుల ఛాయాచిత్రాలతో ఇంటి ఆనందం, శాంతి ముగుస్తుంది. అలాగే, ఒక వ్యక్తి డబ్బు సంపాదించడంలో అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో పూర్వీకుల ఫోటోలు పెట్టడానికి కొన్ని ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం.



ఇంట్లో పూర్వీకుల ఫోటోలు పెట్టేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి..
1. పూర్వీకుల చిత్రాలను నేరుగా ఎప్పుడూ గోడకు వేలాడదీయకూడదని వాస్తు నిపుణులు నమ్ముతారు. అలా కాకుండా ఫోటోను ఫ్రేమ్‌లో ఉంచాలి.

ఇది కూడా చదవండి: పెళ్లికాని ఆడపిల్లలకు పెళ్లికలలు వస్తే ఏమవుతుంది? ఆ రహస్యం తెలుసుకోండి..


2. బెడ్ రూమ్, కిచెన్ ,డ్రాయింగ్ రూమ్‌లో పూర్వీకుల ఛాయాచిత్రాలను ఉంచడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు పెరుగుతాయి. అలాగే, డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. అంతే కాదు, ఇది పూర్వీకులను అవమానించినట్లు కూడా నమ్ముతారు.

3. ఇంటి పూర్వీకుల ఫోటోను పూజ స్థలంలో లేదా ఇంటి దేవతలతో కూడా పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల దేవతలు కోపించి మీ జీవితంలో సమస్యలు రావచ్చు.

4. ఇంటిలోని వారి ఫోటోలతోపాటు తమ పూర్వీకుల ఫోటోలు పెట్టకూడదని కూడా గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని సభ్యుల ఆయుష్షు తగ్గి, నెగెటివ్ ఎనర్జీ ప్రభావం పెరగడం మొదలవుతుంది.

ఇది కూడా చదవండి:  ఇంట్లో స్టడీ రూమ్ ఎక్కడ ఉండాలి? 8 ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి


5. ఇంటి దక్షిణ గోడపై పూర్వీకుల ఫోటో పెట్టాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు.  ఇది జీవిత బాధలను అకాల మరణ భయాన్ని తగ్గిస్తుంది. ఈ సమయంలో ఇంటి ఉత్తర దిశలో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్ర పటాన్ని పెట్టుకోవడం చాలా మంచిది అంటారు. ఎందుకంటే దక్షిణ దిక్కును యమ దిక్కుగా పరిగణిస్తారని మనకు తెలుసు.

(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)
Published by:Renuka Godugu
First published:

Tags: Vastu Tips

తదుపరి వార్తలు