Vastu shastra: ఆర్కిటెక్చరల్‌ కిచెన్, బెడ్‌రూం ఇటువైపే ఉండాలి!

ప్రతీకాత్మక చిత్రం

Bedroom vastu : మీ పడకగది, వంట గది, బాత్రూం వాస్తు ప్రకారం నిర్మించారో లేదో ఒకసారి చెక్‌ చేసుకోవడం ఎప్పుడూ మంచిదే!

  • Share this:
ఇల్లు కట్టుకునేవారు వాస్తు నియమాలను అనుసరించి నిర్మాణాలు చేపడతారు. దీంతో ఇంటికి శక్తి వస్తుందని నమ్ముతారు. ఆ ఇంటికి పాజిటీవ్‌ ఎనర్జీ వస్తుంది. ఈ నిర్మాణాలను మన పూర్వీకులను అనుసరించేదే వాస్తు అంటారు. వాస్తు దిశల మీద ఆధారపడి ఉంటుంది.

అయితే, మీకు కొత్తగా అపార్ట్‌మెంట్‌కు (apartment) మారాలనుకున్నా.. లేదా ఆ ఇంటిని పునర్నిర్మించాలనుకుంటే వాస్తు నియమాలు అనుసరించి కట్టారా? లేదా? అని తనిఖీ చేయాలి. ఎందుకంటే కిచెన్ (kitchen vastu) , బెడ్‌రూం, బాత్‌రూం వాస్తు ప్రకారం నిర్మించడానికి కాస్త శ్రద్ధ అవసరం. ఆ విధంగా ఇంట్లో ఫర్నిచర్, పరుపు మొదలైనవి ఉండటానికి సరైన స్థలాన్ని ఎంచుకోవాలి.

బెడ్‌రూం డిజైన్‌..
సాధారణంగా ఇంట్లో మాస్టర్‌ బెడ్‌రూం (master bedroom) నైరుతి దిశలో ఉండాలి. బెడ్‌రూంలో లైటింగ్‌ కాస్త తక్కువగా ఉండాలి. అది కళ్లకు చికాకు కలిగించే విధంగా ఉండకూడదు. దీపం లేదా టేబుల్‌ లాంప్‌ పెట్టుకోవడం మంచిది. దీంతో అది మన మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. కిడ్స్‌ బెడ్‌రూం పడమర వైపు మాత్రమే ఉండాలి. ఇక గెస్ట్‌ రూం తూర్పు ముఖంగా ఉండాలి. స్టడీరూం ఆగ్నేయం వైపు ఉండాలి.

ఇది కూడా చదవండి:  మిరియాల కల్తీని ఈ సింపుల్‌ చిట్కాతో గుర్తించండి!

మీ మంచం తలుపు ముందు ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా మీ తల దక్షిణం లేదా తూర్పవైపునకు తల పెట్టి పడుకోవాలి. ఇది మంచి నిద్ర, మెరుగైన ఆరోగ్యానికి సహకరిస్తుంది. ఎప్పుడూ తల ఉత్తరానికి పెట్టి పడుకోకూడదు. ఉత్తరంవైపు నిద్రపోవడం వల్ల మానసిక అనారోగ్యం, ఆయుర్ధాయం తగ్గుతుంది.

వార్డ్‌రోబ్‌.. అల్మారాలు దక్షిణ, నైరుతి లేదా పడమర వైపు పెట్టుకోవాలి. అది చాలా మంచిది.
బెడ్‌రూం రంగులు.. పడకగదికి అనువైన రంగులు లేత గులాబీ, బూడిద, నీలం, ఆకుపచ్చ వాడాలి.

ఇది కూడా చదవండి:  ఈ ఫుడ్‌ తింటే.. పిల్లలకు కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం!

కిచెన్‌..
మీ వంటగదిని డిజైన్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నపుడు కొన్ని అంశాలను గుర్తుపెట్టుకోవాలి. కిచెన్‌ ఆగ్నేయంలో ఉండాలి. ఆర్కిటెక్చరల్‌ డిజైన్‌ ప్రకారం వంటగది ఆగ్నేయ ప్రాంతంలో అగ్ని, గ్యాస్‌ స్టవ్, సిలిండర్లు, మైక్రోవేవ్, ఓవెన్, ఇతర ఉపకరణాలు ఉంచాలి.అదేవిధంగా వాష్‌బేసిన్లు, వంటస్టవ్‌ ఒకే ప్లాట్‌ఫారమ్‌లో ఉంచరాదు. వాటిని ఒకదానికొకటి సమాంతరంగా ఉంచవద్దు. అలాగే వాష్‌బేసిన్‌లు,వాషింగ్‌ మెషీన్, కిచెన్‌ డ్రెయిన్లు ఉత్తర లేదా ఈశాన్యంవైపు ఉండేలా చేయాలి. జీవితంలో అడ్డంకులు అధిగమించడానికి రిఫ్రీజిరేటర్‌ నైరుతి దిశలో పెట్టుకోవాలి.

బాత్‌రూం..
మీ బాత్‌రూం ఇంటికి వాయువ్యంలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే, ఇది వ్యర్థాల తొలగింపునకు మద్ధతు ఇస్తుంది. బాత్‌రూంలో ఎల్లప్పుడూ ఒక చెక్క తలుపు ఉండాలి. అలాగే నెగిటీవ్‌ ఎనర్జీని నివారించడానికి ఎల్లప్పుడూ తలుపును మాసి ఉంచాలి. అలాగే బాత్‌రూంలో ఏ బొమ్మలు పెట్టకూడదు. బాత్‌రూం, పడకగదికి, పూజగదికి లేదా వంటగది గోడకు ఉండకూడదు. ఎందుకంటే ఇది ఇంటికి ప్రతికూల శక్తిని తీసుకువస్తుంది. వాష్‌బేసిన్, షవర్‌ను బాత్‌రూంలో తూర్పు, ఉత్తర, ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి.
Published by:Renuka Godugu
First published: