Home /News /astrology /

AS PER VASTU REMOVE THIS TYPE OF CALENDAR FROM HOME RNK

Calendar 2022: జాగ్రత్త.. ఈ క్యాలండర్ మీ ఇంట్లో ఉంటే.. ఆ ఏడాది మొత్తం అశుభమే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Calendar direction: వాస్తు శాస్త్రం ప్రకారం పాత క్యాలెండర్ ఇంట్లో పెట్టకూడదని మీకు తెలుసా? ఈ క్యాలెండర్ ఇంటికి అశుభకరమైనదిగా పరిగణిస్తారు.

కాలం మారుతోంది , కొత్త సంవత్సరం (New year 2022) ఇప్పుడే ప్రారంభమైంది. ప్రతి ఇంట్లో కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రధాన తిథి, పండుగలను తెలుసుకునేందుకు వీలుగా కొత్త క్యాలెండర్‌ను (Calendar) కూడా తెచ్చుకుంటారు అయితే వాస్తు శాస్త్రం (Vastu shastra)ప్రకారం పాత క్యాలెండర్‌ను ఇంట్లో ఉంచకూడదని మీకు తెలుసా? ఈ క్యాలెండర్ ఇంటికి అశుభకరమైనదిగా పరిగణిస్తారు. క్యాలెండర్ ఎక్కడ పెట్టాలో ఎవరూ పట్టించుకోరు. వాస్తుశాస్త్రం ప్రకారం, క్యాలెండర్‌లను పెట్టుకోవడానికి సరైన దిశలను కూడా పెర్కొన్నారు. క్యాలెండర్ సరైన దిశలో పెడితేనే ఈ ఇంట్లో అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉంటాయి.

పాత క్యాలెండర్‌ను తొలగించండి..
ఇంటి నుండి పాత క్యాలెండర్ తప్పకుండా తొలగించాలి. ఇది మీ మనస్సును అలాగే మీ పురోగతిని నిలిపివేస్తుంది. సమయం మంచిదైనా, చెడ్డదైనా, మీ మనస్సు ఆ సమయంలో కూరుకుపోయి ఉంటుంది. కొత్త సంవత్సరంలో కొత్త క్యాలెండర్ ఉంచండి, తద్వారా కొత్త సంవత్సరం పాత సంవత్సరం కంటే ఎక్కువ శుభావకాశాలను కలిగి ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం క్యాలెండర్ ఏర్పాటు చేసుకోవడానికి.. ఒక ప్రత్యేక దిశ నిర్దేశించబడింది.

తూర్పు ముఖంగా క్యాలెండర్..

క్యాలండర్ తూర్పు ముఖంగా ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. తూర్పు దిక్కుకు అధిపతి సూర్యుడు. నాయకత్వ దేవుడు అంటారు. దీనివల్ల ప్రతి శుభకార్యం పురోగమిస్తుంది. ఇది కాకుండా, తూర్పు ముఖంగా ఉన్న క్యాలెండర్‌తో ఎరుపు లేదా గులాబీ రంగు కాగితంపై ఉదయించే సూర్యుని చిత్రాన్ని ఉంచడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు.

క్యాలెండర్‌ను పశ్చిమవైపుగా..

ఇంటి ఉత్తరం, పడమర లేదా తూర్పు గోడపై క్యాలెండర్ ఉంచడం మంచిది. పశ్చిమం వైపున క్యాలెండర్‌ను పెట్టుకోవడం వల్ల మీ అన్ని పనులు వేగవంతం అవుతాయి. మీ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి.

ఇది కూడా చదవండి: సింగిల్ అయ్యారని బాధపడకండి.. మీకున్న ప్రయోజనాలు తెలుసుకోండి..


క్యాలెండర్‌ను దక్షిణం వైపు ఉంచవద్దు..
ఇంట్లో క్యాలెండర్‌ను ఏర్పాటు చేసేటప్పుడు, ఎప్పుడూ దక్షిణం వైపు ఉంచకూడదని గుర్తుంచుకోండి. వాస్తుశాస్త్రం ప్రకారం, పంచాంగాన్ని క్యాలండర్ దక్షిణం వైపు ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు, శోభ తగ్గుతుంది. దక్షిణ దిశలో క్యాలెండర్‌ను పెట్టడం వల్ల ఆ ఇంట్లో నివసించే లేదా పనిచేసే వారి పని పురోగతిలో సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు.

క్యాలెండర్‌ను ఉత్తరం వైపుగా ఉంచండి...

క్యాలెండర్‌ను ఉత్తర దిశలో ఉంచడం మంచిది. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశను కుబేరుడి దిశగా పరిగణిస్తారు. పంచాంగాన్ని ఉత్తరాభిముఖంగా ఉంచడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఉత్తరాన క్యాలెండర్‌తో పాటు, మీరు పచ్చదనం, జలపాతాలు, ప్రవహించే నది లేదా పవిత్రమైన వివాహ చిత్రాలను కూడా ఉంచవచ్చు. ఇది ఆ ఇంటికి మంచిని తీసుకువస్తుంది.

ఇది కూడా చదవండి:  ఈ 4 రాశులవారిని తక్కువ అంచనా వేయకండి.. ఎందుకంటే వారి ట్యాలెంట్ ఎప్పటికీ మీ ఊహకు అందనిది..


క్యాలెండర్‌లో హింసాత్మక జంతువులు..
వాస్తు శాస్త్రం ప్రకారం, క్యాలెండర్ పేజీలో హింసాత్మక జంతువుల చిత్రాలు, విచారకరమైన ముఖాలు ఉండకూడదు. ఈ తరహా చిత్రాలు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ప్రభావాన్ని పెంచుతాయి కాబట్టి పొరపాటున అలాంటి చిత్రాలతో కూడిన క్యాలెండర్ ను ఇంట్లో పెట్టకూడదు.

ప్రధాన ద్వారం ముందు..
క్యాలెండర్‌లో ఉదయించే సూర్యుని చిత్రం ఉంటే, అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే, ఇంటి ప్రధాన ద్వారంపై క్యాలండర్ ఉంచడం అశుభం.
Published by:Renuka Godugu
First published:

Tags: Vastu Tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు