Home /News /astrology /

Vastu tips: ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఎప్పటికీ ఖాళీ అయిపోకూడదు..

Vastu tips: ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఎప్పటికీ ఖాళీ అయిపోకూడదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vastu tips: వంటగదిలో అన్నం పూర్తిగా అయిపోతే దానికి శుక్రుడే కారణం. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. అందువల్ల అన్నం ఇంట్లో ఎప్పుడూ అయిపోకూడదు.

మనం ఏ పని అయినా వాస్తు శాస్త్రాన్ని (vastu shastra) అనుసరించి చేస్తాం. అది శుభకార్యమైనా.. ఇల్లు కట్టడం, పెళ్లి వంటివి కూడా దీని ప్రకారమే చేస్తాం. కానీ, వాస్తు ప్రకారం వంటగదిలో కొన్ని వస్తువులపై జాగ్రత్తగా ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
లక్ష్మీదేవిని (lakshmi devi) సంతోష పెట్టడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తారు. ఆ తల్లి సంతోషిస్తే.. బికరీని కూడా రాజుగా చేస్తుందని నమ్మకం. ఒకవేళ అమ్మ ఆగ్రహిస్తే.. దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు.

పిండి..
ప్రతి వంటగదిలో పిండి ఉండాలి. ఎందుకంటే పిండి లేనిదే రొట్టె తయారు కాదు. దీంతో మన కడుపు నిండటం కూడా కష్టమవుతుంది. మీ ఇంట్లో పిండి ఉన్నా.. అది నెలఖరులో అయిపోవడానికి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ముందుగానే పిండిని ఇంటికి తెచ్చుకోవాలి.తద్వారా పిండి అయిపోకుండా ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం అయిపోయిన పిండి అశుభంగా పరిగణిస్తారు. దీనివల్ల గౌరవం కోల్పోతారు.

ఇది కూడా చదవండి:  కార్తీకమాసం మొదటి శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా కొలిస్తే.. ధనవర్షం..!

పసుపు..
పసుపును (turmeric)  ఆహారంలో రంగును జోడించడంతోపాటు యాంటీ బ్యాక్టిరియల్‌గా కూడా పనిచేస్తుంది. శుభకార్యాల్లో కూడా పసుపుది ప్రధాన పాత్ర. ఇంట్లో పసుపు అయిపోయిన తర్వాత తీసుకవస్తే అది దరిద్రానికి దారితీస్తుందని జోతిషులు చెబుతున్నారు. ఇది బృహస్పతికి నచ్చదు. వంటల్లో పసుపు తక్కువగా ఉంటే.. శుభకార్యాలకు ఆటంకం ఏర్పడుతుంది.అందువల్ల పసుపును వంటగదిలో పూర్తిగా వినియోగించే ముందు మార్కెట్‌ నుంచి కొత్త ప్యాకెట్‌ను తీసుకురావాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఉప్పు..
ఉప్పు లేని ఆహారం రుచించదు. అది నోట్లో కూడా పెట్టుడానికి పనికిరాదు. అదేవిధంగా మీరు వంటలో ఉప్పు అయిపోతే.. జీవితం అది మీ జీవితంపై ప్రభావం పడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో ఉంచిన ఉప్పుడబ్బా ఎప్పటికీ ఖాళీ చేయకూడదు. ఒకవేళ అలా జరిగితే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అది ఇంట్లో సమస్యలను చిందరవందరగా చేయడంతోపాటు అనేక సమస్యలకు దారితీస్తుంది.

ఇది కూడా చదవండి: పూజగదిని ఇలా పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

బియ్యం..
చాలా మంది తమ అవసరాన్ని బట్టి బియ్యం ఇంట్లో పెట్టుకుంటారు. బియ్యం అయిపోవడానికి వస్తే.. నెలాఖరులో బియ్యం తెచ్చుకుంటారు. వంటలో అన్నం ఉండటం చాలా ముఖ్యం. అలాగే వంటగదిలో ముఖ్యమైంది కూడా బియ్యం. ఒకవేళ వంటగదిలో అన్నం పూర్తిగా అయిపోతే దానికి శుక్రుడే కారణం. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. అందువల్ల అన్నం ఇంట్లో ఎప్పుడూ అయిపోకూడదు.
Published by:Renuka Godugu
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు