AS PER VASTU BRINGING YELLOW MUSTARD TO HOME MAKE YOU RICH RNK
Vastu tips: మిమ్మల్ని ధనవంతులు చేసే పసుపు అవాల రెమిడీ.. ఈరోజే ఇంటికి తెచ్చుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
Vastu tips: జ్యోతిషశాస్త్రంలో ఒక వ్యక్తి అనుభవించే అనేక సమస్యలకు నివారణలు ఉన్నాయి. దీన్ని అవలంబించడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. దీని కోసం జ్యోతిషశాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారిని సంప్రదించడం అవసరం. ఈ చర్యలు ఒక వ్యక్తి జీవితంలో ఆనందాన్ని కలిగిస్తాయని చాలా సార్లు రుజువైంది కూడా.
Vastu tips: ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం, శ్రేయస్సు, పురోగతి మంచి ఆరోగ్యాన్ని (Health) కోరుకుంటాడు. దీని కోసం అతను కూడా కష్టపడి పనిచేస్తాడు. కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం 100% లభించదు. అటువంటి పరిస్థితిలో వ్యక్తి జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు జ్యోతిష్య (Astrology) శాస్త్రంలో వివిధ పరిహారాలు చెప్పారు. ఈ చర్యలు చేయడం ద్వారా పనిలో విజయం సాధించడంతోపాటు కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ నివారణలలో ఒకటి పసుపు ఆవాల నూనె తో చేసే కొన్ని నివారణలు ఉన్నాయి. దీని గురించి జ్యోతిష్యుడు హితేంద్ర కుమార్ శర్మ వివరంగా చెప్పారు.
డబ్బుకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం..
దీర్ఘకాలంగా డబ్బుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు గురువారం రోజు పసుపు ఆవాలును గంగాజలంతో కడిగి, కర్పూరంతో పసుపు గుడ్డలో కట్టి ఇంటి ప్రధాన ద్వారంపై వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
ప్రతికూల శక్తిని తొలగించడానికి..
ఒక వ్యక్తి తన ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని భావిస్తే, అలాంటి వారు తమ ఇంట్లో ప్రతిరోజూ పసుపు ఆవాలు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరగడంతో పాటు ఇంట్లో ఆహారం, ధనం పెరుగుతాయని నమ్మకం.
ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి..
కష్టపడి పనిచేసినా ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే, పసుపు ఆవాలు తీసుకుని ఇంటి పైభాగలో, ఇంటి బయట ఎక్కడైనా వేయాలి. జ్యోతిష్యం ప్రకారం ఇలా చేయడం వల్ల వ్యాపార, ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. దీనితో పాటు ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది.
దృష్టి దోషాల నివారణ కోసం..
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి లేదా అతని ఇంటిలో దృష్టిదోషాలు ఉంటే ఇంట్లోని అన్ని గదులలో కొన్ని పసుపు ఆవాలు చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని దృష్టిదోషం తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం.(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.