Home /News /astrology /

AS PER OUR HINDU RELIGION WIFE MUST NOT CALL HER HUSBAND BY NAME RNK

భర్తని పేరు పెట్టి పిలిస్తే... ఏమవుతుందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మన హిందు సంప్రదాయంలో భర్తను పేరు పెట్టి పిలవకూడదు. కానీ, మారుతున్న సంస్కృతి ఆచరణలు వల్ల ఒకరిని మరొకరు పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. అయితే, కొన్ని నియమాల ప్రకారం అలా పిలవకూడదు.

మనం సాధారణంగా కుటుంబ సభ్యులను ఎవరినీ కూడా పేరుపెట్టి పిలవం. ఎందుకంటే తనకన్నా వయస్సులో పెద్దవారు ఉంటే.. పేరు పెట్టి పిలవం. లేకపోతే పేరు పక్కన అన్న అని జత చేసి పిలుస్తారు. జోతిష శాస్త్రం ప్రకారం ఇలా తన కంటే పెద్ద వారిని పేరు పెట్టి పిలిస్చే ఆయుఃక్షయం అవుతుందట. అది పిలిచిన వారికి. ఈ పాశ్చత్య సంస్కృతి ప్రకారం ఇలా పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల భర్త husband గౌరవంతోపాటు మీ గౌరవం కూడా తగ్గుతుంది. ప్రధానంగా పెద్దవారు అయిన భర్తను పేరు పెట్టి పిలవకూడదు.

జోతిషం ప్రకారం భర్త పెద్ద వయస్సు ఎక్కువగా ఉండాలి కాబట్టి... ఆడపిల్ల వయస్సు చిన్నదిగా ఉండాలి అంటారు. ఇది ఎందుకంటే అమ్మాయికి మెచూరిటీ మైండ్‌ త్వరగా వస్తుంది కాబట్టి. ఇది ప్రకృతిలో సహజం. అందువల్ల నాలుగైదేళ్లు కచ్ఛితంగా ఉండాలి అంటారు. భర్తని మాత్రమే కాదు, ఈరోజుల్లో అమ్మ,నాన్నలను కూడా పేరు పెట్టేసి పిలుస్తున్నారు. అదే పూర్వ కాలంలో అమ్మనాన్నల పేర్లుకూడా చిన్నపుడు తెలిసేవి కావు. ముఖ్యంగా పెద్దవారిని గౌరవించడం ప్రధానం.

అద్దె ఇంట్లో ఉన్నా.. ఐశ్వర్యప్రాప్తి కలగాలంటే..!



ఆయు పెరగటానికి ఇదో మంచి మార్గం. ఇక మన సనాతన ధర్మం కూడా ఒప్పుకోదు అంటారు. తమ కంటే చిన్నవారిని పేరు పెట్టి పిలవవచ్చు. కేవలం భార్యాభర్తల బంధంలో పేరు పెట్టి పిలవకూడదు అంటారు. ఈ ఆధునిక కాలంలో మన సంస్కృతి సాంప్రదాయంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో భార్యాభర్తలు ఒకరిని మరొకరు పేరు పెట్టి పిలుచుకుంటారు. భర్తను గౌరవించడం కూడా మన సాంప్రదాయం కాబట్టి.. భర్తను పేరు పెట్టి పిలువకూడదు అంటారు. అయితే, భర్తను పేరు పెట్టి పిలవాలని కోరిక ఉంటుంది.

అలాంటి వారు ఎవరూ లేనప్పుడు కేవలం ఏకాంతంగా ఉన్న సమయంలో పేరు పెట్టి పిలవవచ్చు. నలుగురిలో ఉన్నపుడు ఏవండి! అని పిలవచ్చు. అలాగే భార్యను భర్త కూడా అంతే గౌరవంగా పిలవాలి. ఇంకా మంచిది అంటే.. భార్య.. భర్తను శ్రీవారూ.. అన్ని, భర్త.. భార్యను శ్రీమతి! అని పిలవవచ్చు. ఇలా ప్రేమగా పిలవడం వల్ల అటువంటి ఇల్లలో లక్ష్మీనారాయణ స్వామి కొలువై ఉంటాడని, సుఖసంతోషాలతో అషై్టశ్వర్యాలు కొలువైఉంటాయని మన శాస్త్రం చెబుతుంది. ఏది ఏమైనా.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి మరొకరు గౌరవం ఇచ్చుకుంటూ.. అన్యోన్యంగా మెలిగితే వారి సంసారం ఎంతో అందంగా ముందుకు సాగుతుంది.
Published by:Renuka Godugu
First published:

Tags: Wife and husband

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు