Numerology: పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. పిల్లలకు పుట్టిన తేదీలోని అంకెల ఆధారంగా ఆల్ఫాబెట్ సెలక్ట్ చేసుకుని పేరు పెడితే మేలు జరుగుతుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ఆ ప్రభావంతో ఉన్నత స్థానాలు అందుకుంటారని, కీర్తి, ప్రతిష్టలు దక్కుతాయని నమ్ముతారు. న్యూమరాలజీ ప్రకారం.. ఆల్ఫాబెట్ Qతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఆల్ఫాబెట్ Q:
ఇంగ్లీష్ లెటర్ Q నిజాయితీగా జీవించాలనే కోరికను సూచిస్తుంది. Qతో పేరు మొదలయ్యే వ్యక్తుల జీవితం నిజాయితీ, అంకితభావం చుట్టూ తిరుగుతుంది. వీరు ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని కలిగి ఉంటారు. వారు ఒక ఉద్దేశంతో జీవిస్తారు. వారి లక్ష్యం ప్రస్తుత పరిస్థితులతో రాజీపడదు, ఎలాంటి త్యాగం చేయరు. తమ విలువలు, సూత్రాలపై దృఢంగా ఉంటారు. కొన్ని విషయాల కోసం వారు చాలా శ్రమపడాల్సి వస్తుంది. అయితే వారి నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో వారి ప్రశాంతత, కంపోజ్డ్ పర్సనాలిటీ సపోర్ట్ చేస్తుంది.
వీరు ఎప్పుడూ విపరీతమైన విషయాలలో మునిగిపోరు. చాలా సమర్ధవంతమైన నాయకులు. విధేయతను విశ్వసిస్తారు, విశ్వసనీయ అనుచరులను పొందుతారు. వారు పండితులు, విద్యావేత్తలు కావచ్చు. ఆలోచనాపరులు, తత్వవేత్తలు, రచయితలు లేదా సంగీతకారులు కావచ్చు.
పిల్లలు, వ్యాపారవేత్తల గుణాలు:
లెటర్ Qతో పేరు మొదలయ్యే వ్యాపారవేత్తలు గ్రూప్‌లో పని చేస్తేనే ఉన్నతంగా ఎదుగుతారు. ఒక వేళ ఏదైనా కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తుంటే.. వారు తమ సొంత వ్యాపారంలో ప్రత్యేకంగా కుటుంబ వ్యాపారంలో పని చేయడం మంచిది. పిల్లలు అకడమిక్స్‌లో బాగా రాణిస్తారు. టెక్నాలజీ, సైన్స్ రంగాల వైపు ఆసక్తి చూపుతారు.
మహిళలకు ఇలా:
లెటర్ Qతో పేరు మొదలయ్యే స్త్రీలు రీసెర్చ్, టీచింగ్ రంగాలను ఎంచుకోవాలి. వీళ్లు దేవుడి శక్తిని బలంగా, గుడ్డిగా అనుసరిస్తున్నారు. వీరికి ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే ముందుగా ఆయుర్వేదం లేదా రేకి వంటి వైద్యం సహాయం తీసుకోవాలి.
లక్కీ కలర్స్: బ్లూ, గ్రే
లక్కీ నంబర్స్: 5, 6
పరిహారం:
Qతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఇంటి నుంచి బయలుదేరే ముందు పెద్దలు, పూర్వీకుల పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి. లిక్కర్ తాగడం, నాన్ వెజ్ తినడం మానేయండి. ఆకర్షణ కోసం లెదర్ ప్రొడక్టులు వినియోగించడం మానేయండి, వాటికి దూరంగా ఉండండి. ఇంటి చుట్టూ ఉన్న పచ్చని తోట అదృష్టం తీసుకొస్తుంది. జంతువులకు ఉప్పగా ఉండే ఆహార పదార్థాలు అందజేయండి.
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Numerology