హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Vastu Tips: అప్పుల ఊబిలో చిక్కుకోవద్దంటే ఈ వాస్తు చిట్కాలను పాటించండి.. ఎప్పుడూ కాసుల పంటే!

Vastu Tips: అప్పుల ఊబిలో చిక్కుకోవద్దంటే ఈ వాస్తు చిట్కాలను పాటించండి.. ఎప్పుడూ కాసుల పంటే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vastu Tips: వాస్తు సూత్రాల ప్రకారం, మీ ఇల్లు, ఆఫీసును వాస్తు ప్రకారం బ్యాలెన్స్ చేయడం వల్ల మీకు ఎల్లప్పుడూ శుభమే కలుగుతుంది. అంతేకాదు, అప్పుల ఊబిలో చిక్కుకోకుండా.. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

ప్రతి ఒక్కరూ తమ చేతినిండా డబ్బు ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే జీవితంలో అన్ని అవసరాలు, ఆనందాలను నెరవేర్చుకోవడానికి డబ్బు చాలా అవసరం. అయితే కొంత మంది ఎంత సంపాదించినా సరే అస్సలు డబ్బు నిలవక అప్పులు చేస్తుంటారు. మరికొందరు ఉన్న దానిలో సంతృప్తి పడుతూ ఇతరులకు అప్పు ఇచ్చే స్థానంలో ఉంటారు. ఎంత సంపాదించినా అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలు పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీ ఇల్లు, కార్యాలయాన్ని వాస్తుకు అనుగుణంగా నిర్మించడం ద్వారా అనేక సమస్యలు తొలగుతాయని సూచిస్తున్నారు.

ఇల్లు, కార్యాలయంలో వాస్తుకు అనుగుణంగా వస్తువులను అమర్చుకోవడం మంచిదంటున్నారు. ఇలా అన్ని విషయాల్లో వాస్తును పాటించడం ద్వారా మీ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ, డబ్బును తెచ్చిపెడుతుందని స్పష్టం చేస్తున్నారు. వాస్తు సూత్రాల ప్రకారం, మీ ఇల్లు, ఆఫీసును వాస్తు ప్రకారం బ్యాలెన్స్ చేయడం వల్ల మీకు ఎల్లప్పుడూ శుభమే కలుగుతుంది. అంతేకాదు, అప్పుల ఊబిలో చిక్కుకోకుండా.. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

* ఏ దిశలో ఎలాంటి వస్తువులు ఉండకూడదు?

ఈశాన్యం

సాధారణంగా మనం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. ఈశాన్యంలో చెత్తకుండీ, మరుగుదొడ్డి, డ్రైనేజీ పిట్, చీపురు వంటి వస్తువులు అస్సలు పెట్టకండి. అవి మీ ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. దీంతోపాటు వాస్తు ప్రకారం ఇవి అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తాయి.

తూర్పు ఆగ్నేయం

తూర్పు ఆగ్నేయ దిశలో వాస్తు పాటించకపోవడం వల్ల ఆందోళనలు పెరుగుతాయి. పూర్వ కాలంలో ఈ దిశలోనే వెన్న తయారీ చేసేవారు. అందువల్ల, ఇప్పుడు మిక్సర్-గ్రైండర్ను ఈ దిశలో పెట్టుకోవడం మీకు కలిసొస్తుంది. ఈ దిశలో వాస్తు దోషాలు ఉంటే మీకు నెగెటివ్ ఆలోచనలు వస్తుంటాయి.

దక్షిణ నైరుతి పశ్చిమ దిశ

వాస్తు ప్రకారం దక్షిణ- నైరుతి- పశ్చిమ దిశ వృథా ఖర్చులకు పెట్టింది పేరు. మీరు ఈ జోన్‌లో నిద్రిస్తే లేదా మీ ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉన్నట్లయితే మీరు అప్పుల పాలవుతారు. అందువల్ల, ఈ దిశలో ప్రధాన ద్వారం పెట్టకండి.

ఉత్తర, ఆగ్నేయ దిశలు

అవకాశాలకు వారధి ఉత్తరం దిశ. నగదు ప్రవాహానికి వారధి ఆగ్నేయ దిశ. ఉత్తరం దిశలోని గోడలకు ఎరుపు వేయడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. అదేవిధంగా ఆగ్నేయంలోని నీలం రంగు మీ నగదు ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి ఈ దిశల్లో ఎరుపు, నీలం రంగు గోడలకు వేయవద్దు.

* ఈ జాగ్రత్తలు పాటించండి..

ఇల్లు, ఆఫీసులో వాస్తు పాటించకపోవడం వల్ల రుణ ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీ ఇంట్లోని అన్ని దిశల్లో వస్తువులను సరిగ్గా అమర్చుకోకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కులో వాస్తు పాటించకపోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయి. ఇక, ఆగ్నేయ తూర్పు దిశలో వాస్తు పాటించకపోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది.

ఇది కూడా చదవండి : కొత్తగా పెళ్లి చేసుకున్నారా? బెడ్‌రూమ్‌‌లోని మంచం విషయంలో ఈ వాస్తు టిప్స్ పాటించండి..

దక్షిణ దిశలో వాస్తు పాటించకపోవడం వల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. తద్వారా అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. ఉత్తరం దిశలో వాస్తు పాటించకపోవడం వల్ల మీ ఉద్యోగ, వ్యాపార అవకాశాలు తగ్గుతాయి. ఇక, సౌత్ ఈస్ట్ జోన్​లో వాస్తు పాటించకపోవడం వల్ల మీ చేతిలో నగదు ప్రవాహం తగ్గుతుంది. ఆయా జోన్లలో వాస్తు అసమతుల్యత వల్ల రుణాలు, అప్పులు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు, వాస్తు చిట్కాలను సరిగ్గా పాటించడం వల్ల ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఒకవేళ, తప్పని పరిస్థితుల్లో రుణం లేదా అప్పు తీసుకోవాల్సి వచ్చినా.. దాన్ని ఎలా తీర్చాలనే దానిపై స్పష్టత ఏర్పడుతుంది.

First published:

Tags: Home loan, Life Style, Vastu Tips

ఉత్తమ కథలు