Gujarat Jagannath RathYatra: ఇవాళ పూరీ జగన్నాథ రథయాత్రతోపాటూ... గుజరాత్లో కూడా జగన్నాథ రథయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ఏనుగుకు ఏం పెట్టారన్నది ఆసక్తిగా మారింది.
Ahmedabad Jagannath RathYatra: నేడు గుజరాత్... అహ్మదాబాద్లో జగన్నాథ రథయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా... కేంద్ర హోంమంత్రి అమిత్ షా... అహ్మదాబాద్ విచ్చేశారు. అక్కడి రథయాత్ర ముందు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా... ఆలయంలోని ఏనుగు నుంచి ఆశీర్వాదం పొందారు. ఈ సమయంలో... ఆయన గజరాజుకు... ఓ చెరుకుగడ అందించారు. దాన్ని వెంటనే నమిలేసిన ఏనుగుకు... మళ్లీ అరటిపండ్లు అందించారు. వాటిని కూడా తీసుకున్న ఏనుగు... ఆనందంగా తినేసింది. ఆ తర్వాత ఏనుగు తలపై చెయ్యి వేసి... సరదాగా నిమిరారు హోం మంత్రి అమిత్ షా.
ఈ సమయంలో... అమిత్ షాతోపాటూ... అధికారులు, ఆలయ పూజారులు, భక్తులు ఉన్నారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
ఈ వీడియో బాగుందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తిపై అన్ని రాష్ట్రాలనూ కరోనాపై అప్రమత్తం చేసే అమిత్ షా... మాస్క్ లేకుండా ఈ కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఓ రూలూ... పాలకులకు మరో రూలా అని మండిపడుతున్నారు.
దేశంలో రెండో పెద్ద జగన్నాథ రథయాత్రగా అహ్మదాబాద్ రథయాత్రకు పేరుంది. నేటి ఉదయం 7 గంటలకు ఇది మొదలవుతుంది. 144వ సారి... జగన్నాథస్వామి, సుభద్రాదేవి, బలభద్రుడు రథాలు నగరంలో సాగనున్నాయి. ఈ కారణంగా... 19 కిలోమీటర్ల మార్గంలో కర్ఫ్యూ అమల్లో ఉంది. మధ్యాహ్నానికి రథయాత్ర ముగుస్తుంది. కరోనా కారణంగా.... ఈసారి మూడు రథాలతోపాటూ... మొత్తం 5 వాహనాలు మాత్రమే ఈసారి రథయాత్రలో ఉంటాయి. ఈసారి ఏనుగులు రథయాత్రలో పాల్గొనవు. భక్తులు కూడా రథయాత్ర మార్గంలో ఉండేందుకు వీలు లేదు.
గతేడాది కరోనా వల్ల రథయాత్ర ఆలయంలో మాత్రమే జరిగింది. ఈసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా... మంగళ హారతి ఇస్తారు. ఏటా ఇదో సంప్రదాయంగా జరుగుతోంది. ఈసారి రథయాత్రను ప్రజలు ఆన్లైన్, టీవీల్లో చూడవచ్చు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.